పట్టణం నుంచి పిడుగురాళ్లకు బయలుదేరిన ఆర్టీసి బస్సు కండక్టర్ బ్యాగ్‌లో ఉన్న రూ.7వేల నగదును పట్టణ శివారులోని..
ఆర్టీసీ కండక్టర్ బ్యాగ్‌లో నగదు చోరీ
Published Mon, Dec 5 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
రూ.7 వేలు అపహరణ
మాచర్ల: పట్టణం నుంచి పిడుగురాళ్లకు బయలుదేరిన ఆర్టీసి బస్సు కండక్టర్ బ్యాగ్‌లో ఉన్న రూ.7వేల నగదును పట్టణ శివారులోని గుంటూరు రోడ్డులోని చెన్నకేశవనగర్‌లో చోరీ చేసిన సంఘటన సంచలనం కలిగించింది. మాచర్ల ఆర్టీసి డిపోకు చెందిన ఏపీ 07 వై 5219 బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుజాత టిక్కెట్లు కొడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె బ్యాగ్‌లోని రూ.7 వేలను చోరీ చేశారు. టిక్కెట్లు కొడుతూ చిల్లర ఇచ్చేందుకు బ్యాగ్‌లో చూడగా రూ.7500లో రూ.7 వేలు నగదు చోరీకి గురైనట్టు గమనించిన ఆమె ఆవేదనతో ఆర్టీసి డిపో అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంబంధిత బస్సును పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించి బస్సులో ఉన్న ప్రతి ఒక్కరినీ తనిఖీ చేశారు. అనంతరం చోరీకి పాల్పడిన వ్యక్తి గురించి పోలీసులు విచారణ ప్రారంభించారు. నోట్ల మార్పిడి, డిపాజిట్ల కార్యక్రమం ప్రారంభమయ్యాక పట్టణంలో మూడుసార్లు బ్యాంక్‌ల వద్ద నగదు చోరీకి గురికాగా నాలుగోసారి ఆర్టీసీ బస్సులో కండక్టర్ బ్యాగ్‌లో నగదు మాయం కావడం సంచలనం కలిగించింది. చోరీపై కండక్టర్ సుజాత సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement