Silk worms
-
పట్టుపురుగుల పెంపకంతో రైతులకు మంచి లాభాలు
-
పట్టు పురుగుల పెంపకంలో జాగ్రత్తలు అవసరం
-
పట్టుపురుగుల పెంపకం...ఒకేసారి పెట్టుబడి, నెలనెలా ఆదాయం..!
-
రైతు ఆదాయం పెంచే పట్టు యంత్రం
పట్టు గూళ్లు సాగు చేసే రైతుల ఇబ్బందులను తీర్చడంతో పాటు కూలీల ఖర్చును గణనీయంగా తగ్గించే సమగ్ర యంత్రాన్ని రైతు శాస్త్రవేత్త గురుమూర్తి శెట్టి (ఏడూరు బాబు) ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరు వాస్తవ్యుడైన ఆయన కుటుంబం రెండు తరాలుగా పట్టు గూళ్ల సాగులో నిమగ్నమై ఉంది. పదో తరగతి వరకు చదివిన గురుమూర్తి ఊహ తెలిసిన నాటి నుంచి పట్టు గూళ్ల సేకరణ ప్రక్రియలో చాకిరీని గమనిస్తున్నారు. వెదురు చంద్రికలు లేదా రోటరీ మోటేజ్ లేదా ప్లాస్టిక్ నేత్రికల్లో పెరిగిన పట్టు గూళ్లను విడిపించి అమ్మకానికి సిద్ధం చేయటం ఖర్చుతో, శ్రమతో కూడిన పని. 35 మంది కూలీలు రోజంతా శ్రమిస్తే 600 కిలోల పట్టు గూళ్లను మార్కెట్‌కు సిద్ధం చేస్తారు. ఈ పనిలో చాకిరీని తగ్గించగలిగితేనే రైతు నికరాదాయం పెరుగుతుందని ఆలోచనతో కృషి చేసిన గురుమూర్తి అందుకు ఉపయోగపడే ఓ యంత్రాన్ని మూడేళ్ల క్రితం రూపొందించారు. ఆచరణలో ఎదురైన కొన్ని సమస్యలను సైతం పరిష్కరించి సమగ్రమైన కకూన్ హార్వెస్టర్‌కు ఇటీవల రూపొందించారు. ఈ యంత్రం ఉంటే కేవలం 11 మంది కూలీలతో 600 కిలోల గూళ్లను ప్లాస్టిక్ నేత్రికల నుంచి సులువుగా విడిపించవచ్చని గురుమూర్తి తెలిపారు. పెద్దలు, పిల్లలు, ఆడ, మగ ఎవరైనా దీనిపై సులువుగా పనిచేయవచ్చు. విద్యుత్తు మోటారు లేదా మోటారు సైకిల్ ద్వారా దీన్ని నడపవచ్చు. ఇవేవీ లేకపోతే మనుషులే దీని చక్రం తిప్పుతూ గూళ్లను చంద్రికల నుంచి వేరు చేయవచ్చు. ఆకు గూళ్లు లేదా బెడ్ గూళ్లను శుభ్రం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుండటం విశేషం. పట్టు గూళ్లపైన ఉండే నూగు లేదా ప్లాస్ లేదా జుంజరను తీసివేసి గూళ్లను నున్నగా చేసే శక్తి కూడా ఈ యంత్రానికి ఉంది. ఈ యంత్రం బరువు తక్కువ. ఆటోలో పెట్టి ఎక్కడికైనా తరలించవచ్చు. ఈ యంత్రం ధర రూ. 40 వేలు. దీనికి వాడిన నట్లు, బోల్టులు, బెల్టు.. అన్నీ గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండేవే. మరమ్మతు వచ్చినా రైతులే చేసుకోవచ్చని గురుమూర్తి వివరించారు. ఈ యంత్రాన్ని ఉత్పత్తి చేసి సెరికల్చర్ రైతులకు అందించడానికి గురుమూర్తి ‘గురూస్ ఎంటర్ప్రైజెస్’ స్టార్టప్ కంపెనీని నెలకొల్పారు. ‘రఫ్తార్’ పథకం కింద రూ.1.80 లక్షలను అందించి ప్రభుత్వం ప్రోత్సహించింది. తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం అధికారులు డా. సి. రమణ, డా. బాలహుస్సేన్‌రెడ్డి ఈ యంత్రం పనితీరును చూసి ముగ్ధులయ్యారు. సొంత తెలివితో యంత్రాన్ని ఆవిష్కరించిన గురుమూర్తి శెట్టి(98491 26223)కి జేజేలు! ఎలుకలకు అడుగున్నర దూరం! వరి సాగులో నారు మడి నుంచి పంట దిగుబడి వరకు ఎలుకల సమస్య రైతులను సతమతం చేస్తుంటుంది. 5–10% ధాన్యం దిగుబడి నష్టం జరుగుతూ ఉంటుంది. విష గుళికలు చల్లటం, గమ్ స్టిక్లర్ల ఎరలు పెట్టడం, బుట్టలు పెట్టి (ఎలుకకు రూ. 20–30 చెల్లించి) పట్టుకోవటం.. ఎన్ని ఉపాయాలు చేసినా ఎలుకలు తప్పించుకుంటూ నారును, పాల కంకులను కొరికేస్తూనే ఉంటాయి. అయితే, కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరుకు చెందిన మాజీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాలుగేళ్లుగా సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మాదివాడ సురేంద్ర అనుభవాలు వేరుగా ఉన్నాయి. ఆయన ఎలుకలకు విభిన్నంగా చెక్ పెడుతున్నారు. 45 సెం.మీ. దూరంలో.. శ్రీవరి పద్ధతిలో సాధారణంగా వరి మొక్కల్ని 25–30 సెం. మీ. దూరంలో నాటేస్తూ ఉంటారు. సురేంద్ర మాత్రం కుల్లాకర్, నారాయణ కామిని, మైసూర్ మల్లిగ వంటి దేశీ వరి వంగడాల నారును ఎటు చూసినా 45 సెం.మీ. (అడుగున్నర) దూరంలో నాటేస్తున్నారు. మొక్కలు ఇంత దూరంలో ఉండటం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి ఎక్కువ దుబ్బులు కట్టడం వల్ల, ఎలుకలు కంకులను కొరికేయకుండా ఉండటం వల్ల దిగుబడి ఏమీ తగ్గటం లేదు. ఎలుకల సమస్యకు ఇది అద్భుత పరిష్కారంగా కనిపించిందని ఆయన తెలిపారు. ఇంత దూరంగా నాట్లేయటం వల్ల ఎలుకల సమస్య 90% తీరిపోయిందన్నారు. ఎలుకలు, బహుశా ప్రాణభయంతో కావచ్చు, వత్తుగా ఉండే పంట పొలాలనే ఎంచుకుంటాయి. ఎడం ఎడంగా దుబ్బులు ఉన్నప్పుడు ఏ కాకులో, ఏ గుడ్లగూబో తన్నుకుపోతాయన్న భయం వీటికి కలుగుతూ ఉండొచ్చు. అందుకే నా పొలంలోకి రావట్లేదు. వత్తుగా ఉన్న పొరుగు పొలాల్లో ఎలుకలు ఎడతెగని సమస్యగా ఉన్నాయన్నారు. రేడియో ప్రసారాలతో నారుమడికి రక్షణ! వరి నారుమడిలో కూడా ఎలుకల సమస్య తీవ్రంగా ఉంటుంది. విత్తనాలు తినేస్తాయి. మొలకలనూ కొరికేస్తూ ఉంటాయి. పొలం అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి కూడా నారుమళ్లకు ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకని కొందరు రైతులు కలిసి ఒకే చోట నార్లు పోసుకుంటూ ఉంటారు. అయినా, ఎలుకల సమస్య ఉండనే ఉంటుంది. సురేంద్ర ఇంటర్నెట్లో వెతికితే.. అలజడిగా ఉంటే, వెలుతురుగా ఉంటే ఎలుకలను అరికట్టవచ్చని అర్థమై.. ఆ దిశగా ప్రయత్నించి విజయం సాధించారు. ఏ భాషలోనైనా సరే నిరంతరం ప్రసారాలుండే స్టేషన్‌ను ఆన్ చేసిన రేడియోను 2 సెంట్ల నారుమడిలో రాత్రి 8.30కి పెట్టేవారు. పొద్దున్నే తీసేసే వారు. ఈ పని చేయటం ప్రారంభిచిన తర్వాత నారుమడికి ఎలుకల సమస్య లేకుండా పోయింది. విస్తారమైన వరి/మినుము పొలంలో అయితే ఎక్కువ చోట్ల రేడియోలు పెట్టాలి లేదా ఒక రేడియో నుంచి దూరం దూరంగా పొలం అంతటా సౌండ్ బాక్స్లైనా పెట్టుకోవాలి. పొలాల్లో తాటి చెట్లు ఉంటే.. దానిపై గుడ్లగూబలు, కాకులు ఉండి.. ఎలుక పిల్లలను ఏరుకు తింటూ ఉంటాయి. తాటి చెట్లు కొట్టేయటం కూడా ఎలుకల సమస్య పెరగడానికి ఓ కారణమని సురేంద్ర (88862 31122) అంటున్నారు. సెన్సార్‌తో పని చేసే సోలార్ లైట్ల ద్వారా కూడా ఎలుకలను అరికట్టవచ్చన్నారు. -
'పట్టు'న్నోడు రైతు గురుమూర్తి!
పలమనేరు: నెలపాటు సాగు చేసిన పట్టు గూళ్లను నేత్రికల నుంచి విడిపించడానికి ‘పట్టు’ రైతులు పడే పాట్లు చూసి చలించిపోయాడు.. ఆ రైతు. సమయానికి కూలీలు దొరక్కపోవడం.. దీంతో సకాలంలో మార్కెట్‌కు తీసుకువెళ్లకపోవడం వల్ల ఎదురయ్యే కష్టాలను స్వయంగా తాను అనుభవించాడు. దీంతో ఈ కష్టాలకు చెక్ పెట్టాలని భావించిన పట్టు రైతు తానే పట్టు గూళ్లను విడిపించే యంత్రాన్ని తయారు చేశాడు. రూ.40 వేలతోనే యంత్రాన్ని రూపొందించి శాస్త్రవేత్తల మన్ననలందుకున్నాడు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ప్రోగ్రామ్ కింద అందించే రూ.3 లక్షల ప్రోత్సాహకానికి కూడా ఎంపికయ్యాడు. ఇలా అందరికీ ఆదర్శంగా నిలిచిన రైతే.. చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరుకు చెందిన గురుమూర్తి. ఈయన తయారు చేసిన యంత్రంతో పట్టు రైతుల కష్టాలు తీరాయి. తగ్గిన కూలీల ఖర్చు.. పట్టు పురుగులు నేత్రికల్లో గూళ్లు కట్టాక వాటిని రైతులు జాగ్రత్తగా విడిపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 500 మట్టి (సీడ్) పురుగులను మేపితే సుమారు 400 కిలోల గూళ్లు ఉత్పత్తి అవుతాయి. వెయ్యికిపైగా నేత్రికల్లోని గూళ్లను విడిపించేందుకు రోజుకు 30 మంది కూలీల అవసరముంటుంది. ఒక్కో కూలీకి రోజుకు రూ.300 చొప్పున రూ.9 వేలు ఖర్చు అవుతుంది. అయితే కొన్నిసార్లు సమయానికి కూలీలు దొరకరు. దీంతో గూళ్లను నేత్రికల నుంచి విడిపించడానికి మూడు, నాలుగు రోజులు సమయం పడుతోంది. దీంతో పట్టు గూళ్లను సకాలంలో మార్కెట్‌కు తీసుకెళ్లకపోవడంతో మంచి ధర లభించక పట్టు రైతులు నష్టపోతున్నారు. దీంతో ఈ కష్టాలకు చెక్ పెట్టాలని భావించిన గురుమూర్తి ఈ యంత్రాన్ని తయారుచేశాడు. విద్యుత్ లేకున్నా పనిచేసేలా.. హాఫ్ హెచ్‌పీ మోటారు సాయంతో నడిచే ఈ యంత్రంలోకి పట్టుగూళ్ల నేత్రికలను ఓ వైపు నుంచి ఒకరు పెడుతుంటే మరోవైపున మరొకరు దాన్ని లాగుతుండాలి. నేత్రికల్లోని గూళ్లు అక్కడే పడి యంత్రానికి ఏర్పాటు చేసిన జల్లెడ ద్వారా ముందుకెళ్లి సంచిలో పడతాయి. దీంతోపాటు పట్టు పురుగులు గూడును అల్లేటప్పుడు కొన్ని మల్బరీ ఆకుల్లోనే గూడును కడతాయి. ఇలాంటి ఆకుగూళ్లను సైతం జాగ్రత్తగా విడదీసేలా గురుమూర్తి ఈ యంత్రాన్ని రూపొందించాడు. ఈ యంత్రాన్ని ఓ చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లవచ్చు. అంతేకాకుండా విద్యుత్ లేనప్పుడు సైతం చేతితో తిప్పేలా హ్యాండిల్ ఉంది. బైక్‌ను స్టార్ట్ చేసి దానికి బెల్ట్ వేసి కూడా వాడుకోవచ్చు. ఇటీవల ఈ యంత్రాన్ని పరిశీలించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంజనీర్ రమణ, సీనియర్ శాస్త్రవేత్త డా.బాలహుస్సేన్.. రైతు గురుమూర్తిని అభినందించారు. ఈ యంత్రం పట్టు రైతులకు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ప్రోగ్రామ్ కింద గురుమూర్తికి రూ.3 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఇందులో ఇప్పటికే రూ.1.8 లక్షలు ఆయన చేతికందాయి. పేటెంట్‌కు దరఖాస్తు చేశా నేను ముప్పై ఏళ్లుగా పట్టు పురుగులు పెంచుతున్నా. కూలీల సమస్యను అధిగమించేందుకు ఈ యంత్రాన్ని తయారుచేశా. దీనికి పేటెంట్ కోసం దరఖాస్తు చేశా. పేటెంట్ వచ్చాక యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తా. – గురుమూర్తి, పట్టురైతు -
రికార్డు స్థాయిలో పట్టుగూళ్ల ధర
మదనపల్లె: పట్టణంలోని పట్టు గూళ్ల మార్కెట్లో శనివారం రైతులు తీసుకువచ్చిన గూళ్లకు రికార్డు ధర లభించింది. సుమారు 18 మంది రైతులు 924.74 కిలోల బైవోల్టిన్ రకం పట్టు గూళ్లను తీసుకువచ్చారు. వీటికి మార్కెట్ అధికారులు నిర్వహించిన బహిరంగ వేలంలో కిలో గూళ్లు రూ.670–752 వరకు పలికాయి. ప్రస్తుతం విపరీతమైన చలి, మంచు అధికంగా ఉండడంతో మల్బరీ ఆకు కోతకు రాకపోవడం, పురుగులు ఆకును తినకపోవడం, సున్నపుకట్టు వ్యాధితో దిగుబడి భారీగా పడిపోయింది. చదవండి: కరోనాతో భార్య మృతి, మనస్తాపంతో భర్త ఆత్మహత్య! అందుకే డిసెంబర్–ఫిబ్రవరి మాసాలను అన్‌సీజన్‌గా పరిగణిస్తారు. చలి, వర్షాలతో దిగుబడులు పూర్తిగా తగ్గిపోతాయి. శుక్రవారం మార్కెట్‌కు ఒకే రైతు కేవలం 36.50 కిలోల గూళ్లు తీసుకువచ్చారు. సంక్రాంతి వరకు దిగుబడులు తక్కువగానే వస్తాయని అధికారులు తెలిపారు. మదనపల్లె గూళ్ల మార్కెట్‌కు జూన్ నుంచి నవంబర్ వరకు సీజన్ కాగా, అత్యధికంగా 6 టన్నుల వరకు గూళ్లు వచ్చిన సందర్భాలున్నాయి. -
పట్టుగూళ్ల తీతకు పసందైన యంత్రం!
- పట్టుగూళ్లను వెలికితీసే యంత్రాన్ని రూపొందించిన రైతు శాస్త్రవేత్త - టన్ను పట్టుగూళ్ల తీతకు 70-80 మంది కూలీలు.. రూ.15 వేల ఖర్చు.. - యంత్రంతో ముగ్గురు కూలీలు చాలు.. ఖర్చు రూ. 800 మాత్రమే - రోజంతా పనిచేసినా యంత్రం విద్యుత్ బిల్లు రూ. 20 పట్టు పురుగుల పెంపకం ఆయన వృత్తి. వాటి పెంపకంలో ఎదురయ్యే ఇబ్బందులను సవాల్‌గా తీసుకుని పరిష్కారం కనుగొనటంలో ఆయన నేర్పరి. పట్టుపురుగులను పెంచే రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య నేత్రికల నుంచి పట్టు గూళ్లను తీయటం. దీన్ని అధిగమించేందుకు ఒక వైపు మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం చేస్తూనే పట్టు గూళ్లను సులువుగా సేకరించే యంత్రాన్ని రూపొందించి తోటి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రశంసలు పొందిన ఆ రైతు శాస్త్రవేత్త పేరు గాండ్ల గురుమూర్తి శెట్టి. చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరు ఆయన స్వగ్రామం. పదో తరగతి వరకూ చదువుకున్నారు. తనకున్న ఆరెకరాల్లో మల్బరీ పంటను సాగు చేస్తూ పట్టు పురుగులను పెంచుతున్నారు. గురుమూర్తి రూపొందించిన యంత్రంతో నేత్రికల నుంచి పట్టుగూళ్లను విడిపించటం, శుభ్రపరచటం, బస్తాల్లో నింపటం వంటి మూడు పనులను ఏక కాలంలో పూర్తిచేయవచ్చు. కూలీల సంఖ్య తగ్గటం వల్ల రైతుకు ఖర్చు తగ్గుతుంది. పని సకాలంలో పూర్తవుతుంది. పట్టు గూళ్లను నేత్రికల నుంచి తీసి అమ్ముకునే ప్రక్రియలో రైతుకు ఎదురయ్యే తొలి అవరోధం కూలీల కొరత. రైతులు పట్టుపురుగుల గుడ్లను బ్యాచ్‌ల వారీగా పెంచటమే దీనికి కారణం. నెలకు మూడు బ్యాచ్‌లు వస్తాయి. ఒక బ్యాచ్‌లో సాగుచేసిన రైతులందరికి పంట ఒక్కసారే వస్తుంది. దీంతో ఒక్కసారిగా కూలీలకు గిరాకీ పెరుగుతుంది. సకాలంలో కూలీలు దొరక్క రైతులు నష్టపోవాల్సి వస్తుంది. దీనికి తోడు ఎన్ని ఇబ్బందులెదురైనా గూళ్లు అల్లటం పూర్తయిన వారంలో పట్టుగూళ్లను నేత్రికల నుంచి తీసి విక్రయించాలి. లేకుంటే పురుగులు గూళ్లను బద్దలు కొట్టుకొని బయటకు వస్తాయి. అదే జరిగితే రైతు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. ఆలస్యం జరిగే కొద్దీ పంటను నష్టపోయే పరిస్థితి. ఈ సమస్యను గురుమూర్తి తయారు చేసిన యంత్రం స్వల్ప ఖర్చుతోనే పరిష్కరిస్తుంది. పట్టుగూళ్లను నేత్రికల నుంచి తీసే యంత్రం 12 అడుగుల పొడవు, 2 1/2 అడుగుల వెడల్పుతో బల్లపరుపుగా ఉంటుంది. యంత్రం మధ్యలో రెండు బ్లేడ్లను అమర్చారు. నేత్రికలను బ్లేడ్ల మధ్యన ఉంచి లాగితే పట్టుగూళ్లు బయటకు వ స్తాయి. గూళ్లు బ్లేడ్ల కింద ఏర్పాటు చేసిన కన్వేయర్ బెల్ట్‌పై పడతాయి. కన్వేయర్ బె ల్ట్పై అమర్చిన ఇనుప కమ్మలు గూళ్లను పట్టి శుభ్రపరుస్తాయి. గూళ్లను అంటిపెట్టుకుని ఉండే ఆకు, పురుగుల పెంట, జుంజుర (వృథా దారం)ను పూర్తిగా తొలగిస్తాయి. బెల్ట్‌తో పాటు పట్టు గూళ్లు దొర్లుకుంటూ వెళ్లి యంత్రం చివరన ఉంచిన బస్తాలో పడతాయి. బస్తా నిండగానే మూతి బిగించి కట్టి, నేరుగా మార్కెట్‌కు తరలించవచ్చు. 1/4 హెచ్. పి. సామర్థ్యం కలిగిన కుట్టుమిషన్ మోటార్‌ను ఈ యంత్రంలో వాడారు. నాలుగు గంటలకు ఒక యూనిట్ విద్యుత్ మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే రూ. 20 ఖర్చుతో ఏకంగా 8 గంటలు పనిచేస్తుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఇళ్లలో వాడే ఇన్వర్టర్తోను ఈ యంత్రాన్ని నడిపించవచ్చు. అదీ వీలు కాకుంటే యంత్రంలో ఏర్పాటు చేసిన హ్యాండిల్‌ను చేతితో తిప్పుతూ యంత్రాన్ని పనిచేయించవచ్చు. దీనికి కొంచెం అధికంగా శ్రమపడాలి. వంద కిలోల బరువుండే ఈ యంత్రాన్ని ట్రాలీ ఆటోలో పెట్టుకుని కావలసిన చోటుకు తీసుకెళ్లవచ్చు. దీని ఖరీదు రూ. 20 వేలు. ఇంత ఖర్చు భరించే స్థోమత లేని చిన్న రైతుల కోసం చేతితో తిప్పితే నడిచే యంత్రాన్ని కూడా గురుమూర్తి రూపొందించారు. ఇది రూ. 3 వేలకే లభిస్తుంది. హ్యాండిల్‌ను చేతితో తిప్పుతూ గంటకు 60 నేత్రికల నుంచి పట్టుగూళ్లను తీయవచ్చు. రైతులు వాటిని శుభ్రం చేసుకుని ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. టన్ను పట్టు గూళ్లను సేకరించటానికి 70-80 మంది కూలీలు అవసరమవుతారు. రూ.15 వేల వరకు ఖర్చవుతుంది. గురుమూర్తి యంత్రంతో ఒక్కరోజులో ముగ్గురు కూలీలతో పని పూర్తి చేయవచ్చు. కూలీలకు, విద్యుత్ బిల్లు అన్ని కలిపి రూ. 800 వరకు మాత్రమే ఖర్చవుతుంది. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ ఇన్పుట్స్ : సుబ్రమణ్యం, సాక్షి, పలమనేరు కేవీకే శాస్త్రవేత్తలు అభినందించారు.. పట్టు పురుగులు పెంచే రైతులందరూ ఎదుర్కొనే సమస్య పట్టుగూళ్ల సేకరణ. దీన్ని అధిగమించేందుకు ఈ యంత్రాన్ని తయారు చేశాను. రైతులు ఈ యంత్రాన్ని సులభంగా ఉపయోగించవచ్చు. ఏవైనా మరమ్మతు వస్తే రైతులే స్వంతగా బాగు చేసుకోవచ్చు. కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు నా యంత్రం పనితీరును పరిశీలించి, అభినందించారు. ప్రస్తుతం ఈ యంత్రాన్ని నా తోటి రైతులకు అద్దెకిస్తున్నాను. కిలో పట్టుగూళ్లకు రెండు రూపాయల చొప్పున తీసుకుంటున్నాను. ఎవరైనా రైతులు యంత్రం కావాలని కోరితే తయారుచేసి ఇస్తాను. - గాండ్ల గురుమూర్తి శెట్టి (98491 26223) ఏడూరు, గంగవరం మండలం, చిత్తూరు జిల్లా -
ప్రతి నెలా ‘పట్టు’బడే!
ఉద్యోగం మానేసి పట్టు పురుగుల పెంపకం చేపట్టిన యువకుడు పూర్తిస్థాయిలో శిక్షణ పొంది.. ప్రణాళికాబద్ధంగా ముందడుగు.. నెలకు రూ. 30 వేల నికరాదాయం పొందుతున్న వైనం వ్యవసాయం బొత్తిగా గిట్టుబాటు కాకుండా పోతున్న ఈ రోజుల్లో కన్నీటి సేద్యం చేయడం కన్నా.. పట్నంలో ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ పొట్టపోసుకుంటే మేలన్నది గ్రామీణ యువతను ఇప్పటికీ బలంగా ఆకర్షిస్తున్న భావన. అయితే, పొరుగూళ్లో చిన్నాచితకా ఉద్యోగాల కన్నా సొంతూళ్లో ప్రణాళికాబద్ధమైన సేద్యం ఎంతో మేలని మూతి మీద మీసం కూడా ఇంకా సరిగ్గా మొలవని ఈ లేత కుర్రాడు తన చేతల ద్వారా చాటిచెబుతున్నాడు. శిక్షణ పొంది పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టి భళా అనిపించుకుంటున్నాడు. తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు... సొంతూళ్లో పట్టు పురుగుల పెంపకం చేపట్టి లాభాలు ఆర్జించాలి అనే కోరికతో ఉద్యోగం మానేసి సొంతూరు చేరుకున్నాడు. చదువుకొని ఉద్యోగం చేసుకోక ఇవన్నీ ఎందుకని ఇంట్లో వాళ్ల నుంచి, స్నేహితులు, ఇరుగుపొరుగు నుంచి విమర్శలు వచ్చినా సహించాడు. తల్లిదండ్రులను ఒప్పించి పెట్టు బడి సమకూర్చుకున్నాడు. కష్టం ఫలించి తొమ్మిది నెలల తరువాత తను ఊహించిన లాభాలు ఒళ్లో వాలాయి. వెక్కిరించిన నొసళ్లే ప్రశంసాపూర్వకంగా చూశాయి. మేమూ నీదా రిలోనేనంటూ మరికొంత మంది యువకులు ముందుకు వచ్చారు. ఇంతా సాధించిన ఆ యువకుడి పేరు పొట్టవర్తిని భార్గవ్. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని కన్నాపూర్ ఆయన స్వగ్రామం. భార్గవ్ జగిత్యాలలో ఇంటర్ పూర్తి చేసి, హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివాడు. డిప్లామా పూర్తి చేసి ఒక సెవెన్ స్టార్ హోటల్లో నెలకు రూ. 8 వేల జీతంతో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం భార్గవ్‌కు తృప్తినివ్వలేదు. ఇప్పుడు బాగానే ఉన్నా తరువాత పరిస్థితి ఏమిటి? అనిపించేది. తను అద్దెకున్న ఇంటి యజమాని నాయక్ సెరి కల్చర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తుండేవారు. ఆయనతో పరిచయం పట్టు పురుగుల పెంపకంపై ఆసక్తిని పెంచింది. బాగా ఆలోచించి స్వంత ఊళ్లో పట్టు పురుగుల పెంపకంతో ఉపాధి పొందడమే సరైన మార్గమని నిశ్చయిం చుకున్నాడు. అనుకున్నదే తడవుగా నాయక్ సలహాతో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌లో కేంద్ర పట్టు పురుగుల పెంపకం పరిశోధన, శిక్షణ కేంద్రంలో 2 నెలలు, హిందూపూర్‌లో 15 రోజులు శిక్షణ తీసుకున్నాడు. రూ. 5 లక్షలతో పట్టు పురుగుల పెంపకానికి ఓ షెడ్డు వేశారు. పట్టు పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించగా వారు షెడ్డు నిర్మాణానికి లక్ష రూపాయలు, స్టాండ్లు, ట్రేలు, చంద్రికలు నెట్లు కట్టుకోవటానికి రూ. 38 వేలు అందజేశారు. మేత కోసం రాజమండ్రి నుంచి మల్బరీ మొక్కలను తెప్పించి ఎకరంలో మల్బరీ తోటను పెంచారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా మల్బరీ తోటకు కూలీల ఖర్చు కోసం ఏడాదికి రూ. 53 వేలు కేటాయించగా రూ. 13 వేలతో మొక్కలు నాటించి, కలుపు తీయించటం వంటి పనులు పూర్తి చేశారు. ఏడాదికి మూడుసార్లు పేడ ఎరువును వేయటం, నీరు కట్టటం తప్ప మల్బరీ తోట పెంచేందుకు ఖర్చులేవీ లేవు. మల్బరీ తోట 15 ఏళ్ల వరకు దిగుబడినిస్తుంది. తోట ఆరు నెలలు వయసుకొచ్చాక ఆకు సమృద్ధిగా లభిస్తుండటంతో వంద గుడ్లతో పట్టు పురుగుల పెంపకం ప్రారంభించారు. 2013 అక్టోబర్‌లో మొదటి బ్యాచ్ వచ్చింది. ఖర్చుకు 8 రెట్లు ఆదాయం.. సుమారు రూ. 30 వేల వరకు నికరాదాయం పొందాడు. మొదటి బ్యాచ్‌తోనే తాను అనుకున్న ఫలితాన్ని సాధించాడు భార్గవ్. వంద గుడ్లు కొనుగోలు ఖర్చు రూ. 650, షెడ్‌ను రసాయనాలతో కడిగేందుకు రూ. 500, నాలుగో దశలో ఆకు కోసేందుకు రూ. వెయ్యి, చంద్రికలు నుంచి గూళ్లను తొలగించేందుకు ముగ్గురు కూలీలకు రూ. 450 ఖర్చు కాగా, మార్కెట్‌కు తరలించేందుకు మరో రూ. వెయ్యి ఖర్చయ్యాయి. మొత్తం రూ. 3,600 ఖర్చు కాగా.. 89 కేజీల పట్టుగూళ్ల దిగుబడి వచ్చింది. కిలోకు రూ. 360 ధర లభించటంతో రూ. 32,040 ఆదాయం లభించింది. జల్లి (మెత్తపడ్డ) గూళ్లు ఎనిమిది కిలోలు రాగా కిలోకు రూ. 50 ధర లభించింది. మొత్తం రూ. 32,440 ఆదాయానికి గానూ.. ఖర్చులు పోను రూ. 28,800 నికరాదాయం వచ్చింది. ఇది ఒక్క బాచ్ (29 -32 రోజులు) ఆదాయం మాత్రమే. ఇప్పటివరకూ 9 బ్యాచ్‌లు వచ్చాయి. ప్రతి బ్యాచ్‌లోనూ రూ. 29 - 32 వేల వరకు ఆదాయంతో మొత్తం రూ. 2.50 లక్షల వర కూ నికరాదాయం వచ్చింది. ముందు జాగ్రత్తలతో మేలు పట్టు పురుగుల పెంపకంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే అంతా సవ్యంగా జరుగుతుందంటున్నారు భార్గవ్. పురుగులు కుబుసం విడిచినప్పుడు, రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు ఫార్మనిక్ పౌడర్ చల్లాలి. విసర్జకాల నుంచి వైరస్ రాకుండా పొడి వాతావరణం కోసం కాల్చిన సున్నం చల్లాలి. పట్టు పురుగులను ప్రతి పూటా నిశితంగా పరిశీలించటం, అంటురోగాలు వ్యాప్తి చెందకుండా షెడ్‌ను రసాయనాలతో కడగటం ద్వారా 90 శాతం నష్టాలను నివారించవచ్చునని చెపుతున్నారు. రోజూ స్వయంగా మేత కోసి వేస్తూ, పట్టు పురుగులను పరిరక్షిస్తూ, సకాలంలో చర్యలు తీసుకోవటంతో పెద్ద ఇబ్బందులేమీ రాలేదంటున్నారు భార్గవ్. తామంతా అసాధ్యం అన్నదాన్ని భాస్కర్ తమ కళ్లముందే సాధించటంతో మరికొందరు రైతులు పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టేందుకు ముందుకొస్తున్నా రు. భార్గవ్ స్వంత గ్రామంలో ఆరుగురు, చుట్టు పక్కల గ్రామాల్లో 15 మంది రైతులు వచ్చే తొలకరి నుంచి మల్బరీ తోటల పెంపకాన్ని చేపట్టేందుకు సిద్ధమ వుతున్నారు. వీరందరికీ మల్బరీ మొక్కలు అందించేందుకు భార్గవ్ రెండెకరాల్లో నర్సరీని పెంచుతున్నారు. - పన్నాల కమలాకర్ రెడ్డి, జగిత్యాల, కరీంనగర్ జిల్లా పంటల సాగు కన్నా పట్టుపురుగుల పెంపకం మేలు ప్రారంభంలోనే షెడ్ల నిర్మాణం కోసం పెద్ద మొత్తం ఖర్చు చేయాలి. తర్వాత తక్కువ ఖర్చుతోనే మంచి ఆదాయం పొందవచ్చు. మరో రెండెకరాల్లో మల్బరీ తోటను పెంచి, పట్టు గుడ్ల సంఖ్యను 300కు పెంచటం ద్వారా నెలకు రూ. లక్ష సంపాదించాలనేది ప్రస్తుతం నా లక్ష్యం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇతర పంటల సాగు కన్నా పట్టు పురుగుల పెంపకం ద్వారా మంచి లాభాలు అందుకోవచ్చు. ఉద్యోగం కన్నా పట్టుపురుగుల పెంపకం నాకు ఎక్కువ సంతృప్తినిస్తున్నది. శిక్షణ తీసుకుంటే సత్ఫలితాలు సాధించడం సులభం. - పొట్టవర్తిని భార్గవ్(89789 92613), యువ రైతు, కన్నాపూర్, జగిత్యాల మండలం, కరీంనగర్ జిల్లా -
పట్టు రైతులతో కలెక్టరు సమావేశం
నల్లగొండ : పట్టు రైతులతో నల్లగొండ జిల్లా కలెక్టరు సత్యనారాయణరెడ్డి సమావేశమయ్యారు. శనివారం జిల్లాలోని ఎస్.ఆత్మకూర్ మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలో పట్టు పురుగుల పెంపకం, మల్బరీ తోటల సాగును కలెక్టరు పరిశీలించారు. అనంతరం చాకో సెంటర్‌ను సందర్శించారు. పట్టు రైతులతో జరిగిన సమావేశంలో కలెక్టరు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టు రైతులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇస్తుందన్నారు. పట్టు రైతులకు ప్రభుత్వ తరపున పూర్తి సహాయ సహకారాలు అందుతాయని ఆయన హామినిచ్చారు. (ఎస్.ఆత్మకూర్)