నరసాపురం (పశ్చిమగోదావరి) : వ్యభిచారం చేయించేందుకు విజిట్ వీసాతో ఐదుగురు మహిళలను దుబాయి పంపిన ఏజెంట్లను నరసాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మహిళల అక్రమ రవాణా కేసులో నరసాపురం పోలీసులు శుక్రవారం రాత్రి త్రిమూర్తులు, తిమూతి అనే ఇద్దర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గల్ఫ్ ఏజెంట్లు ఐదుగురు మహిళలను విజిట్ వీసాపై దుబాయి పంపి, వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్న విషయాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ హోం మంత్రి చినరాజప్ప దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేయాలని ఎస్పీకి హో మంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధిత మహిళలు అమలాపురం,నరసాపురానికి చెందినవారిగా భావిస్తున్నారు. వారిని దుబాయ్ నుంచి ఇక్కడికి రప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.