
సాక్షి, హైదరాబాద్: టమాటా ధర మోతెక్కుతోంది. కొందరు దుకాణాదారులు కిలో రూ.60కిపైగా అమ్ముతుండగా, ఇంకొందరు రూ.50కి విక్రయిస్తున్నారు. రైతుబజార్లలో రూ.45 చొప్పున అమ్ముతున్నారు. కాలనీల్లోని చిల్లర వ్యాపారుల సంగతి చెప్పనవసరమే లేదు. ధరల పెరుగుదలకు ప్రధానం ఇటీవల కురుస్తున్న వర్షాలే కారణమని తెలుస్తోంది. పంట నష్టంతో దిగుబడులు తగ్గడంతో హైదరాబాద్ నగరానికి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి దిగుమతి అవుతున్నాయి.
ధరలు పెరిగేందుకు ఇదే ప్రధాన కారణమని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. నగరానికి అవసరమైన 60 శాతం బయట నుంచే వస్తుండగా.. మిగతా 40 శాతమే మన రాష్ట్రంలో లభ్యమవుతోంది. వర్షాలు పడడంతో అమాంతం 15 శాతానికి సరఫరా పడిపోయింది. దీంతో 85 శాతం వరకు ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తిందని వ్యాపారులు అంటున్నారు. బీన్స్, బీరకాయ, బెండ ధరలు కూడా పెరిగాయి. (చదవండి: భయం తగ్గింది.. మాస్కులేసుకోవడం మానేశారు)
Comments
Please login to add a commentAdd a comment