కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై అత్యాచారం | Woman raped by driver, conductor in moving bus in Rajasthan | Sakshi
Sakshi News home page

కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై అత్యాచారం

Published Fri, Jan 30 2015 10:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై అత్యాచారం

కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై అత్యాచారం

జైపూర్: ప్రయాణికులను సురక్షితంగా చేర్చాల్సిన డ్రైవర్, కండక్టరే కర్కశంగా కదులుతున్న బస్సులోనే ఓ మహిళ(36)పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఉదంతం రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలోని పిలానీ ప్రాంతంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని పిలానీ నుంచి హరియాణాలోని లోహారుకు వెళ్తున్న స్లీపర్ బస్సులో ఈ ఘటన జరిగింది.

 

‘బస్సులో నేను ఒక్కదానినే ఉన్నాను. మొదట నాపై కండక్టర్ కాలియా(36) అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత డ్రైవర్ కూడా నాపై అత్యాచారం చేశాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో వదిలివెళ్లారు’ అని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొందని పోలీసు అధికారొకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement