
బయ్యారం గుట్టపై ఇనుపరాయిని పరిశీలిస్తున్న ఆర్‌ఎ.ఎస్. ప్రవీణ్‌కుమార్
బయ్యారం: గనులను తవ్వి ఉపాధి కల్పించమంటే బీజేపీ నాయకులు మసీదులు తవ్వు తామంటున్నారని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. బ హుజన రాజ్యాధికారయాత్ర లో భాగంగా సోమవారం ఆయన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని ఇనుప రాయిగుట్టపై ఇనుపరాయిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ నిర్మాణంపై బీజేపీ, టీఆర్‌ఎస్ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో మైనింగ్ శాఖమంత్రిగా కొనసాగుతున్న కేటీఆర్ ట్వీట్లు పెడుతున్నారనే తప్ప పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావడం లేద న్నారు. ఇప్పటికైనా ఉక్కు పరిశ్రమను నిర్మించాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు.