
సాక్షి,ఎర్రవల్లిచౌరస్తా (అలంపూర్): తమ్ముడి చేతిలో అన్న దారుణ హత్యకు గురైన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని చాగాపురానికి చెందిన పెద్ద నర్సింహులు (32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని తమ్ముడు చిన్న నర్సింహులు ఇంటర్ ఫెయిల్ కావడంతో మద్యానికి బానిసై గ్రామంలోనే జులాయిగా తిరగసాగాడు.
కొంతకాలంగా తమ ఇంటి విషయంలో వాటా ఇవ్వాలంటూ తరచూ అన్నతో వాగ్వాదానికి దిగేవాడు. ఈ క్రమంలోనే పథకం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి మద్యం తాగొచ్చి అన్నపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కాగా, పెద్ద నర్సింహులుకు భార్య జయంతితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విషయమై బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సంఘటన స్థలాన్ని అలంపూర్ సీఐ సూర్యానాయక్, ఇటిక్యాల ఎస్‌ఐ గోకారి పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. (చదవండి: రియల్ వ్యాపారి దారుణ హత్య: కళ్లల్లో కారం కొట్టి.. రాళ్లతో కొట్టి చంపి )
Comments
Please login to add a commentAdd a comment