
కోదాడ : చదువులో తిరుగులేని ప్రతిభను కనబరుస్తున్న సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాల విద్యార్థులు క్రీడల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రీడా సమరానికి సూర్యపేట జిల్లా, కోదాడ మండలంలోని నడిగూడెం బాలికల గురుకుల పాఠశాల ఆతిథ్యం ఇస్తోంది. గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ చేతుల మీదుగా బుధవారం ఈ క్రీడాసమరానికి తెరలేవనుంది.
నాలుగురోజుల పాటు జరిగే ఈ ఐదో జోనల్ మేట్-2018లో అండర్-17 విభాగంలో 28 పాఠశాలల బాలికలు, అండర్-19 విభాగంలో 33 కళాశాలల 1840 మంది విద్యార్థినులు తమ సత్తా చాటనున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment