
SAS (అందోల్): రాష్ట్ర సాధన ఉద్య మంలో పాటల రూపంలో ఉత్తేజపరిచిన గొంతులన్నీ మూగబో యాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ‘బీఎస్పీ శక్తి ప్రదర్శన’ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముప్పారం ప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కవులు, కళాకారులందరూ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల గొంతుకల కోసం బీఎస్పీలోకి రావాలని పిలుపునిచ్చారు.
విప్లవా త్మకమైన పాటలను రాసిన వారిని, పాడిన వారిని గుర్తు చేసుకుంటూ పాటలు పాడుతూ అక్కడున్న వారిని ఆయన ఉత్తేజపరిచారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ కోసమే రూ.2 వేల కోట్లతో కొండపోచమ్మ రిజర్వాయర్‌ను రెండేళ్లలో పూర్తిచేశారని, సంగమేశ్వర, బస్వవేశ్వర ఎత్తిపోథల పథకానికి రూ.4 వేల కోట్లు మంజూరు చేయకపోతే క్రాంతి కిరణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు నటరాజన్ పాల్గొన్నారు.
జర్నలిస్టుపై దాడిచేస్తే స్పందించని ఎమ్మెల్యే
అందోల్‌లో అధికార పార్టీ నాయకుల అహంకారానికి అల్లాదుర్గం సాక్షి దినపత్రిక జర్నలిస్టుపై దాడిచేయడమే నిదర్శనమన్నారు. జర్నలిస్టు ఎమ్మె ల్యేగా ఉన్నా క్రాంతికిరణ్ జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. ఆయ న్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment