
ప్రశాంత రెడ్డి, నిద్రలోకి జారుకున్న డ్రైవర్ కండోజి
కర్ణాటక, గౌరిబిదనూరు: బస్సు చలనంలో ఉండగానే డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపు తప్పింది. గమనించిన ప్రయాణికులు కేకలు వేయడంతో అదే బస్సులోని యువకుడు స్టీరింగ్ చేతపట్టి ప్రయాణికులను రక్షించాడు. ఈ ఘటన గురువారం సాయం త్రం దొడ్డబళ్లాపురం సమీపంలో చోటు చేసుకుంది. బెంగుళూరు నుంచి 40 మంది ప్ర యాణికులతో గౌరిబిదనూరు బయల్దేరిన కేఎస్ ఆర్టీసీ బస్సు దొడ్డబళ్లాపురం దాటిన అనంతరం డ్రైవర్ కండోజీ నిద్రలోకి జారుకున్నాడు. బస్సు నియంత్రణ తప్పడంతో ముం దరి సీట్లలో ఉన్న ప్రయాణికులు భయంతో గట్టిగా కేకలు వేశారు. అయినప్పటికీ డ్రైవర్ మేల్కొనలేదు. దీంతో అదే బస్సులో ప్రయాణిస్తున్న గౌరిబిదనూరుకు చెందిన ప్రశాంత రెడ్డి డ్రైవర్‌ను పక్కకు తోసి చేతిలోకి స్టీరింగ్ తీసుకొని వాహనాన్ని అదుపు చేశాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను సీట్‌లో పడుకోబెట్టి వాహనాన్ని బస్ డిపోలో అప్పగించాడు.
డ్రైవింగ్ చేస్తున్న ప్రశాంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment