తల్లాడలో జ్యూస్ చేస్తున్న ప్రవీణ్‌కుమార్
తల్లాడ: దళితబంధు తదితర సంక్షేమ పథకాలతో అణగారిన వర్గాల బతుకులు మారవని బీఎస్పీ చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలు అణగారిన వర్గాలకు చేసిందేమీ లేదని విమర్శించారు. బహుజనులను ఓటేసే యంత్రాలుగానే చూస్తున్నారన్నారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని పలు గ్రామాల్లో సోమ వారం కొనసాగింది.
మల్లవరంలో జరిగిన సభలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకుంటున్న పాలకులు ఆ తర్వాత ప్రజల బాగోగులను విస్మరిస్తున్నారని చెప్పారు. సొంత సం పాదన పెంచుకునేందుకే జిల్లా మంత్రి అజయ్‌కుమార్, ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సమ యానికి అనుగుణంగా అన్నిపార్టీల జెండాలు మోస్తున్నారని ఆరోపించారు. విద్యారంగానికి నిధులు కేటాయిస్తే అణగారిన వర్గాల పిల్లలు కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పారు. ప్రగతిభవన్‌ను దెయ్యాల కొంపగా సీఎం కేసీఆర్ మార్చా రని మండిపడ్డారు. మతతత్వ బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని, తీన్మార్ మల్లన్న మోసకారి అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment