Study Circle
-
ఎస్సై, కానిస్టేబుల్ ఫిజికల్, మెయిన్స్‌కు ఉచిత కోచింగ్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో బీసీ స్టడీ సర్కిల్స్‌లో కోచింగ్ తీసుకున్న 1237 మంది అభ్యర్థులు అర్హత సాధించారని టీఎస్‌బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.అలోక్ కుమార్ తెలిపారు. వారికి ఫిజికల్, మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం వచ్చే నెల 2 నుంచి ఉచిత కోచింగ్ ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 15 స్టడీ సర్కిళ్లుండగా.. హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం స్టడీ సర్కిళ్లలో 250 మందికి, మిగతా సర్కిళ్లల్లో 100 మందికి 90 రోజులపాటు కోచింగ్ ఇవ్వనున్నా రు. ప్రిలిమ్స్‌కు అర్హత సాధించి, స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకోని అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికలు జరుగుతాయని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశం పొందిన అభ్యర్థులందరికీ స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తారు. -
ప్రతి జిల్లాకు 4 స్టడీ సర్కిళ్లు.. కేసీఆర్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్–1 వంటి కేంద్ర, రాష్ట్ర సర్వీసుల ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చేందుకు ‘ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని కోరారు. నాలుగు వర్గాలకు నాలుగు ఆల్ ఇండియా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో బడుగు, బలహీనవర్గాలకు విద్యా, ఉపాధి సంబంధిత అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా వర్గాల విద్యార్థినీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యనందించడం, పోటీ పరీక్షలకు శిక్షణనివ్వడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించడం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అందుబాటులో జాతీయ స్థాయి నోటిఫికేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగం, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో విడుదలయ్యే ఉద్యోగాల నోటిఫికేషన్లను స్టడీ సర్కిళ్లలో అందుబాటులో ఉంచాలని, అందుకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. చదువుకు తగ్గ ఉద్యోగ, ఉపాధి సమాచారాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించే కేంద్రాలుగా స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలన్నారు. అద్భుతమైన భూమికను పోషించాలి ‘స్టడీ సర్కిళ్లు క్యాంపస్ రిక్రూట్మెంట్ కేంద్రాలుగా మారాలి. ఎంప్లాయ్మెంట్ అవెన్యూలుగా వాటిని తీర్చిదిద్దాలి. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అందివచ్చే ఉద్యోగాలను అందిపుచ్చుకునే విధంగా యువతను తీర్చిదిద్దాలి. ఒక ప్రతిభావంతమైన స్టడీ సర్కిల్ ఎలా ఉండాలో విధివిధానాలను అధికారులు రూపొందించాలి. ఇందుకు సమర్ధవంతులైన అధికారులను నియమించాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండస్ట్రీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సులను పూర్తి చేసుకున్న తెలంగాణ యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధిని కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సర్కిళ్లు పోషించాలి. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేట్ రంగాలలో కూడా ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా మారాలి. శిక్షణ పొందుతున్న అర్హులైన అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో భోజన వసతులు ఏర్పాటు చేయాలి. ప్రతి స్టడీ సర్కిల్లో కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను కల్పించాలి. ఆయా జిల్లాల్లో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అనుసరించి ప్రవేశాలు కల్పించే దిశగా విధివిధానాలు రూపొందించాలి. విద్యార్థులకు కల్పించినట్టుగానే విద్యార్థినులకు కూడా ప్రత్యేక వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి’ అని సీఎం ఆదేశించారు. అన్ని గురుకులాల్లో ఇంటర్మీడియెట్ పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలతో పాటు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో సైతం ఇంటర్మీడియెట్ విద్యను, కోర్సులను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక విద్యనుంచి ఉన్నతవిద్య వరకు పునాది వేస్తున్నట్టే, విద్యార్థి దశలో కీలకమైన మలుపుగా భావించే ఇంటర్మీడియెట్ విద్య వరకు కూడా ప్రభుత్వమే పునాది వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉన్నతాధికారిని నియమించాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులు ఎంతమంది? పదో తరగతి అనంతరం వారు ఎంచుకుంటున్న మార్గాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను అందించాలని కోరారు. గురుకులాల్లో ఆధునిక కోర్సులు రాష్ట్రంలో ప్రస్తుతమున్న గురుకుల డిగ్రీ కళాశాలలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17కు పెంచి మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, మొత్తంగా జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో బీసీ వర్గాల జనాభా అధికంగా ఉందని, వారి జనాభా దామాషా ప్రకారం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పెంచాలన్నారు. సాంప్రదాయ కోర్సులను కాకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగావకాశాలను కల్పించే ఆధునిక డిగ్రీ కోర్సులను రూపొందించాలని సూచించారు. అలాగే ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 జిల్లాల్లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ప్రతీ జిల్లాలో స్టడీ సర్కిల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా సంక్షేమ శాఖల ద్వారా ప్రతి జిల్లాకు ఒక స్టడీ సర్కిల్ తెరవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. అందులోనూ కేవలం ఎస్సీ అభివృద్ధి, గిరిజన, బీసీ సంక్షేమ శాఖలు మాత్రమే స్టడీ సర్కిళ్లు నిర్వహిస్తుండగా... మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖలు మాత్రం స్టడీ సర్కిళ్లపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తాజాగా అన్ని సంక్షేమ శాఖలకు జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్‌కుమార్‌కు పలు సూచనలు చేయగా... గత వారం సీఎస్ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాకొక స్టడీ సర్కిల్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని, ప్రస్తుతం కొనసాగుతున్నవి, ఎక్కడెక్కడ అవసరం ఉంది తదితర సమగ్ర వివరాలతో సంక్షేమ శాఖల వారీగా నివేదికలు ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసే స్టడీ సర్కిళ్లు శాశ్వత ప్రాతిపదికన కొనసాగించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. నిరంతరంగా శిక్షణ ఇకపై ప్రతి జిల్లాలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తే వాటిని నిరంతరంగా కొనసాగించేలా ప్రభుత్వం ప్రణాళిక తయారు చేస్తోంది. సంక్షేమ శాఖల నుంచి వచ్చే నివేదికల ఆధారంగా వీటి ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నోటిఫికేషన్లు వెలువడటమే తరువాయి వెంటనే ఉద్యోగార్థులతో ఒక బ్యాచ్‌ను ఎంపిక చేసి శిక్షణ మొదలు పెడతారు. బ్యాంకింగ్ నోటిఫికేషన్లు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, యూపీఎస్సీ ఇచ్చే నోటిఫికేషన్లు రెగ్యులర్‌గా ఉండటంతో వీటికి నిరంతరంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ శాఖల వారీగా ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. -
వడివడిగా ‘స్టడీ’...నిరుద్యోగులకు ప్రత్యేక కోచింగ్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువత కొలువుల జాతరలో మునిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న అభ్యర్థులు అకుంఠిత దీక్షతో సంసిద్ధులవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు గ్రూప్–1, పోలీసు ఉద్యోగ ఖాళీలను నోటిఫై చేయడంతో తమకు ఆసక్తి ఉన్న ఉద్యోగాలను దక్కించుకునేందుకు అవసరమైన శిక్షణ కోసం యువత నడుం బిగించింది. ఈ క్రమంలోనే సంక్షేమ శాఖల పరిధిలోని స్టడీ సర్కిళ్లు కూడా యువతకు శిక్షణ ఇస్తున్నాయి. ఆయా స్టడీ సర్కిళ్లు వ్యూహాత్మక శిక్షణ ఇస్తుండటంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఈ సెంటర్ల బాట పడుతున్నారు. దీంతో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో లక్ష మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ అమలు చేయడంలో సంక్షేమ శాఖలు నిమగ్నమయ్యాయి. వంద స్టడీ సెంటర్లు... లక్ష మంది అభ్యర్థులు నాలుగు సంక్షేమ శాఖలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్కో స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేయగా.. బీసీ సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న పది స్టడీ సర్కిళ్లతో పాటు మరో రెండు చోట్ల స్టడీ సర్కిళ్లను అందుబాటులోకి తెచ్చింది. మైనార్టీ సంక్షేమ శాఖ కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో తాత్కాలిక స్టడీ సెంటర్లను తెరిచింది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో ప్రస్తుతం పదివేల మంది అభ్యర్థులతో సంక్షేమ శాఖలు వంద స్టడీ సెంటర్లను నిర్వహిస్తుండగా... అతి త్వరలో మరో రెండు బ్యాచ్‌లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించాయి. దీంతో పాటు ఆన్లైన్ కోచింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. మొత్తం మీద లక్ష మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. నిపుణులతో శిక్షణ తరగతులు: ప్రభుత్వ విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు ఇచ్చే శిక్షణ.. ఏదో నామమాత్రపు, మొక్కుబడి శిక్షణ కాకుండా, నాణ్య తతో కూడిన శిక్షణ అందించాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఆయా అంశా లు, సబ్జెక్టుల్లో నిపుణులైన వారిని నియమించేందుకు సంక్షేమ శాఖలు పోటీ పడ్డాయి. అత్యుత్తమ రేటింగ్ ఉన్న ప్రైవేటు కోచింగ్ సెంటర్లలోని నిపుణులను మంచి ప్యాకేజీలతో ఎంగేజ్ చేసుకున్నాయి. నిపుణుల ఎంపికకు హైదరాబాద్, నగర శివారు జిల్లాల్లో పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ.. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో కాస్త కష్టంగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి కొందరిని ప్రత్యేకంగా ఎంపిక చేసి గ్రామీణ జిల్లాలకు పంపించేందుకు సంక్షేమాధికారులు విశేషంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటో తేదీ నుంచే గ్రూప్–1, పోలీసు ఉద్యోగాలకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు అనూహ్య స్పందన వస్తోంది. తొలివిడతకు ఏకంగా 34 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో వడపోత అనంతరం 10 వేల మందితో ఒక బ్యాచ్‌ను ప్రారంభించారు. మరో రెండు బ్యాచ్‌లను అతి త్వరలో ప్రారంభించేందుకు స్టడీ సర్కిల్ డైరెక్టర్లు కసరత్తు చేస్తున్నారు. త్వరలో గ్రూప్–4 నోటిఫికేషన్ సైతం వెలువడే అవకాశం ఉండడంతో ఆ మేరకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు స్టడీ సెంటర్ల నిర్వహణకు గిరిజన సంక్షేమ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో స్టడీ సెంటర్లను నడిపిస్తోంది. వీటి నిర్వహణ బాధ్యతలను సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్పగించగా.. పర్యవేక్షణ కోసం గిరిజన సంక్షేమ శాఖ కమిషనరేట్ నుంచి ప్రత్యేకాధికారులు నియమితులయ్యారు. శిక్షణ తరగతులను క్రమం తప్పకుండా పర్యవేక్షించడంతో పాటు అంతర్గత పరీక్షల నిర్వహణ, ఫలితాల విశ్లేషణ తదితర అంశాలను సైతం పర్యవేక్షిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి సముజ్వల తెలిపారు. అందుబాటులో వీడియో పాఠాలు బీసీ సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న స్టడీ సెంటర్లలో ప్రత్యక్ష తరగతులకు హాజరు కాలేని అభ్యర్థుల కోసం వీడియో పాఠాలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. నిపుణ చానల్‌తో పాటు టీశాట్ ద్వారా వీడియో పాఠాలను వీక్షించే వెసులుబాటును కల్పించారు. రెండ్రోజుల క్రితం ఈ తరగతులను ప్రారంభించారు. వారంలోగా వీక్షకుల సంఖ్య 50 వేలకు చేరుతుందని భావిస్తున్నామని, గ్రూప్–4 నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మరికొన్ని బ్యాచ్‌లకు శిక్షణ ఇస్తామని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ చెప్పారు. -
జాబ్ నోటిఫికేషన్లు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
సనత్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయనున్న నేపథ్యంలో బేగంపేట బ్రాహ్మణవాడీలోని స్వామి రామానందతీర్థ మెమోరియల్ కమిటీలో పీవీ నరసింహారావు స్మారక గ్రంథాలయంలో ఉద్యోగార్థులు చదువుకునేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించనున్నట్లు ఎమ్మెల్సీ, కమిటీ చైర్పర్సన్ వాణీదేవి తెలిపారు. కమిటీ ప్రాంగణంలోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇక్కడి గ్రంథాలయంలో అవసరమైన సమాచారం, పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రంథాలయంలో చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పించినట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పీవీ స్మారక గ్రంథాలయం తెరిచి ఉంటుందని ఆమె తెలిపారు. సమావేశంలో సురభి సోలార్ ఎనర్జీ కేంద్రం డైరెక్టర్ శేఖర్ మారంరాజు తదితరులు పాల్గొన్నారు. -
స్టడీ సర్కిళ్లలో ప్రత్యక్ష శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష శిక్షణకు స్టడీ సర్కిళ్లు సిద్ధమవుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో మూతబడ్డ విద్యాసంస్థలన్నీ ఇప్పుడు తెరుచుకోవడంతో, స్టడీ సర్కిళ్లను సైతం తెరిచి ప్రత్యక్ష శిక్షణ తరగతులు నిర్వహించాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ క్రమంలో త్వరలో జరగనున్న ఐబీపీఎస్ పరీక్షలతో పాటు ఇతర ఉద్యోగ ప్రకటనలకు తగినట్లు శిక్షణ ఇవ్వనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో హైదరాబాద్‌లో మూడు ప్రధాన స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కూడా సంక్షేమ శాఖల వారీగా ఒక్కో స్టడీ సర్కిల్‌ను నిర్వహిస్తున్నాయి. కోవిడ్‌తో ఈ కేంద్రాలు మూతపడడంతో ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించారు. స్టడీ సర్కిళ్లను వచ్చే నెలలో తెరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగాలకు శిక్షణ... జాతీయ బ్యాంకుల్లో పెద్దఎత్తున ఉద్యో గ ఖాళీల భర్తీకి ఇటీవల ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి నవంబర్ మొదటి వారంలో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. రైల్వేలో ఉద్యోగాలకు సైతం త్వరలో ప్రకటనలు వెలువడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఖాళీలను గుర్తించింది. శిక్షణ కోసం ఆశావహులు సిద్ధమవుతున్నారు. దీంతో స్టడీ సర్కిళ్లను పూర్తిస్థాయిలో తెరిచి ప్రత్యక్ష శిక్షణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీసీ స్టడీ సర్కిల్ పరిధిలో ఎస్సై, కానిస్టేబుల్ రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 11 స్టడీ సర్కిళ్లలో తాజాగా ప్రత్యక్ష శిక్షణను ప్రారంభిస్తోంది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ సైతం పూర్తి చేసింది. కాగా, సివిల్స్‌కు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తుండగా, ప్రత్యక్ష శిక్షణ కోసం అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వచ్చే నెల రెండో వారం లేదా చివరి వారంలో ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
భళా బహుజన స్టడీ సర్కిళ్లు
దళిత, బహుజన, గిరి జన, ఆదీవాసీ, మైనార్టీ వర్గాల్లోని యువత ఉపాధి పొందేందుకు, పోటీపరీ క్షల్లో పాల్గొనేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లను రాష్ట్రప్రభుత్వమే నిర్వహిస్తోంది. వీటి ద్వారా యువతకు ప్రత్యేక శిక్షణనిస్తారు. పేదవర్గాల యువతకు ఇవి ఎంతో సహాయం చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో పోటీపరీక్షల కోసం ప్రయివేటు కోచింగ్ సెంటర్లలో చదువుకోవటం ఖరీదైన వ్యవ హారంగా మారింది. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం పెట్టిన స్డడీసర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ నివ్వటమే గాకుండా, స్టడీ మెటీరియల్, భోజన వసతిని కూడా ఏర్పాటుచేశారు. ఈ స్టడీ సర్కిళ్ల ద్వారా విలేజ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ దగ్గర్నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం నిర్వ హించే అన్నిరకాల పోటీపరీక్షలకు, దేశపాలనా రంగాన్ని నిర్వహించే సివిల్స్ పరీక్షల వరకు శిక్షణ ఇస్తారు. మూడు నుంచి ఆరేడు నెలల వరకు కోచిం గ్నిచ్చి పంపేయటమే గాకుండా ఆయా వెనుకబ డిన సామాజిక వర్గాలు, అట్టడుగు బహుజన దళిత గిరి జన ఆదీవాసీ మైనార్టీవర్గాలు, పేదలకు ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు చేయాలో నన్న చింతనను కూడా ఈ స్టడీ సర్కిల్స్ నేర్పుతు న్నాయి. రాష్ట్ర అవతరణ తర్వాత వేలాదిమంది తెలంగాణ యువత ఇందులో శిక్షణ పొందారు. ఉద్యోగాలను చేజిక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు హైద రాబాద్‌లో తప్ప ఇతరచోట్ల స్టడీసర్కిళ్లు ఉండేవికావు. ఇపుడు ప్రతి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఎస్టీలకు 1, ఎస్సీలకు 4, బీసీలకు 9 స్టడీ సర్కిళ్లు ఉండేవి. వీటి నిర్వహణకు 22 కోట్లు ఖర్చుచేశారు. పాతవాటితో కలుపుకొని రాష్ట్రంలో ఎస్సీలకు 10, ఎస్టీలకు 5, బీసీలకు 10, మైనార్టీలకు 1 స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు నాలుగేండ్లలో రూ. 253.91 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. స్టడీసర్కిల్స్ విస్తృతి ఇంకా పెరగాలి. ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలోపెట్టుకుని యువతను సన్నద్ధం చేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల శాఖల్లోని నియామకాలను చేపట్టినప్పటికీ ప్రైవేట్ రంగంలోనే అత్యధికంగా ఉద్యోగావకా శాలు ఉన్నాయన్నది నిజం. ప్రైవేట్‌రంగంలో ఉద్యో గాలు పొందటానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పేద విద్యార్థులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. హైద రాబాద్లోని అమీర్‌పేటలో పలు ఉద్యోగాలకు శిక్షణనిచ్చే కేంద్రాలు ప్రయివేట్ రంగంలో అనేకం వెలిశాయి. పేదరికంలో ఉన్న యువత ఇందులో శిక్షణ పొందటానికి ఆర్థిక భారం ఉంటుంది. గ్రామీణ, పట్టణాలనుంచి వచ్చే పేదయువతకు ప్రైవేట్‌రంగంలో ఉద్యోగాలు పొందటానికి కూడా శిక్షణనిచ్చే కేంద్రాలుగా ప్రభుత్వ స్టడీసర్కిళ్లు తయారుకావాలి. తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారింది. భవిష్యత్తులో వ్యవసాయ ఉత్పత్తులను పెంచేం దుకు, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు పెద్ద ఎత్తున నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ యాక్షన్ ప్లాన్‌ను తయారుచేస్తున్నారు. తెలంగా ణను సంప దపెంచే కేంద్రంగా మార్చాలన్న కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా ఉత్పత్తి రంగాల వైపునకు యువసైన్యం నడిచేందుకు కావాల్సిన శిక్షణ, ఆలోచనలను పెంపొందించే దిశగా స్టడీ సర్కిళ్లు తయారుకావాలి. భవిష్యత్తులో 33 జిల్లాల్లో 33 స్టడీసర్కిళ్లను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టు కుని స్థానికంగా అందుబాటులోవున్న లెక్చరర్లు, టీచర్లు, కొత్తగా రిక్రూట్ అయిన పలుశాఖల అధికారులను ఉప యోగించుకుని స్వచ్ఛందంగా స్టడీ సర్కిల్స్‌ను నిర్వహించే బాధ్యతను సంబంధిత శాఖల ఉన్న తాధికారులు తమ భుజస్కందాలపై వేసుకోవలసి ఉంది. కొత్తగా ఏర్పడ్డ ప్రతిజిల్లాలో శాశ్వత భవ నాలు వచ్చేంత వరకు ఖాళీగావున్న ప్రభుత్వ కార్యాలయాలు, డిగ్రీ, పీజీ కాలేజీలు, ప్రాంతీయ విశ్వవిద్యాలయాల భవనాల్లో వారికి ఆటంకం కలు గకుండా సమయాన్ని సర్దుబాటు చేసుకుని స్టడీ సర్కిల్స్‌ను తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టవలసి ఉంది. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో రామానంద తీర్థ గ్రామీణ విద్యా సంస్థ 100 ఎక రాల విస్తీర్ణంలో ఉంది. ఆ పచ్చటి ప్రకృతి వొడిలో యువతకు ఉద్యోగ శిక్షణనిచ్చే అతిపెద్ద కేంద్రా లను నెలకొల్పవచ్చును. కేసీఆర్ లక్ష్యమార్గంలో సాధించే ప్రతి విజయం ఈ నేలమీద 85 శాతంగా వున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆదివాసీ వర్గాలకు మేలు చేస్తుంది. ఈ యువత స్థిరంగా నిలబడ గలిగితే తెలంగాణ సమాజమే స్థిరంగా నిలబడగ లుగుతుంది. వ్యాసకర్త కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ -
భాషలు వేరైనా కవిత్వం ఒక్కటే
మన దేశం అనేక వైవిధ్యాలకు మూలం. సంస్కృతి, సంప్రదాయాలు, వేష, భాషల్లో ఎక్కడికక్కడే ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకుంటోంది. ఇంత వైవిధ్యాన్నీ దోసిట పట్టి అద్దంలో చూపించేది సాహిత్యం. వివిధ భాషల్లో వచ్చిన సాహిత్యాన్ని చదివితే ఆయా ప్రత్యేకతలన్నిటినీ కొంతవరకైనా అర్థం చేసుకోవచ్చు. అయితే, తెలుగు పాఠకులకు ఇతర భాషల్లోని కవిత్వం దగ్గర కాలేదు. వచన రచనలకంటే, కవిత్వాన్ని అనువదించడం క్లిష్టమని భావించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఆ లోటును మామూలుగా కాదు, భారీ ఎత్తున పూడుస్తూ ప్రముఖ కవి ముకుంద రామారావు ‘అదే నేల’ పేరిట భారతీయ కవిత్వం–నేపథ్యంను 867 పేజీలతో వెలువరించారు. భారత రాజ్యాంగం 22 భాషలకు గుర్తింపునిస్తే.. ఈ సంకలనంలో 32 భాషల నుంచి కవితలను సేకరించి, అనువదించి.. మన ముందుంచారు. ఆయా భాషల్లో కవిత్వం ప్రారంభమైన తీరు దగ్గర నుంచి ఆధునికతను సంతరించుకునే వరకూ తిరిగిన అన్ని కీలకమైన మలుపులనూ అందిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. శైలీ, శిల్పాల్లో వచ్చిన మార్పులను ప్రతిఫలించే కవితలకు ప్రాధాన్యతనిచ్చారు. ఆయా భాషల్లోని ప్రముఖ కవులతోపాటు జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నవారందరినీ పొందుపరిచారు. కవుల పరిచయంతోపాటు, ఆయా భాషా సాహిత్య చరిత్రలను సైతం పరిచయం చేశారు. కవయిత్రులపైనా, తిరుగుబాటు స్వరాలపైనా ప్రత్యే కంగా దృష్టిసారించారు. ‘ఒకమారు నువ్వు అన్నావు ఈవిధంగా అయితే /ఆకాశమే నీ హద్దు అని/నేడు ఆకాశం నా చేతిలో ఉంది/కానీ నువ్వు లేవు ఆ ఘనమైన సంఘటనను చూడటానికి’ (జయంతి నాయక్–కొంకణి), ‘నా కళ్లలో/ఒక పురాతన నది ఉంది/నేను కూడా దానిని చూడలేదు/అయినా అది అక్కడ ప్రవహిస్తోంది’ (సురేష్ దలాల్–గుజరాతీ) వంటి పంక్తులు కవులను పెనవేసుకునే ప్రకృతికి నిద ర్శనంగా నిలుస్తాయి. భాషలు వేరైనా ప్రజలు–వారిని ప్రతిబింబించే కవిత్వ ఆకాంక్ష ఒక్కటేనని ఈ సంకలనం చూస్తే అర్థమవుతుంది. – దేశరాజు (రేపు సాయంత్రం హైదరాబాద్ స్టడీ సర్కిల్లో ‘అదే నేల’ పరిచయ సభ) -
ప్రతి జిల్లాకు ఓ స్టడీ సర్కిల్!
సాక్షి, హైదరాబాద్: ప్రతి జిల్లాలో ఓ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలో ఈ కేంద్రాలున్నాయి. కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు కావడంతో అన్ని జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈమేరకు కార్యాచరణ రూపొందించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసే అవకాశముందనే అంశంపై కసరత్తు చేపట్టింది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ప్రధాన స్టడీ సర్కిళ్లను హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది. దీంతోపాటు నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్, గ్రూప్ సర్వీసులు తదితర ప్రధాన శిక్షణ కార్యక్రమాలకు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇస్తుండగా.. మిగతా చోట్ల ఇతర కేటగిరీల్లోని ఉద్యోగాలకు శిక్షణ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు రకాల శిక్షణలు ఇవ్వగా.. దాదాపు 2వేల మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో దాదాపు 15% మందికి కొలువులు వచ్చాయి. స్టడీ సర్కిల్ శిక్షణలతో సత్ఫలితాలు వస్తుండటంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు డిమాండ్ పెరిగింది. ఈనేపథ్యంలో స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, ఆవశ్యకతను పరిశీలించాలని ఈశ్వర్ ఆదేశించడంతో ఆ శాఖ చర్యలకు ఉపక్రమించింది. స్టడీ సర్కిళ్ల ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఎస్సీ అభివృద్ధి శాఖ..వీటిని మరింత విస్తృతం చేయాలని నిర్ణయిం చింది. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన శిక్షణే కాకుండా ప్రైవేటు రంగంలో కీలక ఉద్యోగాలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టే అంశంతో పాటు డిమాండ్ ఉన్న ఉద్యోగాలకు ఎలా శిక్షణ ఇవ్వొచ్చనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. -
ఫలితమివ్వని ‘స్టడీ’
సాక్షి, ఆదిలాబాద్: పైకి పటారం.. లోన లొటారం అన్నట్టుంది స్టడీ సర్కిళ్ల వ్యవహారం. వీటికి లక్షలు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం అంతంతే ఉంటోంది. ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు ఈ స్టడీ సర్కిళ్ల – పనితీరుకు అద్దం పడుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఇందుకోసం ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో నిరుద్యోగులకు వీటి ద్వారా శిక్షణ ఇచ్చారు. కాని ఫలితాలను చూసి విస్తు పోవాల్సి వచ్చింది. వందలాది మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తే.. 19 శాతం మాత్రమే ఖాకీ కొలువులు సాధించారంటే వీటి పనితీరు ఎలా అర్థమవుతోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు రాగానే హంగామ సృష్టించే స్టడీ సర్కిళ్లు, శిక్షణ కేంద్రాలు ఫలితాల్లో డాబు చూపలేకపోతున్నాయి. వైఫల్యం ఎక్కడ ఉందో మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే నిరుద్యోగ యువత నష్టపోవాల్సి వస్తోంది. లక్షల రూపాయల ఖర్చు స్టడీ సర్కిళ్లకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చిస్తోంది. 2017–18 సంవత్సరంలో బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం కోసం రూ.3.75 కోట్లు విడుదలయ్యాయి. బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఈ నిధులు ఖర్చుచేశారు. అయితే ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా బీసీ నిరుద్యోగులకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. మరి లోపం ఎక్కడ జరుగుతుందా? అనేది అవగతం కాని ప్రశ్న. నిరుద్యోగ అభ్యర్థుల పరంగా మెరిట్ ఆధారంగానే ఎంపిక జరుగుతుందా.. శిక్షణ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఫ్యాకల్టీ నియామకంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తున్నారు. అసలు విషయ నిపుణులైన వారిని నియమిస్తున్నారా.. లేదంటే ఇందులో ఏమైన లోపాయికారికంగా వ్యవహారాలు సాగుతున్నాయా? అనే అనుమానాలు లేకపోలేదు. ఎస్సీ స్టడీ సర్కిల్ అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ సర్కిల్లోనూ ఫలితాలు తక్కువగా రావడం వెనక ఎలాంటి కారణాలు ఉన్నాయనే విశ్లేషణ సంక్షేమ శాఖ చేపడుతుందా.. లేదా అన్నది ప్రశ్నార్థకం. జిల్లా అధికారులు వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేదంటే మున్ముందు ఎలాంటి నోటిఫికేషన్లు పడ్డా నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోవాల్సిందే. ఇక ఎస్సీ, బీసీ అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో శిక్షణ ఇవ్వగా, గిరిజన అభ్యర్థులకు పోలీసు శాఖ పరంగా ఐటీడీఏ నుంచి పోలీసు శిక్షణ కేంద్రం (డీటీసీ)లో ట్రైనింగ్ ఇచ్చారు. అయితే ఇందులోనూ జిల్లా పరంగా ఫలితాలు నామమాత్రంగానే వచ్చినట్లు సమాచారం. శిక్షణ అవతారం.. జిల్లా యువజన, క్రీడల శాఖ తీరు మరోరకం. ఈ శాఖ అసలు లక్ష్యం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కోసం బ్యాంక్ లింకేజీతో ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించేందుకు దోహదపడాలి. తద్వారా యువత స్వయం ఉపాధి పొందగలుగుతారు. అదేవిధంగా యువజన సంఘాలను ఏర్పాటు చేసి వివిధ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. అంతేకాకుండా క్రీడలకు సంబంధించి వ్యవహారాలను పర్యవేక్షించాలి. వీటన్నింటిని కాదని కొత్త బాధ్యతలను నెత్తిన వేసుకుంది. అలా అని ఉన్నవాటిని సమర్థవంతంగా మోస్తుందనుకుంటే పొరపాటే. అసలు లక్ష్యాలు సాధించలేకపోగా, లేని లక్ష్యం కోసం వెంపర్లాడుతున్నట్టు కనబడుతోంది ఈ శాఖ తీరు. అవగాహన లేనిదాంట్లో వేలు పెట్టి సాధించిది ఏమీ లేదు. లక్షల రూపాయలు మాత్రం వృథా చేస్తోంది. స్టడీ సర్కిళ్ల కంటే ఇందులోనే నిరుద్యోగ అభ్యర్థుల కోసం అధికంగా వెచ్చించడం గమనార్హం. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ యువజన, క్రీడల శాఖ ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను తీసుకోలేదని స్వయంగా ఆ శాఖాధికారులే చెబుతున్నారు. అలాంటప్పుడు వీటిని భుజాన వేసుకోవడంలో ఏదో ఆంతర్యం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ పేరిట భోజన, స్టడీ మెటీరియల్, ఫ్యాకల్టీ నియామకాల పరంగా ఓ అధికారి కమీషన్ వ్యవహారంతోనే దీంట్లో ఆసక్తి కనబర్చుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. పోటీ ఏది? ఉద్యోగ నియామకాలు అంటేనే పోటీ పరీక్ష.. ఒక్క పోస్టు కోసం వందలాది మంది ప్రయత్నం చేస్తారు. అలాంటి దాంట్లో ప్రతిభ చూపేందుకు పలువురు శిక్షణ సంస్థలకు వెళ్తారు. అయితే శిక్షణ సంస్థల్లో వ్యవహారాలు ఈ విధంగా ఉంటే నిరుద్యోగుల ఆశలు మాత్రం అడియాసలవుతున్నాయి. ప్రభుత్వ కొలువులకు సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే చాలూ స్టడీ సర్కిళ్లు, ఇతర శిక్షణ సంస్థలు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను కాజేసేందుకే వ్యవహారాలు సాగిస్తున్నారే తప్పించి నిరుద్యోగులకు మేలు చేయాలన్న తపన ఎక్కడా కనిపించడం లేదు. మండలాలు, దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి శిక్షణ పొందే నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వమే వసతి కల్పిస్తుంది. ఇక భోజన సదుపాయం, స్టడీ మెటీరియల్ కొనుగోలు, ఫ్యాకల్టీ నియామకం, స్నాక్స్, టీ, తదితర ఖర్చులకు సంబంధించి బిల్లులు పెట్టి ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్నారు. దీంట్లో కమీషన్ కోసమే తాపత్రాయపడే అధికారులు అసలు లక్ష్యాన్ని నీరుగార్చుతున్నారు. మరోపక్క శిక్షణ పొందిన అభ్యర్థుల సంఖ్యను హెచ్చుగా చూపడం ద్వారా కూడా తమ స్వార్థ ప్రయోజనాలతో కొంతమంది అధికారులు తమ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. -
ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా ఉన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా ఉన్న హన్మంతునాయక్ రిలీవ్ కావడంతో ఆ బాధ్యతల్ని ప్రవీణ్‌కుమార్‌కు అప్పగిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి బుద్ధప్రకాశ్ జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏడేళ్లుగా మూతపడిన ‘స్కియాడ్’
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు స్థానికంగా లభించని శిక్షణ - అప్పులు చేసి వేలాది రూపాయలు వెచ్చిస్తున్న వైనం ఎస్కేయూ: అనంతపురంలోని బీసీ స్టడీ సర్కిల్ పక్కనే ఏర్పాటు చేసిన స్కియాడ్ (శ్రీకృష్ణదేవరాయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అకడమిక్ డెవలప్మెంట్ సెంటర్) ఏడేళ్లుగా మూతపడే ఉంది. గ్రూప్ - 1, 2 డీఎస్సీ, బ్యాంక్ ఉద్యోగాలు లాంటి పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ తీసుకోవాలంటే వేలాది రూపాయలు చెల్లించాల్సి వస్తుండటంతో కరువు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లకు ఉపశమనం కలిగించే ఉద్దేశ్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ, వృత్త్యంతర శిక్షణతోపాటు వసతి కల్పించడం, మెటీరియల్ అందించడం తదితర సదుపాయాలను ఈ సెంటర్ ద్వారా కల్పిస్తూ వచ్చారు. దీని నిర్వహణకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ వచ్చింది. పర్యవేక్షణ బాధ్యతలను మాత్రం ఎస్కేయూకు అప్పగించి వర్సిటీ ప్రొఫెసర్‌ను స్కియాడ్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. మొదట్లో ఇది మంచి సేవలు అందించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఏడేళ్ల నుంచి దీనిని మూసేశారు. ఫలితంగా పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వేలాది రూపాయలు అప్పులు చేసి హైదరాబాద్, విశాఖపట్టణం నగరాలకు వెళ్లి శిక్షణ తీసుకోవాల్సి వస్తోంది. స్కియాడ్ కో-ఆర్డినేటర్లు, ఎస్కేయూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వడంలో విఫలం కావడం వల్లే నిధులు మంజూరు కాలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కమిటీ నివేదికతోనైనా మోక్షం వచ్చేనా? స్కియాడ్ స్థితిగతులపై నివేదిక సమర్పించేందుకు ఎస్కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎం.బాబు అధ్యక్షతన ఈ ఏడాది ఓ కమిటీని నియమించారు. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవీ లక్ష్మయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. నిధుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, భవనాలు ఆధునికీకరించాలని, సిబ్బందిని నియమించాలని పలు సిఫార్సులు, సూచనలు చేస్తూ కమిటీ నివేదిక తయారు చేసింది. రెండు వారాల కిందట దానిని వర్సిటీ ఉన్నతాధికారులకు అందించింది. -
రెండు కోట్లతో సిద్దిపేటలో స్టడీ సర్కిల్ ఏర్పాటు
అన్నగా చెబుతున్నా.. ఇష్టపడి చదవండి ఉద్యోగం సాధించండి రూ. కోట్లతో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశా.. సద్వినియోగం చేసుకున్నప్పుడే సార్థకత స్టడీ సర్కిల్ కేంద్రంలో మంత్రి హరీశ్ సిద్దిపేట జోన్:‘ఉచితం అనగానే విలువ ఉండదు. అది మానవ సహజ గుణం. రెండు కోట్లతో సిద్దిపేట ప్రాంతంలో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేశా. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నప్పుడే నా ప్రయత్నానికి సార్థకత. శిక్షణ ద్వారా ఉద్యోగాలు పొందితే నాకు సంతృప్తి మిగులుతుంది. విద్యార్థుల్లో సీరియస్‌నెస్ ఉండాల్సిందే. నిర్లక్ష్యం వహిస్తే భావితరాల్లోని మీ తమ్ముళ్లకు , చెల్లెళ్లకు ఇబ్బంది కావొద్దు. అన్నగా చెబుతున్న ఎంపికైన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా క్లాస్‌లకు హాజరుకావాల్సిందే..’ అంటూ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం విద్యార్థులకు హితబోధ చేశారు. సిద్దిపేటలో పర్యటిస్తున్న క్రమంలో మంత్రి ఆకస్మికంగా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సమయంలో అక్కడ ఉన్న కోఆర్డీనేటర్ శ్రీనివాస్‌తో మంత్రి హరీష్‌రావు శిక్షణ ప్రక్రియపై ఆరా తీశారు. సిద్దిపేట సెంటర్‌కు వంద సీట్లు మంజూరుకాగా 83 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్టు కోఆర్డినేటర్ మంత్రికి వివరించారు. స్పందించిన ఆయన తనీఖీ సమయంలో కేవలం 33 మంది మాత్రం ఉండడం సరైంది కాదన్నారు. కాగా వంద సీట్లను భర్తీ చేయాల్సిందేనని మిగిలిన 15 సీట్లను ఎస్సీ, ఎస్టీ, ఓసీ, విద్యార్ధులచే వెంటనే భర్తీ చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు. స్టడీ సర్కిల్లో చేరి మూడు రోజుల పాటు వరుసగా శిక్షణ తరగతులకు హాజరుకాని విద్యార్థుల తల్లిదండ్రులతో సెంటర్ నిర్వహకులు వెంటనే మాట్లాడి హాజరుశాతాన్ని పెంచాలన్నారు. మంత్రి వెంట ఓఎస్డీ బాల్‌రాజు, టీఆర్ఎస్ నాయకులు శర్మ, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, శేషుకుమార్ తదితరులు ఉన్నారు. -
మైనారిటీల కోసం స్టడీ సర్కిల్: మంత్రి పల్లె
హైదరాబాద్: మైనారిటీ విద్యార్థుల కోసం అనంతపురంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ భూములను పరిరక్షించేందుకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తారని తెలిపారు. చర్చిలు, మసీదుల స్థలాలకు జీపీఎస్ అనుసంధానం చేసి వాటి ఆస్తులను పరిరక్షిస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఐక్యంగా ఆశయాలు సాధించుకుందాం
ఒంగోలు: కాపులంతా ఐక్యంగా ఉండి...ఆశయాలను సాధించుకుందామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. స్థానిక బచ్చలబాలయ్య క ల్యాణ మండపంలో ఆదివారం అఖిల భారత కాపు సమాఖ్య ఏర్పాటు చేసిన కాపు ప్రజాప్రతినిధుల సన్మాన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల వారసులైన కాపు సంఘాలన్నీ ఐక్యంగా ఒకే గొడుగు కిందకు రావాలని, అందుకు తాను కూడా కృషిచేస్తానని పిలుపునిచ్చారు. ఆర్థికంగా, సామాజికంగా కాపులు ఎదిగేందుకు చంద్రబాబు ఏటా వెయ్యి కోట్లు చొప్పున ప్రకటించారని, కాపులను బీసీల్లో చేర్చాలనే ఉద్దేశంతోనే బీసీ కమిషన్ వేశారన్నారు. కమిషన్ ప్రక్రియ ప్రారంభించిన 6 నెలల్లో రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుందని, అది రాగానే ప్రస్తుతం ఉన్న బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను కూడా బీసీల్లో చేరుస్తారని ప్రకటించారు. కాపు పేద విద్యార్థులు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అవసరమైన స్టడీ సర్కిల్ ప్రకాశం జిల్లాలోనే ప్రారంభించడానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాపులందరినీ ఐక్యం చేసేందుకు అన్ని ప్రాంతాల్లో తాను పర్యటిస్తానన్నారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ఏడాదిలో పూర్తిచేస్తారన్నారు. రాష్ట్ర రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావు, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ తమ గెలుపునకు కాపులే కారణమని ప్రకటించారు. పశ్చిమగోదావరికి చెందిన కాపు నాయకుడు రామాంజనేయులు మాట్లాడుతూ తనకు పవర్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని చంద్రబాబు నిత్యం ప్రకటిస్తున్నాడంటే కాపుల శక్తి ఏమిటో స్వయంగా అర్థమవుతుందన్నారు. సభాధ్యక్షుడు గొర్రెపాటి అర్జునరావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చడంతోపాటు కాపులకు విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబుకు వినతిపత్రం అందజేశామన్నారు. అఖిల భారత కాపు సమాఖ్య మహిళా చైర్పర్సన్ చదలవాడ సుచరిత మాట్లాడుతూ కాపులు పల్లకీలు మోసేవారు కాదు...పల్లకీలో ఉండేవారు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని, వచ్చే సాధారణ ఎన్నికల్లో సీఎంగా కాపు సామాజికవర్గం వారే ఉండేలా చూడాలన్నారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం డిప్యూటీ సీఎం పదవి కూడా సీఎం పదవికి చాలా దగ్గరగానే ఉందంటూ పేర్కొన్నారు. మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రతిసారీ మ్యానిఫెస్టోలో కాపులను బీసీల్లో చేరుస్తామని ప్రకటించడం...అనంతరం విస్మరించడం పరిపాటే అన్నారు. అనంతరం బాలిశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎంను ఘనంగా సన్మానించారు. సమావేశంలో కర్నాటక బలిజ సంఘం ప్రతినిధి హరి, మార్కాపురం నాయకుడు తాటిశెట్టి రామమోహన్, ఒంగోలు కాపు నాయకులు గాదె కృష్ణారావు, గొర్రెపాటి శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమానికి ముందుగా శ్రీకృష్ణదేవరాయులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం అఖిల భారత కాపు సమాఖ్య లోగో ను ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి శిద్దా రాఘవరావు ఆవిష్కరించారు. -
చంద్రుడిపై ఉరుము శబ్దం వినగలమా?
సీహెచ్ మోహన్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్. ఫిజిక్స్ - ధ్వని ధ్వని ఒక శక్తి స్వరూపం. ఇది కంపిస్తున్న కణాల్లో జనించి, తరంగాల రూపంలో అన్ని దిశల్లో ప్రయాణిస్తుంది. ఈ ధ్వని తరంగాలు చెవిలోని కర్ణభేరిని కనీసం 1/10 వ సెకన్ కాలంపాటు తాకినట్లయితే మనకు వినికిడి జ్ఞానం కలుగుతుంది. కంపించడానికి అనువుగా ఉన్న కణాలతో కూడిన పదార్థాల్లోనే ధ్వని జనిస్తుంది, ఒక బిందువు నుంచి మరో బిందువుకు ప్రయాణిస్తుంది. ఉదా: అల్యూమినియం, ఇనుము, రాగి, ఉక్కు, ఇత్తడి, కంచు.కంపించడానికి వీలులేని కణాలున్న పదార్థాల్లో ధ్వని జనించదు, ప్రయాణించలేదు. ఉదా: శుద్ధమైన ప్లాస్టిక్, రబ్బర్, వరిపొట్టు, రంపపు పొట్టు, దుస్తులు, కాటన్, థర్మాకోల్. ఇలాంటి పదార్థాలను ’ౌఠఛీ ్కటౌౌజ’ భవనాల నిర్మాణంలో ఉపయోగిస్తారు. యానకం: కణాలను కలిగి ఉన్న ఏ పదార్థాన్నైనా ‘యానకం’ అంటారు. ఇది ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటుంది. శూన్యం: ఎలాంటి యానకం లేని ప్రదేశాన్ని ‘శూన్యం’ అంటారు. భూ వాతా వరణానికి వెలుపల ఉన్న ప్రదేశాన్ని ‘విశ్వాంతరాళం’ అంటారు. ఇక్కడ ఎలాంటి యానకం ఉండదు. ద్వని తరంగాలు ఒక బిందువు నుంచి మరో బిందువుకు ప్రయాణించడానికి యానకం అవసరం. కాబట్టి ఎలాంటి యానకం లేని ప్రదేశంలో ధ్వని వేగం శూన్యం. దీన్ని రాబర్ట బాయిల్ (రసాయన శాస్త్ర పితామహుడు) ప్రయోగాత్మకంగా నిరూపించాడు. చంద్రునిపై ఎలాంటి వాతావరణం లేనందువల్ల అక్కడ ధ్వని వేగం శూన్యం. చంద్రునిపై తుపాకీ పేల్చినా, అణు బాంబును విస్ఫోటనం చెందించినా వెలువడే ధ్వనులను వినలేము. చంద్రునిపై వాతావరణం లేనప్పటికీ మేఘాలు ఉన్నాయని భావిస్తే.. అవి పరస్పరం ఢీకొన్నప్పుడు మెరుపును (కాంతి) మాత్రమే చూడగలం. కానీ ఉరుము ధ్వని వినలేం. చంద్రుడి శాస్త్రీయనామం. అందువల్ల చంద్రుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘Selenology" అంటారు 1969 జూలై 20న అపోలో-11 అనే అంతరిక్షనౌక సాయంతో అమెరికా వ్యోమగాములు నీల్ ఆర్మస్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్రిన్ చంద్రుడిపై కాలుమోపారు. చంద్రుడిపై ఈ వ్యోమగాములు దిగిన ప్రాంతానికి ‘శాంతి సముద్రం’ అని పేరు పెట్టారు. శ్రవ్య అవధి: ఆరోగ్యవంతుడైన మానవుడు 20ఏ్డ20,000ఏ్డ అవధిలోని ధ్వని తరంగాలను మాత్రమే వినగలుగుతాడు. ఈ అవధిని ‘శ్రవ్య అవధి’ అని, ఈ తరంగాలను ‘శ్రవ్య తరంగాలు’ అని అంటారు. పరశ్రావ్యాలు: శ్రవ్య అవధిలో 20ఏ్డ కంటే ముందున్న తరంగాలను ‘పరశ్రావ్యాలు’ అంటారు. వీటిని పాము, తిమింగలాలు వినగలుగుతాయి. పరశ్రావ్యాలను ఉత్పత్తి చేయడానికి అధిక శక్తి ఉన్న వస్తువులు అవసరం. పరశ్రావ్యాలు కొన్ని సందర్భాల్లోనే ఉత్పత్తి అవుతాయి. వాటిలో ముఖ్యమైనవి. 1. భూమి కంపించినప్పుడు 2. అణుబాంబు విస్ఫోటనం చెందినప్పుడు 3. అధిక తీవ్రతతో ఉరిమినప్పుడు 4. భారీ వాహనం అధిక బరువును మోసుకు వెళుతున్నప్పుడు అతిధ్వనులు: శ్రవ్య అవధిలో 20ఏ్డ తర్వాత ఉన్న తరంగాలను ‘అతిధ్వనులు’అం టారు. వీటిని 50,000ఏ్డ వరకు కుక్క; 1,00,000ఏ్డ వరకు గబ్బిలం, తాబేలు, డాల్ఫిన్లు వినగలుగుతాయి. గబ్బిలం అతి ధ్వనులను ఉత్పత్తి చేయడం ద్వారా రాత్రుల్లో సంచరిస్తుంది. ప్రయోగశాలల్లో అతిధ్వనులను ‘ఫిజో’ విద్యుత్ ఫలితం పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు. అతిధ్వనుల ఉపయోగాలు - పాలు, నీటిలోని హానికర బ్యాక్టీరియాను నిర్మూలించడానికి ఉపయోగిస్తారు. - సముద్రాల లోతు తెలుసుకోవడానికి ఉపయోగించే ‘ైూఅఖ‘ (ౌఠఛీ ూ్చఠిజీజ్చ్టజీౌ ్చఛీ ఖ్చజజీజ) పరికరంలో ఉపయోగిస్తారు. ‘సోనార్’ను ‘ూజీౌ్ఠ‘ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. - తీగలను అతికించే పద్ధతిని ‘ౌఛ్ఛీటజీజ‘ అంటారు. ఈ విధానంలో అతిధ్వనులను ఉపయోగిస్తారు. ౌఛ్ఛీటజీజ పదార్థంలో లెడ్ (సీసం), టిన్ మూలకాలుంటాయి. - శరీర అంతర్భాగాలను స్కానింగ్ చేయడానికి అతిధ్వనులు ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని ‘ఆల్ట్రా సోనోగ్రఫీ’ అంటారు. - దోమలను పారద్రోలడం - చేపలను ఆకర్షించడం - విరిగిన దంతాలను సులభంగా తొలగించడం, కీళ్ల నొప్పులను నివారించడానికి - లోహ పలకలు, పైపులు, బాయిలర్లలోని రంధ్రాల స్థానాన్ని గుర్తించడానికి అతి ధ్వనులను ఉపయోగిస్తారు. వద్ద ఉన్న నీటి ఉపరితలం ఎలాంటి కదలికలు లేకుండా నిశ్చలస్థితిలో ఉంటుంది. ఈ నీటిలోకి అతిధ్వనులను పంపించినప్పుడు 100నిఇ వద్ద మరుగుతున్న స్థితిని పొందుతుంది. తరంగం: తరంగం అంటే శక్తిని ఒక బిందువు నుంచి మరో బిందువుకు మోసుకు వెళ్లేది అని అర్థం. కంపన పరిమితి: కంపిస్తున్న కణం తన మధ్యబిందువు నుంచి పొందిన గరిష్ఠ స్థాన భ్రంశాన్ని ‘కంపన పరిమితి’ అంటారు. దీన్ని మిల్లీమీటర్లు/ సెంటీమీటర్లు/ మీటర్లలో తెలియజేస్తారు. తరంగ దైర్ఘ్యం: ఒక అనుైదైర్ఘ్య తరంగంలో ఒకే దశలో ఉన్న ఏవైనా రెండు వరుస సంపీడ్యనాలు లేదా విరళీకరణాల మధ్య దూరాన్ని ‘తరంగదైర్ఘ్యం’ అంటారు. ప్రమాణాలు: మిల్లీమీటర్లు, సెంటీమీటర్లు, మీటర్లు. తరంగదైర్ఘ్యాన్ని కొలవడానికి ఉపయోగించే అతిచిన్న ప్రమాణం ఆంగ్ స్ట్రామ్. 1 అని = 1010 ఝ. ఆవర్తనకాలం: కంపిస్తున్న కణం ఒక కంపనాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని ‘ఆవర్తనకాలం’ అంటారు. ప్రమాణాలు: సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు. పౌనఃపున్యం: కంపిస్తున్న కణం ఒక సెకన్ కాలంలో చేసే కంపనాల సంఖ్యను ‘పౌనఃపున్యం’ అంటారు. ప్రమాణాలు: 1. (ప్రస్తుతం ఈ ప్రమాణం వాడుకలో లేదు) 2. - ఇది అంతర్జాతీయ ప్రమాణం. తరంగాల రకాలు: స్వభావం రీత్యా తరంగాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 1. యాంత్రిక తరంగాలు: ఈ తరంగాలు ప్రయాణించడానికి యానకం అవసరం. ఎలాంటి యానకం లేని ప్రదేశంలో ఈ తరంగాలు ప్రయాణించలేవు. ఉదా: ధ్వని తరంగాలు 2. విద్యుత్ అయస్కాంత తరంగాలు: ఈ తరంగాలు ప్రయాణించడానికి యానకం అవసరం లేదు. ఇవి ఏదైనా యానకంలోనూ, శూన్యంలోనూ ప్రయాణించగలుగుతాయి. ఉదా: కాంతి తరంగాలు, పరారుణ కిరణాలు, అతినీలలోహిత కిరణాలు, లేజర్ కిరణాలు, రేడియో తరంగాలు, మైక్రో తరంగాలు, ఎక్స్-కిరణాలు. ఈ తరంగాల వేగం గాలిలో, శూన్యంలో కాంతి వేగానికి (ఇ= 3ణ108 ఝ/ట) సమానంగా ఉంటుంది. {పయాణించే విధానం ఆధారంగా తరంగాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 1. అనుదైర్ఘ్య తరంగాలు: ఈ తరంగాలు ఎల్లప్పుడూ సంపీడ్యనాలు, విరళీకరణాల రూపంలో ప్రయాణిస్తాయి. అనుదైర్ఘ్య తరంగం ప్రయాణించేటప్పుడు కంపిస్తున్న వాయు కిరణాల సాంద్రత గరిష్ఠంగా ఉన్న బిందువును సంపీడ్యం అని, కనిష్ఠంగా ఉన్న బిందువును విరళీకరణం అని అంటారు. ఉదా: గాలిలో ధ్వని తరంగాలు ఎల్లప్పుడూ అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. 2. తిర్యక్ తరంగాలు: ఈ తరంగాలు ఎల్లప్పుడూ శృంగాలు, ద్రోణుల రూపంలో ప్రయాణిస్తాయి. తిర్యక్ తరంగం ప్రయాణించేటప్పుడు శక్తి గరిష్ఠంగా ఉన్న బిందువును ‘శృంగం’ అని, కనిష్ఠంగా ఉన్న బిందువును ‘ద్రోణి’ అని అంటారు. ఉదా: 1) ఘన, ద్రవ పదార్థాల్లో ధ్వని ఎల్లప్పుడూ తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. 2) కాంతి అన్ని పారదర్శక పదార్థాల (వజ్రం, గాజు, నీరు, గాలి) ద్వారా తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. ద్వని తరంగాలు, కాంతి తరంగాలు ఒక యానకం నుంచి మరో యానకంలోకి ప్రయాణించేటప్పుడు వాటి కంపన పరిమితి, తరంగ దైర్ఘ్యం, వేగం, తీవ్రత మారుతాయి. కానీ పౌనఃపున్యం స్థిరంగా ఉంటుంది. పురోగామి తరంగం: ఒక తరంగం జనించిన బిందువు నుంచి అనంత దూరాన్ని ప్రయాణిస్తే, దాన్ని పురోగామి తరంగం అంటారు. వీటి కంపన పరిమితి అన్ని బిందువుల వద్ద సమానంగా ఉంటుంది. అవరుద్ధ తరంగాలు: ఈ తరంగాల కంపన పరిమితి కాలంతోపాటు క్షీణించి, కొంతదూరం ప్రయాణించిన తర్వాత తగ్గుతుంది. ఉదా: ఒక బిందువు వద్ద జనించిన తరంగాలు ముందుకు ప్రయాణించేటప్పుడు వాటి కంపన పరిమితి క్రమంగా తగ్గిపోయి, కొంత దూరం తర్వాత క్షీణిస్తాయి. స్థిర/ స్థావర తరంగాలు: సమాన కంపన పరిమితి, తరంగ దైర్ఘ్యం, పౌనఃపున్యం కలిగి ఉన్న రెండు అనుదైర్ఘ్య లేదా తిర్యక్ తరంగాలు ఒకదానికి మరొకటి వ్యతిరేక దిశలో ప్రయాణించేటప్పుడు అధ్యారోహణం చెందుతాయి. ఈవిధంగా ఏర్పడిన తరంగాలను స్థిరతరంగాలు అంటారు. స్థిర తరంగాలు శక్తిని ఒక బిందువు నుంచి మరో బిందువుకు మోసుకువెళ్లవు. ఉదా: ఒకవైపు మూసి ఉంచి, మరో వైపు తెరచి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడతాయి. అనునాదం: సమాన సహజ పౌనఃపున్యాలున్న రెండు వస్తువుల్లో మొదటి వస్తువును కంపింపజేసినప్పుడు దాని ప్రభావం వల్ల రెండో వస్తువు గరిష్ఠ ధ్వని తీవ్రతతో కంపిస్తుంది. ఈ ధర్మాన్ని ‘అనునాదం’ అంటారు. అనునాదం జరగడానికి రెండు వస్తువుల సహజ పౌనఃపున్యాలు సమానంగా ఉండాలి. అనునాదం అనువర్తనాలు వంతెనలను సమీపించినప్పుడు సైనికులు కవాతును ఆపేస్తారు. ఎందుకంటే అనునాదం వల్ల వంతెన కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ బ్రిడ్జి కింద నుంచి నీరు ప్రవహిస్తే దాని పౌనఃపున్యం మారడం వల్ల అనునాదం జరుగదు. అందువల్ల ఆ బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉండదు. ఈల, పిల్లనగ్రోవి, రేడియో అనునాదం ధర్మం ఆధారంగా పనిచేస్తాయి. ఒక వాహనం (కారు, బస్సు మొదలైనవి) నియమిత వేగాన్ని అధిగమించిన తర్వాత దాని ఇంజిన్ నుంచి వెలువడే శబ్ద పౌనఃపున్యం, కంపించే ఆ వాహనం విడిభాగాల పౌనఃపున్యానికి సమానమైనప్పుడు అనునాదం వల్ల ప్రత్యేకమైన ధ్వని వినిపిస్తుంది. దీన్ని ఖ్చ్టజీజ ౌజ ్టజ్ఛి టౌఠఛీ అంటారు. ఒక గాజుపలక పౌనఃపున్యానికి సమానమైన పౌనఃపున్యం ఉన్న ధ్వనిని ఉత్పత్తి చేసినప్పుడు అనునాదం వల్ల ఆ గాజు పలక పగిలిపోతుంది. శృతిదండం ఎల్లప్పుడూ ఒక స్థిరమైన పౌనఃపున్యంతో కంపిస్తుంది. దీన్ని ఇన్వార్స్టీల్ అనే లోహ మిశ్రమంతో తయారు చేస్తారు. ఈ పదార్థం సంకోచ, వ్యాకోచాలు పరిగణనలోకి తీసుకోలేనంత తక్కువగా ఉంటాయి. ప్రతిధ్వని: ధ్వని తరంగాలు ప్రయాణించే మార్గంలో ఎదురుగా ఉన్న అవరోధం తలాలను తాకి, పరావర్తనం చెంది, మనల్ని చేరడాన్ని ‘ప్రతిధ్వని’ అంటారు. ప్రతిధ్వనిని వినడానికి కింది షరతులు పాటించాలి. - మొదటిసారి వినిపించే ధ్వనికి, ప్రతిధ్వనికి మధ్య కనీసం 1/10వ సెకన్, అంతకంటే ఎక్కువ వ్యవధి ఉండాలి. - ధ్వని జనక స్థానం, పరావర్తన తలాల మధ్య కనీస దూరం 16.5 మీటర్లు ఉండాలి. పతిధ్వనికి సమీకరణం v ® ధ్వనివేగం d ® ధ్వని తరంగాలు ప్రయాణించిన మొత్తం దూరం. t=కాలం కానీ v = 330 m/s, t = 1/10 d = 16.5m అనువర్తనాలు - లోతైన బావులు, లోయలు, గనుల లోతును లెక్కించడంలో - సముద్రాల లోతును కనుగొనడానికి ఉపయోగించే ౌ్చట పరికరం పనిచేయడంలో ధ్వని పరావర్తనం ధర్మం ఇమిడి ఉంటుంది. - రెండు ఎత్తై భవనాలు, పర్వతాల మధ్య దూరాన్ని కచ్చితంగా లెక్కించేందుకు ఈ ధర్మాన్ని ఉపయోగిస్తారు. - వైద్యులు ఉపయోగించే స్టెతస్కోప్ ధ్వని పరావర్తనం (బహుళ పరావర్తనం) సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఈ సాధనాన్ని Lenneck శాస్త్రవేత్త కనుగొన్నాడు. - గోల్కొండకోట ప్రధాన ద్వారం వద్ద చేసే ధ్వని బహుళ పరావర్తనం చెంది ఆ కోటపై ఏడుసార్లు వినిపిస్తుంది.