
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టులో గిరిజన సంక్షేమశాఖ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం గర్వకారణమని గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కొనియాడారు. భద్రాచలం టీటీడబ్ల్యూఆర్‌సీకు చెందిన విద్యార్థిని కె.మధుమిత స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించగా, పాయం చంద్రకళ నాల్గవ ర్యాంకు, అంకపాలెం టీటీడబ్ల్యూఆర్‌జేసీ విద్యార్థి అనూష తొమ్మిదోర్యాంకు సాధించారన్నారు.
గురుకులాల విద్యార్థులు జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధిస్తున్నారన్నారు. గిరిజన, పేద విద్యార్థులకు గురుకులాలు ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనమన్నారు. బడ్జెట్‌లో గిరిజన సంక్షేమ గురుకులాలకు నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు, గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment