
హైదరాబాద్ : సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వ్యక్తులపై తెలంగాణలో కూడా చర్యలు మొదలయ్యాయి. ప్రభుత్వ పెద్దలను అవమానిస్తే చర్యలు తప్పవంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించినట్లుగానే ఆ తరహా చర్యలు ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వ విధానాలను, ముఖ్యమంత్రిని, ప్రజాప్రతినిధులను విమర్శిస్తున్న వారిపై అవమానిస్తున్నారు, అతిక్రమిస్తున్నారనే పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లుగానే తెలంగాణలో కూడా ఆ తంతు మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఆర్టీసీ సంస్థ అధికారులను విమర్శించారనే పేరిట డీ సంజీవ్ అనే బస్సు కండక్టర్‌కు నోటీసులు పంపించారు. నిజమాబాద్ డిపో 1లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఫేస్‌బుక్, వాట్సాప్ వేదికలుగా చేసుకొని కేసీఆర్‌ను, అధికారులను విమర్శిస్తున్నారని, దీనిపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులకు కూడా ఆర్టీసీ ఫిర్యాదు చేసింది. విచారణ చేసి ఆ వివరాలు తమకు ఇవ్వాలని కూడా కోరింది.
Comments
Please login to add a commentAdd a comment