
సాక్షి, ఖమ్మం: సెల్ ఫోన్ విషయంలో జరిగిన వివాదం ఓ బాలిక ప్రాణాలు తీసింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంకు చెందిన 15ఏళ్ల బాలిక ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతుంది. ఆన్లైన్ క్లాసులు ఉండటంతో సెల్ ఫోన్,ఇయర్ ఫోన్స్ తీసుకుంది. ఇదే సమయంలో తమ్ముడికి, అక్కకు మధ్య ఫోన్ విషయంలో జరిగింది. ఈ గొడవ కాస్త బాలిక ప్రాణాలు పోయే పరిస్థితి కి తెచ్చింది. దీంతో క్షణికావేశంలో ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఊరివేసుకొని వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు తల్లాడ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment