
కంబాలపల్లిలో యువకులతో మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్
మహబూబాబాద్ అర్బన్: మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రం గా మార్చిన సీఎం కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కో–ఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బహు జన రాజ్యాధికార యాత్ర 77వ రోజు ఆదివారం మహబూబా బాద్ జిల్లా కంబాలపల్లి గ్రా మంలో కొనసాగింది.
ఈ సందర్భంగా ఆయన గ్రామంలో కలియ తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారు స్తూ.. ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి తీసు కొచ్చారన్నారు.