రేపు జెడ్పీ చైర్మన్ ఎన్నిక | Tomorrow the election of the chairman of a group | Sakshi
Sakshi News home page

రేపు జెడ్పీ చైర్మన్ ఎన్నిక

Published Sat, Jul 12 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

Tomorrow the election of the chairman of a group

కండక్టర్ విధులను కూడా నిర్వర్తించడం ఆర్టీసీ డ్రైవర్లకు పెద్ద సమస్యగా మారింది. ఒకే సమయంలో డ్రైవింగ్‌తో పాటు టికెట్ల జారీపై దృష్టి పెట్టాల్సిరావడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. డ్రైవింగ్‌పై ఏ మాత్రం ఏకాగ్రత చెదిరినా ప్రమాదాలు జరిగే అవకావం ఉండడం, మరోవైపు నగదు వసూళ్లలో తేడా వ స్తే జేబుకి చిల్లుపడే అవకాశం ఉండడంతో అడకత్తెరలో పోక చెక్కలా మారారు. డ్రైవింగ్ విధులను డ్రైవర్, టికెట్ల జారీని కండక్టర్ మాత్రమే చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆర్టీసీ అధికారులు అమలు చేయకపోవడంపై విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. చైర్మన్ ఎన్నిక ఆదివారం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఎన్నికను సజావుగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఎలా జరుగుతుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
 
 24 మంది సభ్యులతో జిల్లాపరిషత్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. మెజార్టీ సభ్యులు లేకున్నా టీడీపీ ఎలాగైనా జిల్లా పరిషత్ చైర్మన్ గిరిని దక్కించుకునేందుకు పలురకాల కుట్రలకు పాల్పడుతోంది. వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు సభ్యులను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తోంది. కోట్లు గుమ్మరిస్తామంటూ టీడీపీ నేతలు ఆశ చూపారు.
 
 అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొందరు సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. వారి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు, బెదిరించారు. వారిని సైతం ప్రలోభపెట్టారు. అయినా సరే కొం దరు మినహా మిగిలిన సభ్యులు అధికార పార్టీ ప్రలోభాలకు లొంగలేదు. మాటపై నిలబడ్డారు. తమను గెలి పించిన పార్టీని ,నేతలను వదలమంటూ విశ్వాసం చూపారు. ప్రాణా లు పోయినా పార్టీ వెన్నంటే ఉంటామంటూ ప్రమాణాలు చేశారు. అయినా సరే అధికార బలంతో టీడీపీ దౌర్జన్యానికి దిగి నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రకే మాయని మచ్చ తెచ్చింది. జిల్లాపరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జిల్లాపరిషత్ సభా మందిరంలో దుశ్శాసన పర్వానికి తెరలేపింది. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ  సాక్షాత్తు కలెక్టర్ శ్రీకాంత్ ముందున్న  మైక్‌ను విసిరి పారేసి ఆయన్ను దుర్భాషలాడారు. అయినా సరే కలెక్టర్ నోరుమెదప లేదు. ‘నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు’ అన్నట్టు పోలీసులు చోద్యం చూస్తుండిపోయారు. ఈ ఘటన రాష్ట్ర స్థాయిలో జిల్లా పరువు తీసింది. అధికార పార్టీ దౌర్జన్యాలను చూసి జనం అసహ్యించుకుంటున్నా  టీడీపీ నేతలు మాత్రం అక్రమాలను ఆపలేదు. వైఎస్సార్‌సీపీ సభ్యులను కిడ్నాప్ చేశారంటూ తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నానికి దిగారు.
 
 అయినా సరే మెజార్టీ సభ్యులతో జిల్లాపరిషత్ చైర్మన్ గిరిని దక్కించుకుంటామని వైఎస్సార్‌సీపీ నేతలు  ధీమాగా ఉన్నారు. అందరి సహకాంతో విజయం ఖాయమంటున్నారు. ఎన్నికల కమిషన్, హైకోర్టు జోక్యంతో అధికార పార్టీ ఆందోళనలో ఉన్నట్టు తెలిసింది. గతంలో మాదిరి అధికారం అడ్డుపెట్టి ఎన్నికను అడ్డుకోవడం వీలుకాక పోవ చ్చని వారు భావిస్తున్నారని సమాచారం. ఈ సారైనా పోలీసులు ఎన్నికల కమిషన్,హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఎన్నికను సజావుగా నిర్వహిస్తారా లేక మళ్లీ అధికార పార్టీ నేతలకు తొత్తులగా వ్యవహ రిస్తారా అన్నది ఆదివారం తేలుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement