Tomatoes prices
-
200 కేజీల టమాటాల చోరీ
సాక్షి, చైన్నె: తిట్టకుడి మార్కెట్లో 200 కేజీల టమటాలు చోరీకి గురయ్యాయి. బాధిత వ్యాపారులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. వివరాలు.. తంజావూరు జిల్లా తిట్టకుడి మార్కెట్లో పదికి పైగా టమాటా దుకాణాలున్నాయి. శనివారం రాత్రి దుకాణాలను మూసి వేసి ఇళ్లకు వ్యాపారులు వెళ్లారు. ఆదివారం ఉదయం వచ్చి చూడగానే అనేక దుకాణాల తలుపులు పగుల కొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఒక్కో దుకాణంలో 20 కేజీలు చొప్పున 200 కేజీల టమాటాలు చోరీకి గురైనట్లు విచారణలో తేలింది. దీంతో టమాటా దొంగలను పట్టుకునేందుకు ఆ పరిసర్లాలోని నిఘా కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా టమాటా ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం కిలో టమాటా కొన్నిచోట్ల రూ. 170, మరికొన్ని చోట్ల రూ. 200 ధర పలకడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. -
‘అయితే టమాటాలు తినడం మానేయండి’
లక్నో: టమాట ధరల సంక్షోభం దేశం మొత్తం కొనసాగుతోంది. ఎంత రేటు అయినా కొనుక్కునే పరిస్థితి నడుస్తోంది. టమాటల చోరీలంటూ మునుపెన్నడూ లేని ‘చిల్లర’ కథలు చూస్తున్నాం కూడా. ఈ తరుణంలో సోషల్ మీడియాలో మీమ్స్, చర్చలు కొనసాగుతుండగా.. ధరల నియంత్రణకు ప్రభుత్వాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే.. ధరలు పెరిగాయని బాధపడడం ఎందుకని.. సింపుల్‌గా తినడం మానేయాలంటున్నారు ఓ మహిళా మంత్రిగారు. ఉత్తర ప్రదేశ్ మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ మంత్రి ప్రతిభా శుక్లా pratibha shukla ఈ సలహా ఇచ్చారు. టమాటల ధరలు పెరిగాయని మొత్తుకోవడం ఎందుకు అవి తినడం మానేయొచ్చు కదా అని సలహా ఇచ్చారామె. అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతాయని ఊహించారో ఏమో.. వెంటనే సవరించుకుని మరో ప్రకటన ఇచ్చారు. టమాటల రేటు ఎక్కువని ఫీలవ్వడం దేనికి?.. ఇంటి వద్ద పెంచుకునే సరిపోతుంది కదా. యూపీలో అలాంటి ప్రయత్నాలు ప్రభుత్వ సహకారంతో జరుగుతోంది కదా. అసలు టమాటలు తినడం మానేస్తే.. రేట్లు వాటంతట అవే దిగి వస్తాయి కదా. అసలు టమాటలకు బదులు నిమ్మకాయ తింటే పోలా.. దేశంలో ఎవరూ టమాటలు తినకపోతే.. ధరలు ఎందుకు దిగి రావు?.. అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు శుక్లా. ఇదీ చదవండి: ఇదెందయ్యా ఇది.. డ్రైవింగ్‌లో అడ్రస్ మర్చిపోయాడు -
టమాటా చిత్ర కథ: అహ నా టమాటంట
‘చికెన్ తినాలంటే చికెన్ మాత్రమే తిననక్కర్లేదు. గాల్లో వేలాడుతున్న కోడిని చూస్తూ, ఊహించుకుంటూ బ్రహ్మాండంగా తినవచ్చు’ అనే గొప్ప సత్యాన్ని ‘అహ నా పెళ్లంట’ సినిమాలో లక్ష్మీపతి (కోట శ్రీనివాసరావు) జనులకు చెప్పకనే చెప్పారు. ‘ఇప్పుడు ఆ సినిమాని రీమేక్ చేస్తే గాలిలో వేలాడుతున్న కోడికి బదులు టమాటాలు ఉంటాయి’ అని నెటిజనులు ఒకటే జోకులు! ఒక మహిళ దుబాయ్‌కి వెళ్లింది. ఇండియాకు తిరిగి వచ్చే ముందు...‘నీ కోసం ఏం తీసుకురమ్మంటావు?’ అని తల్లిని అడిగింది. ‘బంగారు నగలో, లగ్జరీ గిఫ్టో అడిగి ఉంటుంది’ అని అనుకుంటారు చాలామంది. కానీ ఆ తల్లి బంగారం కంటే విలువైన టమాటాలను అడిగింది. ఒకటి కాదు రెండు కాదు...‘పది కిలోల టమాటాలు తీసుకురామ్మా’ అని కూతురిని అడిగింది. పదికిలోల టమాటాలను పెరల్పెట్ స్టోరేజ్ జార్లలో ప్యాక్ చేసి ఇండియాకు తీసుకువచ్చింది కూతురు. ఈవిడ సోదరి ట్విట్టర్లో షేర్ చేసిన దుబాయ్ టమాటాల స్టోరీ వైరల్ అయింది. ∙∙ బంగారు నగలు అంటే ఎవరికి మాత్రం మక్కువ ఉండదు? అయితే టమాటాలేమో బంగారం కంటే విలువైపోయాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ ‘యూరేకా... టమాటాలతో ఆభరణాలు’ అని అరిచింది. టమాటాలను చెవిరింగులుగా ధరిస్తూ ‘న్యూ గోల్డ్’ కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేసింది. ∙∙ శిల్పాశెట్టి షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ 11 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక వీడియో విషయానికి వస్తే... టమాటాల కోసం సూపర్‌మార్కెట్‌కు వెళుతుంది శెట్టి. టమాటాలన్నీ కూడబలుక్కొని ‘టచ్‌మీ నాట్’ అన్నట్లుగా చూస్తుంటాయి. టమాటాలను చేతిలో తీసుకున్న ప్రతిసారీ ఆమె నటించిన ‘దడ్కన్’ సినిమాలోని ‘ఖబడ్దార్. హౌ డేర్ యూ’ అనే డైలాగ్ ప్లే అవుతుంటుంది! -
Tomato Prices: టమాట కేజీ రూ. 300?
నెలన్నర గ్యాప్‌లో టమాటా ధర 300 శాతానికి పైగా పెరిగాయి. కొన్నిచోట్ల సెంచరీకి పైనే.. మరికొన్ని చోట్ల డబుల్ సెంచరీ చేరువకి.. కొన్ని చోట్ల 220 దాకా కూడా పలుకుతోంది. ఈ తరుణంలో టమాట కేజీ 300 రూపాయలకు చేరుతుందనే అంచనా.. సామాన్యుడి గుండెను గుబేలుమనిపిస్తోంది. లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైన కొన్ని ఆసక్తికర విషయాలు.. 🍅 దాదాపు 68 శాతం కుటుంబాలు తమ వంటకంలో టమాట వినియోగాన్ని తగ్గించాయి. మరో 14 శాతం మంది టమాట వినియోగించడాన్ని పూర్తిగా మానేశారు. 🍅 రానున్న వారాల్లో కిలో రూ.300కు చేరుకోవచ్చు. చాలా చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అందుకు కారణం. అదే సమయంలో టమాట సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు రేట్లు ఇంకా పెంచే అవకాశాలూ లేకపోలేదు. 🍅 గత మూడు వారాల్లో రిటైల్ మార్కెట్లలోనే కాకుండా హోల్‌సేల్ మార్కెట్లలో కూడా టమాటా ధరలు నగరాల్లో భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. ఢిల్లీలో జూన్ 24న కిలో రూ.20 నుండి 30 ఉండగా, ఆ తర్వాత రూ.180కి , ఇప్పుడు నాణ్యమైన టమాటా ధర రూ.220కి చేరుకుంది. 🍅 జూన్‌లో కేజీ రూ.40గా ఉంటే.. జులై మొదటి వారానికి సగటున కేజీ రూ. 100కి చేరింది. భారీ వర్షాలతో సరఫరాకి అంతరాయం.. టమాట పెంపకంలో జాప్యం వల్ల నాణ్యమైన టమాట రూ.200గా పలుకుతోంది. 🍅 వందలో 87 మంది.. కేజీకి రూ. 100కిపైనే ఖర్చు చేస్తున్నారు. 13 శాతం మాత్రమే 100 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడుతున్నారట. బహుశా అవి గ్రామీణ ప్రాంతాలు.. టమాట సమృద్దిగా పండించే ప్రాంతాల్లో కావొచ్చు. 🍅 10, 972 మందిలో 41 శాతం మంది.. 100-150 రూ. మధ్య చెల్లిస్తున్నారట. 27 శాతం 150-200 రూ. కేజీ చెల్లిస్తున్నారట. 14 శాతం 200-250 రూ. మధ్య, ఐదు శాతం 250రూ. దాకా చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. 🍅 11,550 మందిలో 68 శాతం టమాట వాడకం తగ్గించినట్లు చెబుతున్నారు. 14 శాతం ఏకంగా టమాట వాడకమే మానేశారట. 🍅 మొత్తంగా లోకల్‌సర్కిల్స్ సర్వేలో.. దేశవ్యాప్తంగా 342 జిల్లాలకు చెందిన పాతిక వేల మంది దాకా స్పందించారు. ఇందులో 65% పురుషులు, మిగతా శాతం మహిళలు. 🍅 లోకల్ సర్కిల్స్ అనేది ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్. చిరు వ్యాపారాలు నడిపించుకునేవాళ్లను సైతం ఇందులో చేర్చుకుని ప్రభుత్వ విధానాలు, వాటి వల్ల వాళ్లు ఎదుర్కొనే పరిస్థితులపై అభిప్రాయ సేకరణ చేపడతారు. ఇందులో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. -
కిలో టమాటా రూ.22: అమాంతం పెరిగిన ధర
మదనపల్లె: నిన్న మొన్నటిదాకా రూ.6 నుంచి రూ.16 వరకు పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా రూ.22కు చేరుకున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె టమాటా మార్కెట్లో శుక్రవారం మొదటిరకం టమాటా కిలో రూ.15 నుంచి రూ.22 మధ్య ధర పలికింది. రెండోరకం టమాటా రూ.8 నుంచి రూ.14.60 వరకు నమోదైంది. అయితే నిన్నటివరకు మార్కెట్‌కు 1,120 నుంచి 1,646 మెట్రిక్ టన్నుల వరకు వచ్చిన టమాటా ఒక్కసారిగా 470 మెట్రిక్ టన్నులకు పడిపోయింది. రెండురోజులుగా మదనపల్లె డివిజన్లో వర్షాలు కురుస్తుండటం, పొలాల్లో నీళ్లు నిలవడం కాయలు కోసేందుకు ఇబ్బందిగా మారింది. పంట బాగా దెబ్బతినడం, కొద్దోగొప్పో వస్తున్న పంట నాణ్యత ఆశించిన స్థాయిలో లేకపోవడం, కాయపై మచ్చలు, పగుళ్లు రావడంతో మార్కెట్‌కు వచ్చే టమాటా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు పలికిన టమాటా ధరల్లో రూ.22 అత్యధికం కావడం, తక్కువస్థాయిలో దిగుబడులు రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం టమాటాకు లభిస్తున్న ధరతో రైతు సంతృప్తిగా ఉన్నప్పటికీ దిగుబడులు తగ్గుతుండటంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. -
టమాటాల చోరీ..!
సాక్షి, ముంబై: వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ దొంగతనం నిజంగానే జరిగింది. టమాటాల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో దొంగల కన్ను ఇప్పుడు టమాటాలపై పడింది. హోల్‌సేల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటున్న దుండగులు ట్రక్కులు తీసుకొచ్చి మరీ టామాటాల పెట్టెలను ఎత్తుకెళ్తున్నారు. తీరా వాటిని రిటెయిల్ మార్కెట్లో బయటికంటే తక్కువ ధరకు అమ్మేసి.. సొమ్ము చేసుకుంటున్నారు. శనివారం తెల్లవారు జామున మీరారోడ్డులోని కాశీగావ్ హోల్‌సేల్ మార్కెట్లో సుమారు 720 కిలోల టమాటాలు చోరీకి గురయ్యాయి. వివరాల్లోకెళ్తే... హోల్‌సేల్ వ్యాపారి అశోక్‌కుమార్ ప్రజాపతి కిలో రూ. 60 ధరతో కొనుక్కొచ్చిన టమాటాలను పెట్టెల్లో నింపి హోల్‌సేల్‌గా విక్రయించేందుకు సిద్ధంగా ఉంచాడు. యజమాని లేని సమయం చూసి దుండగులు ట్రక్కు వేసుకొని వచ్చి క్షణాల్లో పెట్టెలను అందులోకి ఎక్కించుకొని పరారయ్యారు. దీనిని పలువురు చూసినా కొనుగోలు చేసినవారే వాటిని తీసుకెళ్తున్నారమోనని భావించారు. తీరా ప్రజాపతి అక్కడికి వచ్చి చూస్తే కనీసం ఒక్క పెట్టె కూడా కనిపించలేదు. గత 12 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నానని, ఏ ఒక్కరోజు కూడా ఇలా జరగలేదని వాపోయాడు. టమాటాలను గుర్తించకున్నా వాటిని నింపిన పెట్టెలను గుర్తుపట్టగలననే నమ్మకంతో సమీపంలోని రిటెయిల్ మార్కెట్లలో వెతికాడు. దీంతో దహిసర్‌లోని రావల్పాడా మార్కెట్లో తన టమాటాలను గుర్తుతెలియని వ్యక్తులు విక్రయించినట్లు గుర్తించాడు. వెంటనే కాశీమీరా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీని యన్ పోలీస్ ఇన్స్పెక్టర్ అనిల్ కదమ్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున ఒంటి గంట ప్రాంతంలో చోటుసుకుందని చెప్పారు. అక్కడ 24 పెట్టెల్లో టమాటాలు ఉన్నాయనీ, ప్రతి పెట్టెలో 30 కిలోల టమాటలు ఉన్నాయనిచెప్పారు. చోరీకి గురైన టమాటాల విలువ సుమారు రూ. 60 వేల వరకు ఉంటుందన్నారు. ఇక్కడి నుంచి వాటిని ఎత్తుకెళ్లిన దుండగులు ఒక్కో పెట్టెను రూ. 500 నుంచి రూ. 600 వరకు విక్రయిం చిన ట్లు దర్యాప్తులో తేలిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.