20 మందితో బీఎస్పీ తొలి జాబితా | contest assembly elections alone: RS Praveen kumar | Sakshi
Sakshi News home page

20 మందితో బీఎస్పీ తొలి జాబితా

Published Wed, Oct 4 2023 3:02 AM | Last Updated on Wed, Oct 4 2023 3:03 AM

contest assembly elections alone: RS Praveen kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌­కుమా­ర్‌ ప్రకటించారు. తాను ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి ది­గు­తున్నట్టు వెల్లడించారు. మంగళవారం హై­దరాబాద్‌లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాల­యంలో ఆ పార్టీ జాతీయ కో–ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్‌తో కలసి పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబి­తా­ను ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు. ఎన్ని­క­ల నోటిఫికేషన్‌ క­న్నా ముందే 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటిస్తు­న్నామని, త్వరలో మరి­కొంద­రు అభ్యర్థులను వెల్లడిస్తా­మ­ని చెప్పారు.

ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ ప్రకటనలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రధా­ని మోదీ పసుపు బోర్డు, గిరిజన యూని­వర్సిటీ ప్రకట­నలు చేశారని ప్రవీణ్‌­కుమార్‌ విమ­ర్శించారు. ఆచరణలో అమలు­కాని హామీల­తో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మేనిఫెస్టోలు ఉంటున్నాయని విమర్శించారు. అధికారాన్ని అట్టిపెట్టుకో­­వాలనే ఉద్దేశంతోనే సమగ్ర కు­టుంబ సర్వేను కేసీఆర్‌ బయ­ట­పెట్టడం లేదని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో చేసిన సర్వేను రహస్యంగా ఉంచడం ఎందుకని నిలదీశారు. బీఎస్పీ ప్రజాబ­లం ఉన్న పార్టీ అని, బీజేపీ, బీఆర్‌­ఎస్‌ పార్టీలకు ధనబలమే తప్ప ప్రజాబ­లం లేదని వ్యాఖ్యానించారు.

బీఎస్పీ తొలి జాబితా ఇదీ..
సిర్పూర్‌ – ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, జహీరా­బాద్‌ – జంగం గోపి, పెద్దపల్లి – దాసరి ఉష, తాండూరు – చంద్రశేఖర్‌ ముదిరాజ్, దేవరకొండ – ముడావత్‌ వెంకటేశ్‌ చౌహాన్, చొప్పదండి – కొంకటి శేఖర్, పాలేరు – అల్లిక వెంకటేశ్వర్‌రావు, నకిరేకల్‌ – మేడి ప్రియదర్శిని, వైరా – బానోత్‌ రాంబాబు నాయక్, ధర్మపురి – నక్క విజయ్‌ కుమార్, వనపర్తి– నాగ మోని చెన్నరాములు, మాన­కొండూరు – నిషాని రామచందర్, కోదాడ – పిల్లిట్ల శ్రీనివాస్, నాగర్‌ కర్నూల్‌ – కొత్తపల్లి కుమార్, ఖానాపూర్‌ – బన్సీలా ల్‌ రాథోడ్, ఆందోల్‌ – ముప్పారపు ప్రకాశ్, సూర్యా పేట – వట్టే జానయ్య యాదవ్, వికారాబాద్‌ – గో ర్లకాడి క్రాంతికుమార్, కొత్తగూడెం– ఎర్ర కామేశ్, జుక్కల్‌– ప్రద్న్య కుమార్‌ మాధవరావు ఏకాంబర్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement