కందనూలు బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
పోటీ పడే ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు పూర్తి
సాక్షి, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రకటనతో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల ప్రధాన పార్టీల లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. విజయం కోసం ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ఎంపీ అభ్యర్థులు ఎవరో తేలడంతో స్థానికంగా సమీకరణాలు సైతం శరవేగంగా మారుతున్నాయి. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కొంతమంది నాయకులతో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
100 రోజుల్లో తాము అమ లు చేసిన పతకాలు, అభివృద్ధి పనులు, చేపట్టబోయే పనుల గురించి ఓటర్లకు వివరించాలని భావిస్తోంది. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్ల ముందు ఎండగట్టాలని నిర్ణయించింది. బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వ పథకాలపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. ఇప్పటికే ప్రధాని మోదీ పర్యటన పూర్తి కాగా ఇతర నేతలను రప్పించి సభలు, రోడ్‌షోలు నిర్వహించి ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని భావిస్తోంది.
నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రొఫైల్..
పేరు: రేపల్లే శివ ప్రవీణ్ కుమార్
తల్లిదండ్రులు: ప్రేమలత, సవారన్న
పుట్టిన తేది: 23-11-1967
స్వస్థలం: అలంపూర్
విద్యార్హతలు: ఎంఏ(పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) హార్వర్డ్ యూనివర్సిటీ, యూఎస్ఏ
వృత్తి: ఐపీఎస్ అధికారి(1995 బ్యాచ్, గతేడాది ఉద్యోగానికి రాజీనామా), గురుకుల కార్యద ర్శితో పాటు ప్రభుత్వశాఖలో వివిధ హోదాలో పనిచేశారు. స్వేరోస్ సంస్థ స్థాపించి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు.
రాజకీయ అనుభవం: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ గత శాసనసభ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో
చేరారు.
ఇవి చదవండి: ‘పల్లా’కు మతిభ్రమించింది.. : సుంకెట అన్వేష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment