
వాషింగ్టన్ : ఇటీవలి కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో నిద్రలేమి ఒకటి. కొన్నేళ్ల క్రితం అసలు ఇది ఒక ఆరోగ్య సమస్యగా మారుతుందని ఎవరూ ఊహించి కూడా ఉండరు. మారుతోన్న జీవన విధానాలు, విపరీతమైన మొబైల్ ఫోన్ వాడకంతో పట్టణాలతోపాటు పల్లెలోనూ ఎంతోమంది నిద్రకు దూరమవుతున్నారు. అయితే సరిపడా నిద్రలేకపోతే మాత్రం ప్రమాదమనే హెచ్చరిస్తున్నారు నిపుణులు. రోజులో కనీసం ఆరు గంటల నిద్రలేకపోతే గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.
తక్కువ నిద్రపోయే వారి రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం 27 శాతం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన పరిశోధకులు సుమారు 4వేల మంది ఉద్యోగుల అలవాట్లు, వారికున్న వ్యాధులను పరిశీలించారు. వీరిలో నిద్రలేమితో బాధపడుతున్నవారు గుండె జబ్బులు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment