కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకేసారి మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూసుకెళ్తున్నారు. అయితే అభ్యర్థుల ఎంపికపై సొంతపార్టీ నాయకులే ఆమెపై అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎం మమతా.. సోదరుడు బాబున్ బెనర్జీ కీలకమైన హౌరా లోక్‌సభకు ప్రకటించిన అభ్యర్థిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సిట్టింగ్ ఎంపీ ప్రసూన్ బెనర్జీకి సీఎం మమతా మరోసారి హౌరా స్థానం నుంచి అవకావం కల్పించారు. దీనిపై దీదీ సోదరుడు బాబున్ బెనర్జీ విమర్శించారు. ‘హౌరాకు ఎంపిక చేసిన అభ్యర్థి విషయంలో నేను సంతోషంగా లేను. ఆయన ఎంపిక సరైంది కాదు. అక్కడ చాలా సమర్థులైన నేతలు ఉన్నారు. వారందిరినీ కాదని ప్రసూన్ తిరిగి అభ్యర్థిగా ఎంపిక చేయటం సరికాదు’ అని బాబున్ అన్నారు. మరోవైపు బాబున్ బెనర్జీ బీజేపీలో చేరుతున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాను ఏ పార్టీలో చేరనని.. మమాతా బెనర్జీతో ఉన్నానని, దీదీతోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
తాను ఎంపిక చేసిన అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అడ్డం తిరుగుతున్న బాబున్ బెనర్జీపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘నేను, నా కుటుంబం.. బాబున్ బెనర్జీతో సంబంధాలను వదులుకున్నాం. ప్రతి ఎన్నికల ముందు బాబున్ ఏదో ఒక సమస్యను తెరపైకి తీసుకువస్తాడు. అత్యాశ గల వ్యక్తులను నేను ఇష్టపడను.. కుటుంబ రాజకీయాలను నేను ప్రోత్సహించను. అందుకే నేను హౌరా స్థానంలో ప్రసూన్‌కు టికెట్ కేటాయించా. సోదరుడు బాబున్‌తో అన్ని సంబంధాలు తెంచుకున్నా’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు.
బాబున్ బెనర్జీ ఎప్పుడూ తన సోదరి సీఎం మమత బెనర్జీని విభేదిస్తూనే ఉంటారని తెలుస్తోంది. ఇక.. కరోనా సమయంలో కూడా బాబున్ బెనర్జీ కోవిడ్ నింబంధనలు ఉల్లంఘించటంతో సీఎం మమతా ఆగ్రహానికి గురయ్యారు.
చదవండి: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఢిల్లీలో మరో రెండు మెట్రో కారిడార్లు
Comments
Please login to add a commentAdd a comment