
భద్రాచలంఅర్బన్: గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర సోమవారం భద్రాచలం చేరుకుంది. మొదట అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్య ప్రజలను, బస్‌పాస్ చార్జీలు పెంచి విద్యార్థులను ఇబ్బంది పెడుతోందన్నారు.
రాష్ట్రంలో ‘మన ఊరు – మన బడి’కార్యక్రమానికి సంవత్సరానికి రూ.7,800కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఈ నిధులతో బడులు బాగుపడటమేమో కానీ.. కాంట్రాక్టర్లు బాగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఎన్నికల డ్రామానేనని విమర్శించారు. భద్రాద్రి జిల్లాలో పోడు భూముల సమస్య అధికంగా ఉందన్న ఆర్‌ఎస్పీ ఈ సమస్య పరిష్కరిస్తానని 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన వాగ్దానాన్ని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment