ఉద్యోగులు నిద్రపోయినా తప్పుకాదు!
హైదరాబాద్: మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే చోట నిద్రపోవడం మామూలే. అలాంటి వారిని పై అధికారులు పిలిచి చివాట్లు పెట్టడం చూస్తుంటాం. కానీ పని ప్రదేశంలో నిద్రపోవడం జపాన్‌లో నేరమేమీ కాదట. పనిచేస్తూ నిద్రపోయే వారిని బాసులు చూసీ చూడనట్లు ఉంటారు.
నిజానికి బాగా పనిచేస్తున్న వారిని కొంచెం విశ్రాంతి తీసుకోండి అని డ్యూటీ సమయాల్లో బాసులే ప్రోత్సహిస్తారట. అయితే అక్కడా కొందరు నాటకాల రాయుళ్లు టేబుల్‌పై కాళ్లు బార్లా చాపి నిద్రపోతుంటారు. తాము బాగా పనిచేస్తున్నామని, పనిచేస్తూ అలసిపోయామని అందరూ అనుకుంటారని అలా నాటకాలాడుతుంటారట.