పట్టు రైతులతో కలెక్టరు సమావేశం | nallagonda collecter meets formers | Sakshi
Sakshi News home page

పట్టు రైతులతో కలెక్టరు సమావేశం

Published Sat, Mar 14 2015 11:06 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM

nallagonda collecter meets formers

నల్లగొండ : పట్టు రైతులతో నల్లగొండ జిల్లా కలెక్టరు సత్యనారాయణరెడ్డి సమావేశమయ్యారు. శనివారం జిల్లాలోని ఎస్.ఆత్మకూర్ మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలో పట్టు పురుగుల పెంపకం, మల్బరీ తోటల సాగును కలెక్టరు పరిశీలించారు. అనంతరం చాకో సెంటర్‌ను సందర్శించారు.

పట్టు రైతులతో జరిగిన సమావేశంలో కలెక్టరు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టు రైతులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇస్తుందన్నారు. పట్టు రైతులకు ప్రభుత్వ తరపున పూర్తి సహాయ సహకారాలు అందుతాయని ఆయన హామినిచ్చారు.
(ఎస్.ఆత్మకూర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement