అక్రమ కేసు బనాయించారు... న్యాయం చేయండి | do justice | Sakshi
Sakshi News home page

అక్రమ కేసు బనాయించారు... న్యాయం చేయండి

Aug 30 2016 12:37 AM | Updated on Sep 17 2018 6:18 PM

‘చాగలమర్రి మండలం వెలుగు పథకంలో పనిచేస్తున్నాను. వికలాంగురాలిని. మఠం శంకరమ్మ నాపై అసత్యపు దొంగతనం కేసు నమోదు చేయించి నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేసి దుర్భాషలాడుతోంది’ అని చాగలమర్రికి చెందిన నాగమ్మ ఎస్పీ ఆకే రవికృష్ణకు ఫిర్యాదు చేశారు.

కర్నూలు:  ‘చాగలమర్రి మండలం వెలుగు పథకంలో పనిచేస్తున్నాను. వికలాంగురాలిని. మఠం శంకరమ్మ నాపై అసత్యపు దొంగతనం కేసు నమోదు చేయించి నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేసి దుర్భాషలాడుతోంది’ అని చాగలమర్రికి చెందిన నాగమ్మ ఎస్పీ ఆకే రవికృష్ణకు ఫిర్యాదు చేశారు. సోమవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎస్పీ పోలీస్‌ ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 94407 95567కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను నోట్‌ చేసుకున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు నేరుగా వచ్చి కలసిన ప్రజల నుంచి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. డయల్‌ యువర్‌ ఎస్పీ, పోలీస్‌ ప్రజాదర్బార్‌కు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.    
 
  •  ఇల్లు తాకట్టు పెట్టి తీసుకున్న డబ్బును చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఇల్లు స్వాధీనం చేయడం లేదని కోవెలకుంట్లకు చెందిన ఓ మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భర్త ఆరోగ్య సమస్యల కారణంగా ఇంటిని రూ.70 వేలకు తాకట్టు పెట్టామని, ఆ డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఇంటిని స్వాధీనం చేసుకున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. 
 
  •  ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు ఇప్పించాలని రామళ్లకోట గ్రామానికి చెందిన రేణుక ఫిర్యాదు చేశారు. సంవత్సరం క్రితం తల్లి చనిపోయిందని, మూడు నెలల తర్వాత ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టు ఇస్తామని ఇంతవరకు ఓర్వకల్లు పోలీసులు ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement