సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. శాండల్‌వుడ్ నటి అనితా భట్ సోదరుడు గుండెపోటుతో మరణించారు. దీంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇటీవల గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. సోదరుని మరణాన్ని తలుచుకుంటూ కన్నీటి పర్యంతమైంది.
అనితా ట్వీట్‌లో రాస్తూ.. 'నిన్న నా గుండె ముక్కలైంది. కార్డియాక్ అరెస్ట్‌తో మా సోదరుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ బాధను మాటల్లో వర్ణించలేను. అతను తిరిగి రాలేడనే చేదు నిజాన్ని అంగీకరించక తప్పదు. దయచేసి అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. ఈ కష్ట సమయంలో మీ అందరి ఆశీస్సులు కావాలి.' అంటూ పోస్ట్ చేసింది. సోదరునితో చిన్నప్పుడు దిగిన ఫోటోను షేర్ చేస్తూ అనితా భావోద్వేగానికి లోనైంది.
కాగా.. అనితా భట్ 2008లో సైకో అనే సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె దశవాల, సిల్క్, సుగ్రీవ, పరపంచ, రాజ్ బహదూర్, టగరు, డేస్ బోరాపూర్, హోసా క్లైమాక్స్ లాంటి చిత్రాలలో నటించింది.
A piece of my heart tore apart yesterday. My brother left us due to cardiac arrest. No words can explain the pain we are going through and the bitter truth we need to accept is he won't come back. Please bless him to get Sadgati. Need lots of yours blessing now 🙏🏻 pic.twitter.com/Ww9QOs1wog
— Anita Bhat (@IamAnitaBhat) April 10, 2023
Comments
Please login to add a commentAdd a comment