‘ప్రియ’మైన టమాటో
అమాంతం పెరిగిన ధర
కొనుగోలు చేయలేకపోతున్న సామాన్యులు
పార్వతీపురం: టమాటో ధరపైపెకి ఎగబాకుతోంది. ప్రస్తుతం కిలో టమాటో హోల్‌సేల్‌గా రూ.80కు లభిస్తుండగా, రిటైల్‌గా రూ.100కు విక్రయిస్తున్నారు. పల్లెల్లో రూ.110నుంచి రూ.120 వరకూ వర్తకులు అమ్ముతున్నారు. కొద్ది రోజుల నుంచి టమాటో ధర కిలో రూ.40లోపు ఉండగా ఒక్కసారిగా పెరిగింది.
దీంతో సాధారణ కుటుంబాలు ప్రస్తుతం టమాటోను కొనలేని పరిస్థితి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే ఆస్కారముందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి తీవ్రత దృష్ట్యా పంట దిగుబడులు తీవ్రంగా తగ్గిపోవడంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి కాకపోవడంవల్ల ధరలు పెరుగుతున్నాయని వర్తకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment