DM
-
వాళ్లే అంతర్ధానమౌతారు
సేలం(తమిళనాడు)/పాలక్కడ్(కేరళ): పక్షాల ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ విమర్శల జడి కొనసాగుతోంది. ‘శక్తి’ని అంతం చేయాలని బయల్దేరిన వాళ్లే నాశనమవుతారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కొద్దిరోజులుగా దక్షిణభారత రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న మోదీ మంగళవారం సైతం తమిళనాడు, కేరళలో పర్యటించి ప్రచారసభల్లో పాల్గొన్నారు. సేలంలో జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. ‘ తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకేలు ఒక నాణానికి రెండు పార్శా్వలు. అవినీతి, వారసత్వ రాజకీయాలతో అంటకాగాయి. ఇతర మతాలపై పల్లెత్తు మాట అయినా మాట్లాడటానికి జంకే కూటమి పార్టీలు హిందూ మతాన్ని దూషించటానికి ఒక్క క్షణం కూడా ముందూ వెనకా ఆలోచించవు. ఎన్నికల ప్రచారం ముంబైలో మొదలెట్టిన మొదటిరోజే వారి వైఖరి బట్టబయలైంది. ‘శక్తి’ని నాశనం చేస్తామని ముంబైలో శివాజీపార్క్ సభావేదికగా ప్రకటించారు. హిందూత్వంలో శక్తికి ఉన్న ప్రాధాన్యత, విశిష్టత తమిళనాడులో ప్రతి ఒక్కరికీ తెలుసు. కంచి కామాక్షి అమ్మవారు, ‘శక్తిపీఠం’ మదుర మీనాక్షి అమ్మవారు, సమయపురం మారియమ్మన్... ఇలా అంతా శక్తి స్వరూపిణిలే. శక్తి అంటే మాతృ శక్తి, నారీ శక్తి’ అంటూ సభకు వచ్చిన మహిళలనుద్దేశిస్తూ మోదీ అన్నారు. ‘ఈ శక్తినే విపక్షాలు అంతం చేస్తాయట. కూటమి నేతలు పదేపదే హిందువుల విశ్వాసాలను కించపరుస్తున్నారు. శక్తిని అంతం చేయాలని చూసిన వాళ్లు నాశనమైన వృత్తాంతాలు మన ఇతిహాసాల్లో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ఘటనను ఏప్రిల్ 19న తమిళనాడు ప్రజలు పునరావృతం చేస్తారు’ అని అన్నారు. తమిళనాడులో అదే తేదీన 39 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ఉన్న సంగతి తెల్సిందే. ‘‘ జాతీయ కవి సుబ్రమణ్య భారతి చెప్పినట్లుగానే నేనూ భరతమాతను శక్తి స్వరూపిణిగానే ఆరాధిస్తా. దేశ నారీశక్తిని ఆరాధిస్తా. నేను శక్తి ఉపాసకుడిని. శక్తిని అంతం చేస్తామన్న వాళ్లను తమిళనాడు ఓటర్లు శిక్షిస్తారు. కోట్లాది తమిళులు ఇస్తున్న గ్యారెంటీ ఇది’’ అని మోదీ అన్నారు. పాలక్కడ్‌లో భారీ రోడ్‌షో కేరళలో క్షేత్రస్థాయిలో పార్టీని మరింతగా బలోపేతం చేయడమే లక్ష్యంగా మోదీ మంగళవారం కేరళలో పర్యటించారు. లోక్‌సభ ఎన్నికల బరిలో నిల్చిన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పాలక్కడ్‌లో రోడ్‌షోలో మోదీ పాల్గొన్నారు. -
400 మందికి ఢిల్లీ నివాసులుగా నకిలీ గుర్తింపు!
న్యూఢిల్లీ : బస్సుల్లో భద్రత కోసం ఢిల్లీ ప్రభుత్వం పౌర రక్షణ వాలంటీర్లను(సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్) నియమించాలని నిర్ణయించుకుంది. ఈ కొలువులు కేవలం స్థానికులకే అని తెలిపింది. ఈ నేపథ్యంలో ఓ జిల్లా మేజిస్ట్రేట్ ఆఫీసర్ కొంత మందికి నకీలి ధృవీకరణ పత్రాలను జారీ చేశారు. షాహదార జిల్లా మేజిస్ట్రేట్ కుల్దీప్ పకాడ్ దాదాపు నాలుగు వందల మందికి పైగా నకిలీ ధృవీకరణ పత్రాలను జారీ చేసినట్లు తెలిసింది. వీరిలో అత్యధికంగా కుల్దీప్ సొంత రాష్ట్రం వారే ఉండటం గమనార్మం. తన రాష్ట్రానికి చెందిన పలువురుకి, ఢిల్లీ నివాసితులుగా గుర్తింపునిస్తూ కుల్దీప్ పత్రాలను జారీ చేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ ఈ కేసులో నిజానిజాలను తేల్చేందుకు విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా కైలాష్ మాట్లాడుతూ.. ‘అధికారిపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. నిజానిజాలు తేల్చేందుకు ఓ కమిటీని వేసింది. రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. నివేదిక ఆధారంగా కుల్దీప్పై చర్యలు తీసుకుంటాము’ అని తెలిపారు. అంతేకాక విచారణ పూర్తయ్యేవరకు షాహదార జిల్లాలో సివిల్ డిఫెన్స్ వాలంటీర్ల ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఢిల్లీ ప్రభుత్వం ఇటివల బస్సుల్లో పౌర రక్షణ వాలంటీర్లను నియమించాలని జిల్లా డీఎంలను ఆదేశించింది. అన్ని జిల్లాలను కలుపుకోని రవాణా శాఖలో మొత్తం పది వేల మార్షల్ సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్ కొలువులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. -
నిశ్చితార్థం ఇంట చావు మెతుకులు పెడతారా?
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): సింహాచలం ఆర్టీసీ డిపో కార్మికుల ఆగ్రహావేశాలతో అట్టుడికింది. డిపో డ్రైవర్ చింతా నాగేశ్వరరావు ఆత్మహత్య ఘటనతో రవాణా వ్యవస్థ స్తంభించింది. సుమారు 110కి పైగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. బాధిత కుటుం బం రోదనలు మిన్నంటాయి. నాగేశ్వరరావు ఆత్మహత్య సం ఘటన ఆయన కుటుంబంలోనే కాదు.. కార్మికుల్లో కల్లోలం రేపింది. ఇంటికి వెలుగుని కోల్పోయిన దుఃఖంలో కుటుంబం రోడ్డున పడితే.. ఆ కష్టం మరే కుటుంబానికీ రాకూడదని డిపో కార్మికులంతా ఆ గుండె పగిలే బాధ తామంతా పడుతున్నామని చెబుతూ శనివారం వేకువజాము నుంచి డిపో మొత్తంగా బస్సులు ఆపేశారు. నాగేశ్వరరావు భార్యాపిల్లలు, బంధువుల రోదనలు.. డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ కార్మికుల ఆందోళనలతో డిపోలో వాతావరణం వేడిక్కింది. ఇలాంటి ఆందోళన ఆర్టీసీ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా జరిగింది. డిపోలో మిన్నంటిన రోదనలు తెల్లారేసరికి బస్సుల హారన్లతో సందడిగా కనిపించాల్సిన సిం హాచలం ఆర్టీసీ డిపో రోదనలతో నిండిపోయింది. వేకువజా మున బస్సులు కదలాల్సిన సమయానికి నాగేశ్వరరావు భార్య అమ్మాజీ, ఇద్దరు కుమారులు, పెద్ద సంఖ్యలో బంధువులతో డిపోకు చేరుకుని గేటు వద్ద భైఠాయించారు. వారి రోదనలతో డిపో శోకసంద్రమైపోయింది. బస్సులతో వెళ్లాల్సిన డ్రైవర్లు, కండక్టర్ల గుండెలు బరువెక్కిపోయాయి. యూనియన్లు, వర్గాలకు అతీతంగా నిరసన చెబుతూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. నాగేశ్వరరావు భార్యా పిల్లలకు సంఘీభావంగా నిలిచారు. మూకుమ్మడి బంద్‌తో నివ్వెరపోయిన పోలీసులు అసలే శనివారం.. అందులోనూ యాత్రికుల తాకిడి.. ఇక్కడి నుంచి కదలాల్సిన బస్సులు 110 పైగానే. ఈ బస్సులన్నీ వేకువజాము నుంచే నిలిచిపోయాయని తెలిసి గోపాలపట్నం సీఐ పైడియ్య, ఎయిర్‌పోర్టు జోన్ సీఐ మళ్ల శేషు, పెందుర్తి సీఐ సూర్యనారాయణ, ఎస్ఐలు తమ్మినాయుడు, జి.డి.బాబు, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో సహాయ పోలీసు కమిషనర్ అర్జున్ చేరుకున్నారు. కార్మికులకు నచ్చజెప్పి గేటు నుంచి పంపే ప్రయత్నం చేశారు. నాగేశ్వరరావు కుటుంబానికి న్యా యం జరిగే వరకూ ఇక్కడి నుంచి బస్సులను తీయలేమని డ్రైవర్లు, కండక్టర్లు భీష్మించారు. మూకుమ్మడి బంద్‌తో పోలీ సులు నివ్వెరపోయారు. దీంతో ఏసీపీ అర్జున్.. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుధేష్‌కుమార్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. కార్మికుల ఆందోళనతో సాయంత్రం 6 గంటల వరకూ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీంతో సింహాచలం వెళ్లే యాత్రికులు, భక్తులు, సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆటోలే దిక్కయ్యాయి. లిఖిత పూర్వక హామీ కోసం పట్టు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చి బస్సులను నడిపించాలని ఆర్ఎం సుధేష్‌కుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీపీఎం నేత బలివాడ వెంకటరావు ఆధ్వర్యంలో కార్మికులంతా లిఖిత పూర్వక హామీ కోసం పట్టుబట్టారు. మీడియా ముందు చెబుతున్నా నమ్మరా.. అంటూ ఆర్ఎం విజ్ఞప్తి చేస్తే.. మీరూ రాజకీయనేతలా హామీలిస్తే విలు వేముందంటూ కార్మికులు ప్రశ్నించారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ చర్చలు జరిపి ఎట్టకేలకు ఆర్ఎం లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. నాగేశ్వరరావుకు రావాల్సిన పరిహారాలను మూడు రోజుల్లో ప్రాసెస్ చేస్తామని, ఆయన కుమారుని విద్యార్హతను బట్టి తాత్కాలికంగా అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం కల్పిస్తామని.. తదుపరి రెగ్యులర్ పోస్టు ఇప్పిస్తామని, పెన్షన్, బెనిఫిట్లు రెండు నెలల్లో సెటిల్ చేస్తామని ఆర్ఎం తన సంతకంతో ఉన్న లేఖ రాసిచ్చారు. నేతల నిర్వాకంపై కార్మికుల ఆగ్రహం సింహాచలం ఆర్టీసీ గ్యారేజి డిపోలో కొందరు నేతల వైఖరిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎం డిపోకు వచ్చాక పలువురు తీరు మారిపోయింది. అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ సమస్యను నీరుగార్చే ప్రయత్నాలు చేయడంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఆర్ఎం కోరిక మేరకు వెళ్లిపోవాలని పలువురు చెబుతుంటే.. లిఖిత హామీ ఎందుకు.. మాటిచ్చారు కదా.. పదండిపోదాం.. అంటూ కదిలించే ప్రయత్నాలు చేయడంతో కార్మికులంతా గ్రహించి, ఆ నాయకులకు వారంతా చీవాట్లు పెట్టారు. మాకు దిక్కెవరు? ► నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడుకాదు ►నిశ్చితార్థం భోజనాలు తినాల్సిన ఇంట చావు మెతుకులు పెడతారా? ►రీజినల్ మేనేజర్, ఏసీపీల ఎదుట ►నాగేశ్వరరావు భార్య అమ్మాజీ రోదన ‘నా కుమారుడి నిశ్చితార్థం భోజనాలు శనివారం పెడతానని బంధులతో చెప్పి ఇంటి నుంచి డ్యూటీకి వెళ్లిన తన భర్తను శవంగా పంపి.. తమకు చావుమెతుకులు పెడతారా?.. నా భర్త పది మందికి సాయపడే ధైర్యవంతుడు.. ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదు.. అన్యాయం జరిగిపోయిందయ్యా..’అంటూ ఏసీపీ అర్జున్, ఆర్టీసీ ఆర్ఎం సుధేష్కుమార్ల వద్ద చింతా నాగేశ్వరరావు భార్య అమ్మాజీ గుండెలవిసేలా రోదించింది. సింహాచలం ఆర్టీసీ గ్యారేజి డిపోలో తొలుత ఏసీపీ అర్జున్ ఆమెను పరామర్శించారు. తర్వాత వచ్చిన ఆర్ఎం ఎదుట ఆమె కన్నీటి పర్యంతమైంది. రోజూ తన ఎదురుచూసుకునే డ్యూటీకి వెళ్లే భర్త రాత్రయినా రాకపోవడంతో ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందానని.. కుటుంబానికి దిక్కయిన డిపోలోనే ఆత్మహత్య చేసుకున్నాడని కుమిలిపోయింది. తనకు, తన బిడ్డలకు దిక్కెవరని విలపించింది. నాగేశ్వరరావు చేసుకుంది ఆత్మహత్య కాదని.. మానసికంగా వేధించి మరణానికి కారణమయ్యారని బంధువులు, సీఐటీయూ నేత శీర రమణ ఆరోపించారు. దీనిపై ఆర్ఎం స్పందిస్తూ మంచి ఉద్యోగిని కోల్పోవడం తమకూ బాధగా ఉందని, తన వంతు బాధ్యతగా నాగేశ్వరరావు కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. విచారణ జరుపుతాం : అర్జున్, ఏసీపీ ఆర్టీసీ డ్రైవర్ నాగేశ్వరరావు ఆత్మహత్య ఘటనపై విచారణ జరుపుతామని ఏసీపీ అర్జున్ తెలిపారు. ఇక్కడ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. జరిగిన ఘటనలో నాగేశ్వరరావు చేతిపై రాత, డిపోలో సంఘటన జరగడం వంటి పరిణామాలను పరిగణిస్తున్నట్లు చెప్పారు. డిపో మేనేజర్(డీఎం)ను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని నాగేశ్వరరావు బంధువులు చేసిన డిమాండ్‌పై స్పందించారు. ఇక్కడ విచారణలో సందేహాలు వద్దని చెప్పడానికే మరో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు కేసుకు సంబంధించిన ఏసీపీ ప్రవీణ్‌కుమార్ కూడా దర్యాప్తులో భాగంగా ఉన్నారని తెలిపారు. డీఎం వేధింపులు భరించలేకపోతున్నాం.. సింహాచలం డిపో మేనేజర్, స్క్వాడ్ల తీరుపై ఆర్ఎంకు ఫిర్యాదు సింహాచలం ఆర్టీసీ గ్యారేజీ డిపోలో డ్రైవర్ చింతా నాగేశ్వరరావు ఆత్మహత్య సంఘటన నేపథ్యంలో అలా ఒత్తిడికి గురైన కండక్టర్లు, డ్రైవర్లు ఆర్ఎం సుధేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. డిపో మేనేజర్ దివ్య తీరును భరించలేకపోతున్నామని ఏకరువు పెట్టారు. స్క్వాడ్ల పేరిట అధికారులు ప్రయాణికుల ఎదుట తీవ్రంగా అవమానిస్తున్నారని, మహిళా కండక్టర్లని కూడా చూడకుండా కుంగిపోయేలా వారి చర్యలు ఉంటున్నాయని ఆవేదన చెందారు. గతంలో ఇదే డిపోకు చెందిన డ్రైవర్ ఆర్పీ నాయుడు గాజువాకలో లారీ ట్రాలర్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇప్పుడు నాగేశ్వరరావు పురుగుల మందు తాగి డిపోలోనే ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ఇలా అనేక మంది వారికి జరిగిన అవమానాలను ఆయనకు వివరించారు. పలువురి బాధితుల మాటల్లోనే.. మెడకు బోర్డు తగిలించి తిప్పారు నేను 28కే బస్ నడుపుతున్న సమయంలో 104 జంక్షన్ వద్ద రిక్వెస్టు స్టాప్‌లో విపరీతమైన రద్దీగా ఉండడం వల్ల ఆపలేదు. అక్కడ ఆ బస్సుకు స్టాప్ నిర్ణయించలేదు కూడా. బస్సు ఆపలేదని డీఎంకు ఎవరో ఫోన్ చేసి చెబితే నేను రెస్ట్ ఆఫ్‌లో ఉన్న రోజున డిపోకి పిలిచి మరీ నా మెడలో బోర్డు తగిలించారు. అలా ఎక్కడైతే బస్సు ఆపలేదో అక్కడ అందరినీ క్షమాపణ కోరుతూ డ్రైవర్లకు కనిపించేలా తిరగాలని ఆదేశించారు. ఆ రోజంతా అలా బోర్డు తగిలించుకుని అవమానంతో బాధపడ్డాను. – ఎం.ఎన్.రావు, డ్రైవర్ బస్సెక్కినా వేధింపులే.. బస్సులో ప్రయాణికులతో ఎంత జాగ్రత్తగా ఉండాలని అత్రుతగా ఉంటాం. అలాంటి తరుణంలో ఎవరో ప్రయాణికుల నుంచి వాట్సప్ ఫిర్యా దు వచ్చిందని డ్యూటీలో ఉండగానే ఫోన్ చేసి డీఎం వేధిస్తుంటారు. ఇలా ఒత్తిళ్ల వల్లే కేపీ నాయుడు, నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. – వల్లీ, కండక్టర్ ప్రయాణికుల ఇళ్లకు పంపుతున్నారు.. బస్సులో చిల్లర సమస్య అందరికీ తెలిసిందే. పలు సందర్భాల్లో చిల్లర లేదని డ్యూ రాస్తే బస్సు దిగినప్పుడు ప్రయాణికులు మరచిపోయి డీఎంకు ఫోన్ చేస్తే వారి ఇళ్లకు వెళ్లి డ్యూ ఇచ్చేసి రమ్మని ఆదేశిస్తున్నారు. మహిళా కండక్టర్లని కూడా చూడడం లేదు. ఇలా అయితే ఎలా?. – భవానీ, కండక్టర్ ఇంక్రిమెంట్ కట్ చేశారు.. నేవీ డే నాడు ట్రిప్‌లు పెంచారు. మరుసరి రోజు రాత్రి 12 గం టల వరకూ పని చేయలేనని చెబితే డీఎం అర్థం చేసుకోలేదు. ఓరోజు రెండు టికెట్లు మిస్సయ్యాయన్న కారణంతో మెమో ఇవ్వకుండా ఇంక్రిమెంట్ కట్ చేసేశారు. – బీవీ లక్ష్మి, కండక్టర్ బ్యాగులు చింపి మరీ తనిఖీలా.. స్క్వాడ్ అధికారులు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. కండక్టర్లేదో డబ్బులు వెనకేసుకుంటున్నారన్న అనుమానాలతో మహిళా కండక్టర్లని కూడా చూడడం లేదు. చేతిలో ఉన్న బ్యాగుల అరలను చింపేసి మరీ ప్రయాణికుల ముందు తనిఖీలు చేస్తున్నారు. నేను అలా అవమాన భారం పడ్డాను. – బి.ఎస్.రత్నం, కండక్టర్ -
సార్ కోసం..బస్సు ఖాళీ
బద్వేలు(అట్లూరు): ప్రయాణికుల శ్రేయస్సే ఆర్టీసీ లక్ష్యం అని అధికారులు పదే పదే గొప్పలు చెబుతుంటారు. కానీ అందుకు విరుద్ధంగా ప్రయాణికులను గాలికొదిలేసి సార్.. సేవలో మునిగిపోయి తీరిగ్గా ఖాళీ సీట్లతో బస్సు వెళ్లిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ప్రయాణికుల వివరాల మేరకు.. బద్వేలు డిపోకు చెందిన ఏపీ04జెడ్0290 నెంబరుగల బస్సు శుక్రవారం ఉదయం ప్రయాణికులతో నెల్లూరుకు బయలు దేరేందుకు సిద్ధంగా ఉంది. ఈబస్సు 6.45 గంటలకు బయలు దేరాలి. 7.15 గంటలు అయినా బయలు దేరలేదు. బస్సు ఎందుకు బయలు దేరలేదని కండక్టరును ప్రయాణికులు అడిగారు..డీఎం సార్ నేనూ వస్తున్నా.. అంతవరకు బయలు దేరవద్దన్నారు.. సమాధానమిచ్చారు. దీంతో కొంత మంది ప్రయాణికులు వేరే డిపోకు చెందిన బస్సులో బయలు దేరారు. ఈ విషయం మీడియాకు తెలిసి ఫొటోలు తీస్తుండగా వెంటనే కండక్టర్ డీఎంకు సమాచారం అందించారు. ఆయన హుటాహుటీన బస్సు ఎక్కి బయలు దేరి వెళ్లారు. దీంతో సగం బస్సు ఖాళీగానే బయలు దేరింది. -
ఏసీబీ వలలో ఆర్టీసీ డీఎం
రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టబడిన వైనం నిడదవోలులోని డీఎం ఇంట్లోనూ సోదాలు కీలక పత్రాలు స్వాధీనం నిడదవోలు : ఏపీఎస్ఆర్టీసీ నిడదవోలు డిపో మేనేజర్ జీఎల్‌పీవీ సుబ్బారావు మంగళవారం ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. డిపో నిర్వహణలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బిల్లులు మంజూరు విషయంలో డీఎం జీఎల్‌పీవీ సుబ్బారావు సొమ్ములు డిమాండ్ చేస్తుండగా కాంట్రాక్టర్ కైలా రామకృష్ణరావు ఏసీబీ అధికారులకు సంప్రదించారు. డిపోలో 2016 నుంచి చైతన్య జ్యోతి సంక్షేమ సంఘం అనే ప్రైవేట్ సంస్థ ద్వారా నలుగురు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. డిపోలో ఉదయం ఇద్దరు, సాయంత్ర వేళలో ఇద్దరు స్వీపర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఈ ఏడాది మే, జూన్ నెలలకు జీతాలకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ రామకృష్ణారావు బిల్లులు మంజూరు చేయమని పలుమార్లు డీఎంను అడిగారు. ఇందుకు తనకు రూ.5 వేలు ఇవ్వాలని డీఎం సుబ్బారావు డిమాండ్ చేవారు. దీంతో కాంట్రాక్టర్ రామకృష్ణారావు ఈనెల 21న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మధ్యాహ్న వేళ మాటువేసి.. కాంట్రాక్టర్ రామకృష్ణారావు ఫిర్యాదు మేరకు పట్టణానికి మంగళవారం మధ్యాహ్నం 12 మంది సభ్యుల ఉన్న ఏసీబీ అధికారులు బృందం చేరుకుంది. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కాంట్రాక్టర్ రామకృష్ణారావు డీఎం చాంబర్‌కు చేరుకుని రూ.5 వేలు ఇస్తుండగా ఆరుగురు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అదేసమయంలో మరో ఆరుగురు ఏసీబీ అధికారులు డీఎం ఇంట్లోనూ సోదాలు చేశారు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ డీఎం సుబ్బారావు నుంచి రూ.5 వేలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా డీఎం సుబ్బారావుకు రూ.2 వేలు లంచం ఇచ్చానని, బిల్లుల మంజూరుకు మళ్లీ సొమ్ములు చేశారని కాంట్రాక్టర్ చెబుతున్నారు. డీఎం చాంబర్‌లోని రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించారు. డీఎం వద్ద స్టేట్మెంట్స్ నమోదు చేసుకున్నారు. పట్టణంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ సమీపంలోని డీఎం సుబ్బారావు ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు రికార్డులు, బ్యాంకు ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. -
పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
వెదురుపాక (రాయవరం) : పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రాజమండ్రి ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. మండలంలోని వెదురుపాక రూట్ పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్తికమాసంలో భక్తుల సౌకర్యార్థః పంచారామ శైవ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పుణ్యక్షేత్రాలను ఒకే రోజులో సందర్శించే విధంగా బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రతి శని, ఆదివారం ప్రత్యేక బస్సులు రాత్రి ఏడు గంటలకు రాజమండ్రిలో బయలుదేరతాయన్నారు. టికెట్ రిజర్వేషన్ చేయించుకునే సౌకర్యం ఉందన్నారు. ఎక్స్‌ప్రెస్, ఆల్ఫాడీలక్స్, సూపర్‌లగ్జరీ బస్సులు నడుపుతున్నామన్నారు. పంచారామాల దర్శనానికి ఎక్స్‌ప్రెస్ బస్సులో పెద్దలకు రూ.630, పిల్లలకు రూ.490, ఆల్ఫాడీలక్స్లో పెద్దలకు రూ.770, పిల్లలకు రూ.600, సూపర్‌లగ్జరీ బస్సులో పెద్దలకు రూ.810, పిల్లలకు రూ.630 టికెట్ ధరగా వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఏ గ్రామంలోనైనా 45 ప్రయాణికులుంటే అదే గ్రామం నుంచి బస్సు నడుపుతామన్నారు. అలాగే భక్తులు బృందాలుగా వస్తే ఏరోజైనా పంచారామ దర్శనానికి బస్సులు నడపుతామన్నారు. ఈ అవకాశాన్ని అయ్యప్పస్వాములు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇతర వివరాలకు 73829 11410 నంబరుకు ఫో¯ŒS చేయాలని ఆయన సూచించారు. -
నేడు డయల్ యువర్ డీఎం
హన్మకొండ : ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా వారి నుంచి సల హాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ భానుకిరణ్ తెలిపారు. ఈమేరకు శనివారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్ యు వర్ డీఎం కార్యక్రమం జరుగుతుం దని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ములుగు, ఏటూరునాగారం, హైదరాబాద్, కాళేశ్వరం రూట్ ప్రయాణికులు తమ సల హాలు, సూచనలను 73828 26048 నంబర్‌కు ఫోన్ చేసి అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరార -
ఫిర్యాదు చేయడానికెళ్లి ...శవం అయ్యాడు
ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్, ముజఫర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. తన కూతుర్ని వేధిస్తున్న ఆకతాయిలపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఓ పెద్దాయన శవమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం షామిలి జిల్లాలోని జిల్లా మేజిస్ట్రేట్ ఆవరణలో బచన్ దాస్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయి వుండడాన్ని పోలీసులు గుర్తించారు. అతని చేతిలో జిల్లా మేజిస్ట్రేట్‌కు (డీఎం) ఇవ్వడానికి రాసిపెట్టుకున్న విజ్ఞాపన పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన కూతుర్ని ఇద్దరు ఆకతాయిలు వేధిస్తున్నారని, వారినుండి తన బిడ్డను కావాడాలని కోరుతూ బచన్ దాస్ అర్జీ రాసుకున్నాడు. అయితే డీఎంను కలవలేకపోయానన్న బాధతోనే విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అలాగే దగ్గర ఉన్న ఫిర్యాదు కాగితాల్లో ఉన్న వివరాల ఆధారంగా ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు.