గాఢ నిద్రలో సీఎం సిద్దు | Modi speaks at ISC program, CM Siddaramaiah sleeps! | Sakshi
Sakshi News home page

గాఢ నిద్రలో సీఎం సిద్దు

Published Mon, Jan 4 2016 9:50 AM | Last Updated on Fri, Aug 24 2018 1:52 PM

గాఢ నిద్రలో సీఎం సిద్దు - Sakshi

గాఢ నిద్రలో సీఎం సిద్దు

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో
ప్రధాని ప్రసంగిస్తుండగా నిద్రలోకి..
 
మైసూరు : బహిరంగ సభల్లో నిద్రలోకి జారుకోవడం మాజీ ప్రధాని దేవెగౌడకు వారసుడిగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిలుస్తున్నారు. తాజాగా ఆదివారం మైసూరులో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 103 వ సమావేశంలో ఏకంగా ప్రధానితో పాటు వేలాది మంది శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పని తనదంటూ హాయిగా నిద్రలోకి జారుకున్నారు.
 
సిద్దుకు వేదికపై నిద్రపోవడం కొత్తేమి కాదు, అయితే వివిధ దేశాలకు చెందిన నోబెల్ గ్రహీతలు, పరిశోధకులతో పాటు వేల మంది శాస్త్రవేత్తలు వారి పరిశోధనలు వివరిస్తా ఉంటే, ప్రధాని మోదీ దేశ రక్షణ, అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం తదితర వాటిపై ప్రసంగిస్తూ ఉంటే సిద్దరామయ్య గాఢ నిద్రలో ఉన్నారు. ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే ఆయన కూడా నిద్రలేచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement