
సాక్షి,హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో తాను ఎవరికో మద్ద తు ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తాను ప్రస్తుతం ఇల్లు వెతుక్కునే పనిలో తలమునకలయ్యానని, తనను అనవసరంగా ఇందులోకి లాగొద్దన్నారు. తనను లాగితే అందరి అంచనాలు తలకిందులవుతాయని హెచ్చరిస్తూ సోమవారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు.
హుజూరాబాద్ లో నేను ఎవరెవరికో మద్దతిస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ ను నమ్మకండి. నా మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాదికే. అక్కడ వెదజల్లుతున్న డబ్బులను వీటికే పెట్టాలి. ఇప్పుడే రిటైరై ఒక ఇల్లు దేవులాడుట్ల బిజీగ ఉన్న. నన్ను ఊరికే ఆడికి లాగకుండ్రి. అంచనాలు తలక్రిందులయితై
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) July 26, 2021
Comments
Please login to add a commentAdd a comment