గురక చాలామందికి ఓ పీడలా వెంటాడుతుంది. అంత తేలిగ్గా అది వదలదు. లావుగా ఉండటం వల్ల గురక వస్తుందనుకుంటారు గానీ సన్నగా ఉన్నా కూడ కొందరికి గురక వస్తుంది. దీని వల్ల మీకే గాక మీతో పాటు పడుకునేవాళ్లు కూడా ఇబ్బంది పడ్తుంటారు. గురక అనేది మనకు తెలియకుండా నిద్రలో వచ్చేది. కంట్రోల్ చేయడం అసాధ్యం. అలాంటి ఈ గురకను ఎలా నివారించాలంటే?..
గురక వ్యాధి కాదు. శ్వాస సంబంధ సమస్యల వల్ల వస్తుంది. ఇది తగ్గాలంటే ఈ కింది చిట్కాలు పాటించండి
గురక రాకూడదంటే..
- తేనెతో ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లలో చికిత్స చేయడానికి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ తేనె నాసికా రంధ్రాలను క్లియర్‌గా తెరుస్తుంది. గాలి స్వేచ్ఛగా ప్రవహించేలా చేస్తుంది. పైగా దీనిలో యాంటి మైక్రోబయల్స్ ఉంటాయి. అందువల్ల రాత్రి నిద్రపోయేటప్పుడూ తేనెను సేవించినా లేదా పాలల్లో కలిపి తీసుకుని తాగిన చక్కటి ఫలితం ఉంటుంది.
- పుదీనా దాదాపు అందరి ఇళ్లలోనూ ఉంటుంది. ఈ ఆకుల్లో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ముక్కు, గొంతు లోపల మంటను తగ్గిస్తాయి. పడుకునే ముందు పిప్పరమెంటు టీ తాగడం లేదా కొన్ని ఆకులను వేడి నీటిలో వేసి తీసుకోవడం వల్ల గురక తగ్గిపోతుంది. మీ చుట్టూ ఉన్నవారు కూడా హాయిగా నిద్రపోతారు.
- వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడేందుకు ఖాళీ కడుపున వెల్లుల్లిని తినమని సలహ ఇస్తారు. రాత్రిపూట పచ్చి వెల్లుల్లి తింటే గుక వెంటనే తగ్గుతుంది.
- ఉల్లి లేని కూర, వంటిల్లు ఉండదు. ప్రతి రోజు రాత్రి ఉల్లిపాయను మీ ఆహారంలో చేర్చి చూడండి గురక అస్సలు రాదు. ఈ చిట్కాలను పాటించి గురక సమస్య నుంచి త్వరగా బయటపడండి.
Comments
Please login to add a commentAdd a comment