ప్రయాణికులు దిగిపోవడంతో ఖాళీగా ఉన్న బస్సు , సార్ కోసం వెయిటింగ్ అని చెబుతున్న కండక్టర్
బద్వేలు(అట్లూరు): ప్రయాణికుల శ్రేయస్సే ఆర్టీసీ లక్ష్యం అని అధికారులు పదే పదే గొప్పలు చెబుతుంటారు. కానీ అందుకు విరుద్ధంగా ప్రయాణికులను గాలికొదిలేసి సార్.. సేవలో మునిగిపోయి తీరిగ్గా ఖాళీ సీట్లతో బస్సు వెళ్లిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ప్రయాణికుల వివరాల మేరకు.. బద్వేలు డిపోకు చెందిన ఏపీ04జెడ్0290 నెంబరుగల బస్సు శుక్రవారం ఉదయం ప్రయాణికులతో నెల్లూరుకు బయలు దేరేందుకు సిద్ధంగా ఉంది. ఈబస్సు 6.45 గంటలకు బయలు దేరాలి.
7.15 గంటలు అయినా బయలు దేరలేదు. బస్సు ఎందుకు బయలు దేరలేదని కండక్టరును ప్రయాణికులు అడిగారు..డీఎం సార్ నేనూ వస్తున్నా.. అంతవరకు బయలు దేరవద్దన్నారు.. సమాధానమిచ్చారు. దీంతో కొంత మంది ప్రయాణికులు వేరే డిపోకు చెందిన బస్సులో బయలు దేరారు. ఈ విషయం మీడియాకు తెలిసి ఫొటోలు తీస్తుండగా వెంటనే కండక్టర్ డీఎంకు సమాచారం అందించారు. ఆయన హుటాహుటీన బస్సు ఎక్కి బయలు దేరి వెళ్లారు. దీంతో సగం బస్సు ఖాళీగానే బయలు దేరింది.
Comments
Please login to add a commentAdd a comment