చంద్రబాబు ప్రభుత్వ మోసాలపై నేనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా
అరెస్టు చేయడం మొదలు పెడితే నా నుంచే ప్రారంభించండి
ఎంత మందిని అరెస్టు చేస్తారో చూద్దాం
వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా ఈ మేరకు పోస్టు చేయాలని వైఎస్ జగన్ పిలుపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అక్రమాలు, వైఫల్యాలు, మోసాలపై ప్రశ్నించే స్వరం విన్పించకూడదనే దురాలోచనతో సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ, అక్రమంగా నిర్బంధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండి పడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ రాజకీయంగా ఆయనను వ్యతిరేకించే వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా ఎవరినీ అరెస్టు చేయడం లేదన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
» దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో 680 మందిపై సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇచ్చారు. 147 మందిపై కేసులు పెట్టి.. 49 మందిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు మోసాలను సోషల్ మీడియా వేదికగా నేను పోస్ట్ చేస్తాను. వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా ఇదే పోస్టు పెట్టాలని పిలుపునిస్తున్నా. ఎంత మందిపై కేసులు పెడతారో చూద్దాం. ఆ కేసులేవో నాతోనే మొదలుపెట్టండి.
.@ncbn గారు .. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టావు.
నీవు చీటర్‌వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా?
ఆడబిడ్డ నిధి:
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళలకు రూ.37,313 కోట్లు ఇవ్వాలి. ఎంత…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 13, 2024
» ఒక వైపు చంద్రబాబు హయాంలో రాష్ట్రం కుదేలైపోయే పరిస్థితి కన్పిస్తోంది. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రతీ వర్గాన్ని మోసం చేస్తున్నారు. మహిళలు, చిన్నారుల పరిస్థితి ఎప్పుడూ చూడని విధంగా ఉంది. ఏకంగా 110 మంది మహిళలు, చిన్నారులపై ఈ ఐదున్నర నెలల్లోనే అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి.
» ఇందులో 11 మంది చనిపోయారు. నిన్న (మంగళవారం) కూడా మూడు ఘటనలు జరిగాయి. రాష్ట్రంలో ఐదున్నర నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 177 హత్యలు.. 500కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. మహిళలపై అన్యాయాలు, అత్యాచారాలకు అంతే లేకుండా పోయింది.
ఇదీ చదవండి: బూచిగా అప్పుల భూతం.. సూపర్ సిక్స్‌కు ఎగనామం
» బడ్జెట్ చూస్తే మోసం.. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైన పరిస్థితి. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల బకాయిలు రూ.2,300 కోట్లు దాటాయి. వాళ్లు రోడ్డెక్కుతున్నారు. పట్టించుకోవడం లేదు. 108, 104 సిబ్బంది ధర్నా చేస్తున్నారు. అతలాకుతలమైపోయిన పరిస్థితుల్లో సూపర్ సిక్స్, సూపర్ సెవన్ మోసం.. ఇలాంటి పరిస్థితులను నిలదీస్తే.. ప్రశ్నించే గొంతును నొక్కేందుకు అక్రమ కేసులు బనాయిస్తూ అక్రమంగా నిర్బంధిస్తూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment