నెలన్నర గ్యాప్‌లో టమాటా ధర 300 శాతానికి పైగా పెరిగాయి. కొన్నిచోట్ల సెంచరీకి పైనే.. మరికొన్ని చోట్ల డబుల్ సెంచరీ చేరువకి.. కొన్ని చోట్ల 220 దాకా కూడా పలుకుతోంది. ఈ తరుణంలో టమాట కేజీ 300 రూపాయలకు చేరుతుందనే అంచనా.. సామాన్యుడి గుండెను గుబేలుమనిపిస్తోంది. లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైన కొన్ని ఆసక్తికర విషయాలు..
🍅 దాదాపు 68 శాతం కుటుంబాలు తమ వంటకంలో టమాట వినియోగాన్ని తగ్గించాయి. మరో 14 శాతం మంది టమాట వినియోగించడాన్ని పూర్తిగా మానేశారు.
🍅 రానున్న వారాల్లో కిలో రూ.300కు చేరుకోవచ్చు. చాలా చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అందుకు కారణం. అదే సమయంలో టమాట సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు రేట్లు ఇంకా పెంచే అవకాశాలూ లేకపోలేదు.
🍅 గత మూడు వారాల్లో రిటైల్ మార్కెట్‌లలోనే కాకుండా హోల్‌సేల్ మార్కెట్‌లలో కూడా టమాటా ధరలు నగరాల్లో భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. ఢిల్లీలో జూన్ 24న కిలో రూ.20 నుండి 30 ఉండగా, ఆ తర్వాత రూ.180కి , ఇప్పుడు నాణ్యమైన టమాటా ధర రూ.220కి చేరుకుంది.
🍅 జూన్‌లో కేజీ రూ.40గా ఉంటే.. జులై మొదటి వారానికి సగటున కేజీ రూ. 100కి చేరింది. భారీ వర్షాలతో సరఫరాకి అంతరాయం.. టమాట పెంపకంలో జాప్యం వల్ల నాణ్యమైన టమాట రూ.200గా పలుకుతోంది.
🍅 వందలో 87 మంది.. కేజీకి రూ. 100కిపైనే ఖర్చు చేస్తున్నారు. 13 శాతం మాత్రమే 100 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడుతున్నారట. బహుశా అవి గ్రామీణ ప్రాంతాలు.. టమాట సమృద్దిగా పండించే ప్రాంతాల్లో కావొచ్చు.
🍅 10, 972 మందిలో 41 శాతం మంది.. 100-150 రూ. మధ్య చెల్లిస్తున్నారట. 27 శాతం 150-200 రూ. కేజీ చెల్లిస్తున్నారట. 14 శాతం 200-250 రూ. మధ్య, ఐదు శాతం 250రూ. దాకా చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.
🍅 11,550 మందిలో 68 శాతం టమాట వాడకం తగ్గించినట్లు చెబుతున్నారు. 14 శాతం ఏకంగా టమాట వాడకమే మానేశారట.
🍅 మొత్తంగా లోకల్‌సర్కిల్స్ సర్వేలో.. దేశవ్యాప్తంగా 342 జిల్లాలకు చెందిన పాతిక వేల మంది దాకా స్పందించారు. ఇందులో 65% పురుషులు, మిగతా శాతం మహిళలు.
🍅 లోకల్ సర్కిల్స్ అనేది ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్. చిరు వ్యాపారాలు నడిపించుకునేవాళ్లను సైతం ఇందులో చేర్చుకుని ప్రభుత్వ విధానాలు, వాటి వల్ల వాళ్లు ఎదుర్కొనే పరిస్థితులపై అభిప్రాయ సేకరణ చేపడతారు. ఇందులో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment