ఫిర్యాదు చేయడానికెళ్లి ...శవం అయ్యాడు | Man went to complain to Shamli DM, found dead | Sakshi
Sakshi News home page

ఫిర్యాదు చేయడానికెళ్లి ...శవం అయ్యాడు

Published Thu, Jun 11 2015 12:10 PM | Last Updated on Sat, Aug 25 2018 5:29 PM

ఫిర్యాదు చేయడానికెళ్లి ...శవం అయ్యాడు - Sakshi

ఫిర్యాదు చేయడానికెళ్లి ...శవం అయ్యాడు

ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్, ముజఫర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. తన కూతుర్ని  వేధిస్తున్న ఆకతాయిలపై  ఫిర్యాదు చేయడానికి వెళ్లిన  ఓ పెద్దాయన శవమైన ఘటన  స్థానికంగా కలకలం  రేపింది.   పోలీసుల సమాచారం ప్రకారం షామిలి జిల్లాలోని  జిల్లా మేజిస్ట్రేట్ ఆవరణలో బచన్ దాస్ అనే వ్యక్తి  ప్రాణాలు కోల్పోయి వుండడాన్ని పోలీసులు గుర్తించారు.

 

అతని చేతిలో జిల్లా మేజిస్ట్రేట్కు (డీఎం) ఇవ్వడానికి రాసిపెట్టుకున్న విజ్ఞాపన పత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన కూతుర్ని ఇద్దరు ఆకతాయిలు వేధిస్తున్నారని, వారినుండి తన బిడ్డను కావాడాలని కోరుతూ బచన్ దాస్ అర్జీ రాసుకున్నాడు. అయితే డీఎంను కలవలేకపోయానన్న బాధతోనే విషం తాగి ఆత్మహత్య  చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.   మృతదేహాన్ని   స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తరలించారు. అలాగే  దగ్గర ఉన్న ఫిర్యాదు కాగితాల్లో ఉన్న  వివరాల ఆధారంగా ఇద్దరు  యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement