Mattresses company
-
సెంచురీ మ్యాట్రెసెస్ అంబాసిడర్‌గా పీవీ సింధు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే మూడేళ్లలో ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్ (ఈబీవో) సంఖ్యను 1,000కి చేర్చుకోనున్నట్లు సెంచురీ మ్యాట్రెసెస్ ఈడీ ఉత్తమ్ మలానీ తెలిపారు. ప్రస్తుతం 500 ఉండగా మరో 500 స్టోర్స్ ప్రారంభించనున్నట్లు వివరించారు. తెలంగాణలో 100 ఈబీవోలు ఉన్నాయని, ఈ ఏడాది చివరికి 200కు పెంచుకుంటున్నామన్నారు. మరోవైపు, దేశీయంగా మ్యాట్రెస్‌ల మార్కెట్ రూ. 10,000 కోట్లుగా ఉండగా సంఘటిత రంగ వాటా 40శాతం అని, ఇందులో తమకు 10% వాటా ఉందని, దీన్ని మూడేళ్లలో 20 శాతానికి పెంచుకోనున్నామని వివరించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న సందర్భంగా మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలానీ ఈ విషయాలు చెప్పారు. ఆదాయాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 35 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యకరమైన స్లీప్ సొల్యూషన్స్ అందిస్తూ సెంచురీ అందరీ నమ్మకాన్ని చూరగొందని సింధు తెలిపారు. -
సెంచురీ మ్యాట్రెస్ గుడ్‌న్యూస్: 50 శాతం డిస్కౌంట్
హైదరాబాద్: ప్రముఖ పరుపుల తయారీ సంస్థ సెంచురీ మ్యాట్రెస్ తన వెబ్సైట్నుమరింత వినియోగ అనుకూలంగా మార్పు చేసినట్టు ప్రకటించింది. కస్టమర్లు తమకు అనుకూలమైన మ్యాట్రెస్‌ను సులభంగా తెలుసుకునే విధంగా అభివృద్ధి చేసినట్టు తెలిపింది. అదే సమయంలో ‘స్లీప్ స్పెషలిస్ట్ సేల్’ పేరుతో అమ్మకాల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. తమ ఫోమ్-ఆధారిత ప్రొడక్ట్స్‌కు సెర్టిపుర్-యూఎస్, బీఐఎస్,ఓయికో టెక్స్ క్లాస్-1 సర్టిఫికేషన్లతో పరుపులను అందిస్తున్నట్టు తెలిపింది. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ , ISO 9001-2015 సర్టిఫికేషన్ ఉన్న తొలి ఇండియన్ మ్యాట్రెస్ కంపెనీ అని పేర్కొది. ఇదీ చదవండి : IPL victory: ఈ మిరాకిల్ నీకే సాధ్యం,చెన్నైకి రా సెలబ్రేట్ చేసుకుందాం! కాపర్ జెల్ మెమరీ ఫోమ్, యాంటీ-మైక్రోబయల్ ట్రీట్మెంట్, బ్రీతబుల్ CNC-ఆకారపు ఫోమ్‌లు తదితర వినూత్న ఉత్పత్తులను అందించే పరిశ్రమలో టాప్‌లో ఉంది సెంచరీ. కంపెనీ 18 రాష్ట్రాల్లో 4,500+ మల్టీ-బ్రాండ్ డీలర్లు, 450+ ప్రత్యేక బ్రాండ్స్ ఉన్నాయి. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫారమ్‌లలో కూడా పాపులర్అయింది. మరిన్ని బిజినెస్ వార్తలకోసం చదవండి: సాక్షి బిజినెస్ -
‘బాగా నిద్రపోగలరా..జాబిస్తాం! జీతంతోపాటు మరో ఆఫర్ కూడా!
ఉద్యోగులెవరైనా ఆఫీసు వేళల్లో గుర్రుపెట్టి నిద్రపోతే ఏం జరుగుతుంది? ఏముంది.. ఆ పనేదో ఇంటికెళ్లి చేసుకోండంటూ సంస్థ వారిని ‘సాగనంపుతుంది’. కానీ అలాంటి వారే తమకు కావాలని ఏదైనా కంపెనీ ముందుకొస్తే?! అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన క్యాస్పర్ అనే పరుపుల కంపెనీ నిద్రపోవడంలో అసాధారణ ప్రతిభ చూపగల ఔత్సాహికులకు రెడ్‌కార్పెట్ పరుస్తోంది. నిద్రా నిపుణుల కోసం ఉద్యోగ ప్రకటన సైతం జారీ చేసింది. ‘వీలైనంత సేపు నిద్రపోవాలన్న కోరిక ఉండటంతోపాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిద్రాభంగం కలగని సామర్థ్యం ఉన్న వారి కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ ఆన్లైన్ ప్రకటనలో పేర్కొంది. ‘మా స్టోర్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఊహించని ప్రాంతాల్లో నిద్రపోండి. మీ నిద్రానుభవాన్ని టిక్‌టాక్ తరహా కంటెంట్ ద్వారా మా సోషల్ మీడియా చానళ్ల ద్వారా ఇతరులతో పంచుకోండి’ అని సూచించింది. నిద్రకు సంబంధించిన అన్ని రకాల అంశాలను ఇతరులతో పంచుకోగలగడం, నిద్ర గురించి మాట్లాడే జిజ్ఞాస కలిగి ఉండటం అభ్యర్థులకు అదనపు అర్హత అవుతుందని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు తగిన జీతంతోపాటు కంపెనీ ఉత్పత్తులను ఉచితంగా అందిస్తామని మరో ఆఫర్ ఇచ్చింది. ఉద్యోగులు పైజామాల్లో ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిస్తామని పేర్కొంది. నిద్రకు నిద్ర, జీతానికి జీతం కావాలనుకొనే ఔత్సాహికులు దరఖాస్తులు సమర్పించేందుకు గురువారమే చివరి రోజు.. త్వరపడండి మరి. -
ఆఫీస్‌లో నిద్రపోవాలని ఉందా.. అయితే ఈ లక్కీ ఛాన్స్ మీకోసమే!
నిద్ర మనకి విశ్రాంతిని ఇస్తుంది. అప్పుడప్పుడు ప్రశాంతతను కూడా ఇస్తుంది. అందుకే అంటారు కంటి నిండా కునుకు తీస్తే మనసు కాస్త కుదుటపడుతుందని. అయిఏత కాస్త డిఫరెంట్‌గా విద్యార్థులు కాస్లులో, ఉద్యోగులు ఆఫీసులో నిద్రపోతున్న వీడియోలను ఇటీవల సోషల్ మీడియాలో చూస్తునే ఉన్నాం. ఇవన్నీ చెప్పేందుకు సరదాగా ఉన్నప్పటికీ ఒక్కోసారి పని వేళలో నిద్రపోతే ఉన్న ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆఫీసు సమయాల్లో ఎంత నిద్ర వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ పని కానిస్తుంటారు. అయితే అలాంటి స్లీపీ ప్రజలకు ఓ శుభవార్త తీసుకొచ్చింది అమెరికాలోని ఓ పరుపుల కంపెనీ. ఆఫీస్‌కు వచ్చి హ్యాపీగా పడుకుంటే చాలు అదిరిపోయే జీతంతో జాబ్ ఇస్తారట. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఆ కంపెనీకి కావాల్సింది ఇదే! వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌కు చెందిన మ్యాట్రెసెస్ కంపెనీ కాస్పర్ తమ ఉద్యోగ ప్రకటనలో.. కంటినిండా కునుకు తీసే అలవాటు మీకు ఉందా, అయితే అలాంటి వారికి ఆకర్షియనీయమైన జీతంతో కూడా జాబ్ ఇస్తామని తెలిపారు. పని వేళల్లో వీలైనంత సేపు నిద్రపోయే వాళ్లే తమకు కావాలని ఆ కంపెనీ పేర్కొంది. జాబ్‌కు ఎంపికైన అభ్యర్థులు కంపెనీ సోషల్ మీడియా ద్వారా వారి నిద్ర అనుభవాలను పంచుకోవడం, ముచ్చటించడం లాంటివి చేయాలని పేర్కొన్నారు. వీటితో పాటు టిక్‌టాక్ తరహా కంటెంట్‌ను కూడా కాస్పర్ సోషల్ మీడియా చానల్స్‌లో పోస్ట్ చేయాలన్నారు. కనీసం 18 ఏళ్లు ఉండడంతో పాటు వారికి సోషల్ మీడియా కంటెంట్‌ను క్రియేట్ చేయడంలో ప్రావీణ్యం ఉండాలని ఆ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్ట్ 11లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపరాఫర్.. ఆగస్టు 31 వరకు మాత్రమే! -
టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!!
బెడ్ మీద కూర్చుని టీవీ చూస్తూ, హాయిగా నిద్రపోయే ఉద్యోగం ఏదైనా ఉంటే బాగుండు అని మీకెప్పుడైనా అనిపించిందా? అలాంటి ఉద్యోగం ఒకటుందండీ! నెలకు ఏకంగా రూ. 25 లక్షల రూపాలయలు జీతం కూడా. ఈ విధమైన ఉద్యోగాలు ఇచ్చేందుకు ఓ యూకే కంపెనీ ముందుకొచ్చింది. ఇది కల కాదు.. నిజంగానే..! మీరే తెలుసుకోండి.. బిటన్ (యూకే)కు చెందిన ఈ కంపెనీ ఉద్యోగం కావాలని వచ్చిన వాళ్లకు కేవలం బెడ్ మీద గడిపితే చాలు జీతం ఇస్తానని చెబుతోంది. బెడ్‌పై కూర్చుని, ఇష్టమొచ్చినంతసమయం టీవీ చూసి, తర్వాత హాయిగా నిద్రపోతే చాలు జాబ్ సిన్సియర్‌గా చేసినట్లే. ఓ లగ్జరీ బెడ్ కంపెనీ ఈ ఆఫర్ అందిస్తోంది. చదవండి:ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు..! అధికారిక సమాచారం ప్రకారం ఈ కంపెనీలో జాయిన్ అయిన ఉద్యోగి రోజుకు 6 -7 గంటలు బెడ్ పై గడపవల్సి ఉంటుంది. బెడ్‌పై పడుకుని మ్యాట్రెస్‌ను పరీక్షించి, సమీక్ష చేయడం సదరు ఉద్యోగి పని. ఈవిధంగా వారానికి కనీసం 37.5 గంటలు పరుపుపై గడిపి తన అనుభవాలను వివరించాలి. ఈ పనికి గాను నెలకు 24 లక్షల 79 వేల రూపాయలు జీతంగా ఇస్తుంది ఈ కంపెనీ. అంతేకాదు ఈ ఉద్యోగం చేయడానికి కష్టపడి ట్రావెల్ చేసి రోజూ కంపెనీకి వెల్లవల్సిన అవసరం కూడా లేదు. ఇంటికే కంపెనీ వాళ్లు బెడ్ పంపిస్తారు. ఇంట్లో బెడ్‌పై గడిపితే చాలు అంటున్నారు క్రాఫ్టెడ్ బెడ్స్ మార్కెటింగ్ మేనేజర్ బ్రియాన్ డిల్లాన్. ఐతే ఈ ఉద్యోగం చేయాలంటే బ్రిటిష్ పౌరసత్వం ఖచ్చితంగా ఉండాలట. ఇంత విచిత్రమైన ఉద్యోగాలు మన దేశంలో కూడా ఉంటే ఎంతబాగుంటుందో కదా!! చదవండి: Health Tips: ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా? చెర్రీ, తేనె, అరటి, వేడిపాలు.. తింటే.. -
సుఖమైన నిద్ర కోరుకునే వారికి ఇది కూడా అవసరమే!
శరీరారోగ్యానికి సుఖనిద్ర ఎంతో అవసరం. మరి సుఖ నిద్ర కావాలంటే సరైన పడక కూడా అవసరమే! కేవలం సుఖ నిద్రకే కాకుండా, ఆరోగ్యానికి సైతం పడక పరిశుభత్ర అవసరమన్నది నిపుణుల మాట. కానీ కొంతమంది మాత్రమే పడకను పరిశుభ్రంగా ఉంచుకునే అలవాటుతో ఉంటారు. చాలామందికి, ముఖ్యంగా యువతలో ఈ పడక పరిశ్రుభత చాలా తక్కువ. తల్లితండ్రులకు దూరంగా ఉండే యువతలో బెడ్ హైజిన్‌పై అవగాహన, ఆసక్తి చాలా స్వల్పంగా ఉంటుంది. ఎక్కడెక్కడో తిరిగిన బట్టలతో అలాగే పడుకోవడం, లేవగానే కనీసం బెడ్‌షీట్, దుప్పట్లను మడత పెట్టకుండా ఉండ చుట్టి పెట్టుకోవడం, దిండ్లను ఇష్టారీతిన నలిపి వాటి కవర్లను అపరిశుభ్రంగా ఉంచుకోవడం, పడుకునే పరుపు లేదా బొంతను ఎన్నాళ్లున్నా కనీసం దులపకపోవడం. అదే విధంగా బెడ్‌పైనే తినడం, తాగడం చేయడం, పడక దగ్గర రకరకాల వాసనలు వస్తున్నా క్లీన్ చేయకపోవడం.. వంటివన్నీ అనారోగ్యాలకు దారి తీసే అంశాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పడకను చెత్తకుప్పలాగా మార్చడం ప్రమాదకరమన్నది నిపుణుల మాట. ప్రతిరోజూ నిద్రపోయిలేవగానే బెడ్‌పై మనిషి తాలుకా లాలాజలం, చెమట, చుండ్రు, మృత చర్మ కణాల్లాంటివి పడుతూ ఉంటాయి. వీటివల్ల ప్రమాదకరమైన సూక్ష్మజీవులు బెడ్‌పై ఆవాసం ఏర్పరుచుకునే వాతావరణం ఏర్పడుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు పడకను శుభ్రంగా ఉంచుకోకపోతే కోరి రోగాలు తెచ్చుకున్నట్లే! బ్యాక్టీరియా బాంబులు పలు రకాల బ్యాక్టీరియా జాతులకు మన పడకలు ఆవాసాలుగా ఉపయోగపడతాయని చాలామందికి తెలియదు. ఉదాహరణకు స్టెఫైలోకోకస్ రకం బ్యాక్టీరియా పడకల్లో నివాసమేర్పురుచుకుంటుంది. ఇవి నిజానికి హానికారకమైనవి కావు, కానీ మనిషి శరీరంపైన ఏదైనా గాయం ద్వారా రక్తప్రసారంలోకి చేరితే మాత్రం తీవ్ర అనారోగ్యం కలిగిస్తాయి. స్టెఫైలోకోకస్ ఆరియస్ బ్యాక్టీరియా పడకపై చేరితే చర్మ సంబంధ వ్యాధులు, న్యుమోనియా, ఎన్నటికీ తగ్గని మొటిమలు వస్తుంటాయి. వీటిలో కొన్ని ప్రజాతులు యాంటిబయాటిక్స్‌కు కూడా తొందరగా లొంగనంతగా బలపడుతుంటాయి. ఇకోలి బ్యాక్టీరియా సైతం బెడ్‌పై కనిపిస్తుంది. ఇవి మనిషి పేగుల్లో ఉండే సాధారణమైన బ్యాక్టీరియా. కానీ కొన్ని ప్రజాతులు మనిషిలో తీవ్రమైన మూత్రసంబంధిత వ్యాధులు, డయేరియా, మెనింజైటిస్ కలిగిస్తాయి. అందుకే నిద్రపోతున్నవారు మూత్రవిసర్జనకు మేల్కొంటే, తిరిగి పడుకోబోయేముందు కాళ్లు చేతులు కడుక్కోవాలని పెద్దలు చెబుతుంటారు. స్టెఫైలోకోకస్ కానీ, ఇ కోలి కానీ పెద్ద సంఖ్యలో పునరుత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని బెడ్‌పైకి చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలి. బాబోయ్ బెడ్ బగ్స్ మనిషి ప్రతిరోజు నిద్రలో దాదాపు 50 కోట్ల మృత చర్మ కణాలను రాలుస్తాడు. పడకల్లో దాగుండే నల్లులు, బెడ్బగ్స్కు ఈ మృతకణాలు మంచి ఆహారం. వీటివల్ల తక్షణ చర్మ సమస్యలు, అలెర్జీలు, ఆస్తమా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరోక్షంగా యాంక్జైటీ, ఇ¯Œ సోమ్నియాకు కూడా ఇవి కారణాలవుతాయన్నారు. బ్యాక్టీరియాల కన్నా పెద్దవైనా ఇవి మాములు కంటికి తొందరగా కనిపించవు. ఒక పడక నుంచి ఇంకో పడకకు కుటుంబ సభ్యుల ద్వారా ఇవి వ్యాపిస్తుంటాయి. పసిపిల్లల పడకలో ఇవి చేరితే మరింత ప్రమాదం. వారు కనీసం ఏం జరుగుతుందో కూడా అర్దం చేసుకోలేరు, బయటకు చెప్పలేరు. అందువల్ల ఈ బగ్స్‌తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బాత్రూమ్ టవల్స్‌ను ఉండ చుట్టి బెడ్‌పై వేయడం వంటి అలవాట్లు పడకను పాడు చేస్తాయి. బ్యాక్టీరియా, బెడ్బగ్స్తో పాటు వైరస్‌లకు కూడా పడకలు నివాసాలుగా మారుతుంటాయి. వాక్సీనా లాంటి కొన్ని వైరస్‌లైతే శుభ్రం చేయని పడకల్లో 14 వారాలపాటు ఓపిగ్గా హోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఏం చేయాలి? ► వ్యక్తిగత పరిశుభ్రత... అంటే ఎప్పటికప్పుడు కాళ్లు చేతులు కడుక్కోవడం, పొడిగా తుడుచుకోవడం అలవాటు చేసుకోవాలి. ∙పసిపిల్లల పడకలను రోజుకు రెండు మార్లు పూర్తిగా మార్చడం, వారికి వాడే దుప్పట్లు, కవర్లను జాగత్త్రగా పరిశీలించడం ఎంతో అవసరం. ►ప్రతిరోజూ పడకను శుభ్రపరుచుకోవాలి. బెడ్ షీట్ మార్చడం, బెడ్‌ను దులపడం, దుప్పట్లు మార్చడం, పిల్లో కవర్లు తాజాగా ఉంచుకోవడం చేస్తుండాలి. పడకపై వాడే దుప్పట్లు, కవర్లు రెండు మూడురోజులకొకసారి ఎండలో వేయాలి. చాప వాడే అలవాటుంటే దాన్ని సైతం ఎండలో ఆరవేయాలి. ► తడి కాళ్లతో పడకపైకి చేరడమంటే సూక్ష్మజీవులకు ఆహ్వానం పంపినట్లేనని గుర్తించాలి. ► పెద్ద పరుపులు, చాపలను ఉతకలేము కాబట్టి వాటికి సరిపడా కవర్లను వాడడం, ఆ కవర్లను తరచూ మారుస్తుండడం, వీలైనప్పుడు వీటిని ఎండలో వేయడం మరవకూడదు. ►వాక్యూమ్ క్లీనర్ ఉన్నవాళ్లు చాపలు, బెడ్స్‌ను వాక్యూమ్ చేయడం బెటర్. ► పెంపుడు జంతువులున్నవాళ్లు సాధ్యమైనంత వరకు వాటిని పడకలపై చేరకుండా జాగ్రత్త వహించాలి. ► మరీ పాతపడిపోయిన పరుపులు, చాపలు, దుప్పట్లు వాడకుండా కొత్తవాటిని ఏర్పాటు చేసుకోవాలి. ► వీలైనప్పుడు కవర్లు, దుప్పట్లు బాగా మరిగించిన నీటిలో వేసి శుభ్రం చేయాలి. ► బయట నుంచి వచ్చి బట్టలు కూడా మార్చుకోకుండా పడకెక్కడం, మేకప్ ఉంచుకొని పడుకోవడం, సరైన గాలిరాని ప్రదేశాల్లో పడక ఏర్పాటు చేసుకోవడం, బెడ్‌పై తినడం, తాగడం వంటి అలవాట్లు వెంటనే వదులుకోవాలి. ► శరీరం అలసిపోతే ఎక్కడైనా నిద్రవస్తుంది, అందుకని పడక పరిశుభ్రతపై అవగాహన అవసరం లేదని భావించకూడదు. బెడ్ హైజిన్ లోపిస్తే జరిగే అనర్ధాలు వెంటనే అర్దం కావు, అందువల్ల పడక పరిశుభ్రతపై పట్టింపు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. డి. శాయి ప్రమోద్ -
వాడేసిన మాస్క్‌లతో పరుపులు..
-
షాకింగ్: వీళ్లు మారరా? వాడేసిన మాస్కులతో..
ముంబై: తగ్గిందనుకున్న కరోనా మహమ్మారి మరో సారి పంజా విసురుతోంది. సెకండ్ వేవ్ మరింత భయపెడుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా నేడు ఒక్క రోజే 1,68,912 కేసులు నమోదయ్యి.. ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది. ప్రజలందరూ మాస్క్ ధరిస్తూ.. సామాజిక దూరం పాటిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కొందరు దరిద్రులు మాత్రం ఏకంగా వాడేసిన మాస్క్‌లతో పరుపులు తయారు చేస్తూ.. ప్రజల జీవితంతో చెలగాటం ఆడుతున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో ప్రథమ స్థానంలో ఉన్న మహారాష్ట్రలో ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. రాష్ట్రంలోని జలగావ్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ కొందరు కక్కుర్తి వ్యాపారులు పరుపుల తయారిలో కాటన్, ఇతర పదార్థాల బదులు వాడేసిన మాస్క్‌లు వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో వారు రైడ్ చేయగా.. ఈ ప్రాంతంలో ఉన్న వాడేసిన మాస్క్ గుట్టలను చూసి పోలీసులు షాకయ్యారు. అనంతరం ఆ మాస్కల్‌ను తగులబెట్టి.. సదరు కంపెనీ యజమాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వాడేసిన మాస్క్‌ను తకాలంటేనే జనాలు భయంతో వణికిపోతున్న తరుణంలో.. ఇలా ఏకంగా వాటితో పరుపులు తయారు చేయడం మరింత భయపెడుతుంది. వీటిలో ఎవరైనా కరోనా రోగి వాడేసిన మాస్క్ ఉంటే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు జనాలు. ఇలాంటి కక్కుర్తి వ్యాపారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చదవండి: టీవీ సీరియల్స్‌కు బ్రేక్.. షూటింగ్‌లు రద్దు -
మరణంలో వీడని బంధం..
తల్లి, కుమారుడు సజీవదహనం మైలార్‌దేవ్‌పల్లిలోని కాటన్ ఫైబర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతైన తల్లి.. నాలుగేళ్ల కుమారుడు అనుమతులు లేకుండా పరిశ్రమ నిర్వహిస్తున్న షిరాజుద్దీన్ అనే వ్యక్తి పరిశ్రమ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు హైదరాబాద్: పొట్టకూటి కోసం పనిలోకెళితే ఆ తల్లీకొడుకులను మృత్యువు కబళించింది. నాలుగేళ్ల కుమారుడిని రక్షించుకునేందుకు కడదాకా పోరాడిన ఆ తల్లి చివరికి కొడుకుతో పాటు అగ్నికీలలకు ఆహుతైపోయింది. మంగళవారం మధ్యాహ్నం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డినగర్‌లోని ఓ కాటన్ ఫైబర్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు ఘోర అగ్నిప్రమాదం సంభవించడంతో తల్లి, కుమారుడు సజీవదహనమయ్యారు. రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, సీఐ వెంకట్‌రెడ్డిల కథనం మేరకు.. పాతబస్తీకి చెందిన షిరాజుద్దీన్ అనే ఓ వ్యక్తి మైలార్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని కృష్ణారెడ్డి నగర్లో కాటన్ ఫైబర్ రీసైక్లింగ్ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. ఈ పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవు. అందులో 10 మంది కార్మికులు పని చేస్తున్నారు. బండ్లగూడ జాంగీరాబాద్కు చెందిన షేక్ హైమద్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి భార్య షకిరా బేగం, నాలుగేళ్ల కుమారుడు అబ్బాస్ ఉన్నారు. కుటుంబ పోషణ భారం కావడంతో షకిరా బేగం.. షిరాజుద్దీన్ పరిశ్రమలో మూడు నెలల క్రితం దినసరి కూలీగా పనిలో చేరింది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తోటి కార్మికులంతా భోజనం చేసేందుకు బయటకు వెళ్లగా.. షకిరా బేగం తన కుమారుడితో పరిశ్రమలోనే ఉంది. అయితే ఇదే సమయంలో ప్రమాదవశాత్తు కంపెనీలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో పరిశ్రమ లోపలే అబ్బాస్ ఆడుకుంటూ ఉండటంతో కుమారుడిని రక్షించుకునేందుకు షకిరా బేగం ప్రయత్నించింది. మంటలు వేగంగా వ్యాపించి చుట్టుముట్టడంతో వారిద్దరూ అగ్నికి ఆహుతైపోయారు. అగ్నిప్రమాదంపై స్థానికులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందిని రప్పించి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే షకిరా బేగం, అబ్బాస్ మృతదేహాలు మాంసపు ముద్దలుగా మారాయి. మరణంలో వీడని బంధం.. షకిరా బేగం అతని కుమారుడు అబ్బాస్‌ల బంధం మరణంలోను వీడలేదు. మంటలను లెక్క చేయకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి కుమారుడిని రక్షించే క్రమంలో తల్లీకుమారుడు మృత్యువాత పడ్డారు. పరిశ్రమలో మంటలు చెలరేగే సమయంలో అబ్బాస్ మిషన్ వద్ద ఆడుకుంటున్నాడని, గేటు వద్ద ఉన్న షకిరా బేగం కుమారుడిని రక్షించేందుకు పరిశ్రమ లోపలికి పరుగు తీసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరణంలోనూ వీడని తల్లీకొడుకుల బంధం స్థానికులను కంటతడి పెట్టించింది. బాధ్యులపై కఠిన చర్యలు: ఏసీపీ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమను నెలకొల్పడమే కాక.. నిండు ప్రాణాలు బలికావడానికి కారకుడైన షిరాజుద్దీన్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ నిర్వహణకు అనుమతులు లేవని, నిబంధనలకు విరుద్ధంగా చిన్నారిని పరిశ్రమలోనికి అనుమతించినందుకు నిర్వాహకునిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. పరిశ్రమ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, మృతుల కుటుంబానికి న్యాయం చేసేందుకు తమ వంతు సాయం చేస్తామని గంగారెడ్డి చెప్పారు. -
తల్లీ కొడుకుల సజీవదహనం