
జో అచ్యుతానంద....!
పాపం.. కాంగ్రెస్ బరువు బాధ్యతలు మోస్తూ ఎంత అలిసిపోతున్నారో!
విశాఖపట్నం : పాపం.. కాంగ్రెస్ బరువు బాధ్యతలు మోస్తూ ఎంత అలిసిపోతున్నారో! లేక పదవీకటాక్షం లేక ఎంతగా నిద్రకు దూరమవుతున్నారో! పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఇలా కాంగ్రెస్ బహిరంగ సమావేశంలో కునికిపాట్లు పడ్డారు.
జీవీఎంసీ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే విషయమై గురువారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కళ్లు మూసి కాసేపు నిద్ర తీశారు. నాయకుల ఉపన్యాసాలు జోలపాటలా అనిపించినట్టు ఉన్నాయేమో.. అలా స్వప్నలోకంలో కాసేపు విహరించారు. గత ప్రాభవాన్ని సాధించడానికి అంతా ఉరకలు వేయాలంటూ తాము చెబుతూ ఉంటే.. కునుకు తీస్తున్న నాయకుడిని సమావే శంలో పాల్గొన్న పార్టీ నాయకులంతా విస్తుపోయి చూశారు.