![Lavanya Tripathi Raksha Bandhan Celebrations With Her Brother - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/30/WhatsApp%20Image%202023-08-30%20at%2015.06.25.jpeg.webp?itok=EN9t9QOS)
త్వరలోనే మెగా కోడలిగా అడుగుపెట్టబోతోన్న టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఇప్పటికే వరుణ్ తేజ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముద్దుగుమ్మ ఈ ఏడాది చివర్లోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేదికతో పాటు పెళ్లి తేదీపై కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట తన రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించి ఉంగరాలు కూడా మార్చుకున్నారు.
(ఇది చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ! )
అయితే ప్రస్తుతం తన ఫ్యామిలీతో ఉన్న లావణ్య త్రిపాఠి తాజాగా రక్షాబంధన్ సందర్భంగా ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో అన్న, వదినతో కలిసి రక్షాబంధన్ వేడుక జరుపుకున్నారు. అన్నా, చెల్లెల్ల అనుబంధం ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడిచ్చిన వరలాంటిదని అన్నారు. ఇన్‌స్టాలో లావణ్య రాస్తూ..' అన్న, వదినకు రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు. మీపై ప్రేమ రోజు రోజుకు ఇంకా పెరుగుతూనే ఉంది.' అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు సైతం లావణ్యకు హ్యాపీ రాఖీ అంటూ అభినందనలు తెలుపుతున్నారు.
(ఇది చదవండి: ఆనంద్ దేవరకొండ సినిమాకు హీరోయిన్‌గా ప్రగతి.. బేబీకి నో ఛాన్స్)
Comments
Please login to add a commentAdd a comment