తరగతి గదిలో టీచర్ క్లాస్ చెబుతున్న సమయంలో మీరు ఎప్పుడైనా కునుకు తీశారా? దాదాపు ప్రతి ఒక్కరు ఇలా కునుకు తీయడం కామన్. కొందరైతే తూగుతూ కిందపడిపోతారు కూడా. క్లాస్‌లోనే కాదు చల్లని చెట్టు కింద కాసేపు కూర్చున్నా.. నిద్ర ఇట్టే పట్టేస్తుంది. ఇలాంటి సంఘటన చాలామందికే ఎదురై ఉంటుంది. అలా ఓ కోతి గాఢ నిద్రలోకి జారుకున్నది. అకస్మాత్తుగా కుదుపుతో మేల్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది.
ఈ వీడియోలో చెట్టు కింద కునుకు తీస్తున్న కోతి చివర్లో తను పడుకోవాల్సిన చోటు అది కాదేమో అనేలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. 14 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామెన్ ట్విటర్‌లో షేర్ చేశారు. మీరూ ఇలాంటివి చేసుంటే ఈ వీడియోను చూడండి అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకున్నది. కొంతమంది నెటిజన్లు తమ జీవితంలో జరిగిన ఇలాంటి సంఘటను కామెంట్ల ద్వారా పంచుకుంటున్నారు.
RT if you have did this and can relate to this video. Watch full screen till the end 😀 #Shared pic.twitter.com/9aImikrDzO
— Sudha Ramen IFS 🇮🇳 (@SudhaRamenIFS) August 5, 2020
Comments
Please login to add a commentAdd a comment