
ప్రేమ్‌కుమార్ కుటుంబీకులకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, అమరావతి: పోలీసులు అక్రమంగా బనాయించిన కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని గుంటూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కొరిటిపాటి ప్రేమ్‌కుమార్ భార్య సౌజన్య, కుటుంబ సభ్యులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను ప్రేమ్ కుమార్ భార్య సౌజన్య, కుటుంబ సభ్యులు కలిశారు.
పోలీసులు తమ ఇంటికి వచ్చి దౌర్జన్యంగా వ్యవహరించి ప్రేమ్‌కుమార్‌ను తీసుకువెళ్లిన తీరును జగన్‌కు వారు వివరించారు. వారికి నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చిన జగన్..అక్రమ కేసులు చట్టపరంగా ఎదుర్కుందామని, వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రేమ్‌కుమార్ బెయిల్ విషయంలో అవసరమైన న్యాయ సహాయం అందజేయాలని వైఎస్సార్‌సీపీ లీగల్ టీమ్‌కు సూచించారు. ఈ సందర్భంగా జగన్‌ను మాజీ మంత్రులు అంబటి, మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment