అచ్చంపేట/ కల్వకుర్తి రూరల్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. ఆదివారం రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట లో నిర్వహించిన నల్లమల నగారా సభలో, అంతకు ముందు కల్వకుర్తిలో మీడియాతో ఆయన మాట్లా డారు. రాజ్యాధికారం కోసం బహుజనులు ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, బీసీలకు తమ పార్టీ 70 స్థానాలను కేటాయిస్తుందని చెప్పారు.
సూర్యాపేటలో జానయ్యపై చేస్తున్న దాడులను, మణిపూర్, భూపాల్ దాడులను ఖండిస్తున్నామన్నా రు. ఒక శాతం ఉన్న దొరలు 99 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణ పేదలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. తాము ఎవరి వైపున ఉండమని.. రాజ్యాంగం వైపు ఉంటామని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment