
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (ఫైల్ పిక్)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా ఉన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా ఉన్న హన్మంతునాయక్ రిలీవ్ కావడంతో ఆ బాధ్యతల్ని ప్రవీణ్‌కుమార్‌కు అప్పగిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి బుద్ధప్రకాశ్ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు.