
టమాట ధరలు పెరుగుతున్నాయని బాధపడుతున్నారా? అయితే..
లక్నో: టమాట ధరల సంక్షోభం దేశం మొత్తం కొనసాగుతోంది. ఎంత రేటు అయినా కొనుక్కునే పరిస్థితి నడుస్తోంది. టమాటల చోరీలంటూ మునుపెన్నడూ లేని ‘చిల్లర’ కథలు చూస్తున్నాం కూడా. ఈ తరుణంలో సోషల్ మీడియాలో మీమ్స్, చర్చలు కొనసాగుతుండగా.. ధరల నియంత్రణకు ప్రభుత్వాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే.. ధరలు పెరిగాయని బాధపడడం ఎందుకని.. సింపుల్‌గా తినడం మానేయాలంటున్నారు ఓ మహిళా మంత్రిగారు.
ఉత్తర ప్రదేశ్ మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ మంత్రి ప్రతిభా శుక్లా pratibha shukla ఈ సలహా ఇచ్చారు. టమాటల ధరలు పెరిగాయని మొత్తుకోవడం ఎందుకు అవి తినడం మానేయొచ్చు కదా అని సలహా ఇచ్చారామె. అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతాయని ఊహించారో ఏమో.. వెంటనే సవరించుకుని మరో ప్రకటన ఇచ్చారు.
టమాటల రేటు ఎక్కువని ఫీలవ్వడం దేనికి?.. ఇంటి వద్ద పెంచుకునే సరిపోతుంది కదా. యూపీలో అలాంటి ప్రయత్నాలు ప్రభుత్వ సహకారంతో జరుగుతోంది కదా. అసలు టమాటలు తినడం మానేస్తే.. రేట్లు వాటంతట అవే దిగి వస్తాయి కదా. అసలు టమాటలకు బదులు నిమ్మకాయ తింటే పోలా.. దేశంలో ఎవరూ టమాటలు తినకపోతే.. ధరలు ఎందుకు దిగి రావు?.. అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు శుక్లా.
ఇదీ చదవండి: ఇదెందయ్యా ఇది.. డ్రైవింగ్‌లో అడ్రస్ మర్చిపోయాడు