Vegitables prices
-
ఇంటి భోజనం.. భారం!
కూరగాయలు, ఇతర వంట సామాగ్రి ధరలు పెరుగుతుండడంతో ఇంటి భోజనం ఖర్చులు అధికమైనట్లు క్రిసిల్ నివేదిక వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈసారి అదే నెలలో భోజనం ఖర్చులు పెరిగాయని తెలిపింది. అందుకు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టమాటా వంటి కూరగాయల ధరలు పెరగడం కారణమని క్రిసిల్ ‘రోటి రైస్ రేట్’ నివేదికలో పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..గతేడాది సెప్టెంబరులో శాకాహార భోజనం తయారీ ఖర్చు రూ.28.10గా ఉండేది. అది ఈ ఏడాది అదే నెలలో 11% పెరిగి రూ.31.30కు చేరింది. శాకాహార భోజనం ఖర్చులో 37% వాటా ఉన్న కూరగాయల ధరలు పెరగడం ఇందుకు కారణం. ఏడాదిక్రితంతో పోలిస్తే ఉల్లిపాయల ధర 53%, బంగాళాదుంపలు 50%, టమాటా ధర 18% పెరిగాయి. ఉల్లి, బంగాళాదుంపల సరఫరా తగ్గడం వల్ల వీటి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో టమాటా అధికంగా పండిస్తారు. కానీ ఈసారి అధిక వర్షాల కారణంగా పంట తీవ్రంగా దెబ్బతింది. దాంతో ధరలు పెరుగుతున్నాయి. ఉత్పత్తి తగ్గడంతో పప్పుల ధరలు కూడా 14% పెరిగాయి. అయితే వంట గ్యాస్ ఖర్చులు 11% తగ్గాయి. మాంసాహార భోజనం తయారీ ఖర్చు 2% తగ్గి రూ.59.30కు పరిమితమైంది. మాంసాహార భోజనం ఖర్చులో 50% వాటా ఉండే బ్రాయిలర్ చికెన్ ధర 14% తగ్గడం ఇందుకు దోహదం చేసింది. అయితే ఆగస్టుతో పోలిస్తే మాంసాహార భోజనం ధర సెప్టెంబర్‌లో పెద్దగా ప్రభావం చెందలేదు.ఇదీ చదవండి: ఇండియా పోస్ట్, అమెజాన్ జతఉల్లి ఎగుమతులకు కేంద్రం అనుమతులివ్వడంతో ధరలు దిగిరావడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొందరు వ్యాపారులు అక్రమ నిల్వలు పెంచుకుంటూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని చెప్పారు. ఫలితంగా ఉల్లి ధరలు అధికమవుతున్నాయని తెలిపారు. ఇటీవల వంటనూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయిం తీసుకున్న విషయం తెలిసిందే. దేశంలో ముడి పామాయిల్, సోయానూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను వసూలు చేస్తుండడంతో గతంలో ఉన్న దిగుమతి సుంకం 5.5 శాతాన్ని 27.5 శాతానికి పెంచారు. రిఫైన్డ్ పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75% సుంకాన్ని 35.75%కు మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫలితంగా వంట నూనెల ధరలు పెరిగాయి. చాలా కంపెనీలు అప్పటికే తక్కువ ధరకు దిగుమతి చేసుకున్నాయి. దానిపై అధిక ధర వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కొన్ని సంస్థలు వాటిని బేఖాతరు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ వర్గాలు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
టమాటా.. ఊరట! ఈ రోజు ధర ఎంతంటే..
సీతమ్మధార (విశాఖ ఉత్తర): గత కొద్ది రోజులుగా రైతుబజారుల్లో టమాటా ఠారెత్తించింది. వినియోగదారులకు చుక్కలు చూపించిన టమాటా శనివారం దిగొచ్చింది. నెల రోజుల నుంచి రూ.72 పలికిన ధర శనివారం రూ.38కి లభ్యమైంది. దీంతో వినియోగదారులు అధిక సంఖ్యలో వచ్చి కోనుగోలు చేశారు. బీరకాయలు కిలో రూ.48 ఉండగా, రూ.44కు తగ్గింది. బంగాళా దుంపలు కిలో రూ.21 ఉండగా రూ.19కి దిగి వచ్చింది. క్యాబేజి మీద రెండు రూపాయలు తగ్గింది. ధరలు తగ్గడంతో శనివారం ఎక్కువ మంది వినియోగదారులు వచ్చారని రైతు బజార్ ఎస్టేట్ అధికారి వరహాలు తెలిపారు. చదవండి: Visakhapatnam: పాడి గేదె పంచాయితీ.. ప్రాణం తీసిన క్షణికావేశం! -
టమాటా ధర.. మళ్లీ కొండెక్కింది.. కిలో ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: టమాటా ధర మోతెక్కుతోంది. కొందరు దుకాణాదారులు కిలో రూ.60కిపైగా అమ్ముతుండగా, ఇంకొందరు రూ.50కి విక్రయిస్తున్నారు. రైతుబజార్లలో రూ.45 చొప్పున అమ్ముతున్నారు. కాలనీల్లోని చిల్లర వ్యాపారుల సంగతి చెప్పనవసరమే లేదు. ధరల పెరుగుదలకు ప్రధానం ఇటీవల కురుస్తున్న వర్షాలే కారణమని తెలుస్తోంది. పంట నష్టంతో దిగుబడులు తగ్గడంతో హైదరాబాద్ నగరానికి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి దిగుమతి అవుతున్నాయి. ధరలు పెరిగేందుకు ఇదే ప్రధాన కారణమని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. నగరానికి అవసరమైన 60 శాతం బయట నుంచే వస్తుండగా.. మిగతా 40 శాతమే మన రాష్ట్రంలో లభ్యమవుతోంది. వర్షాలు పడడంతో అమాంతం 15 శాతానికి సరఫరా పడిపోయింది. దీంతో 85 శాతం వరకు ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తిందని వ్యాపారులు అంటున్నారు. బీన్స్, బీరకాయ, బెండ ధరలు కూడా పెరిగాయి. (చదవండి: భయం తగ్గింది.. మాస్కులేసుకోవడం మానేశారు) -
Heavy Rain: ఆకాశాన్నంటిన ఆకుకూరల ధరలు
సాక్షి, హైదరాబాద్: అనుకున్న స్థాయిలో కంటే ఎక్కువగా వర్షాలు కురవడం..కరోనా నేపథ్యంలో డిమాండ్ పెరగడం..డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేకపోవడంతో నగరంలో ఆకు కూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వర్షాల కారణంగా శివారు జిల్లాల్లో సాగుచేసిన ఆకుకూరల పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడి పడిపోయింది. సాధారణంగా వేసవిలో మాత్రమే ఆకు కూరల ధరలు పెరుగుతుంటాయి. కానీ ఈసారి వర్షాకాలంలోనూ ఆకుకూరలు పిరమయ్యాయి. పాలకూర గతంలో రూ.10కి ఐదు నుంచి ఆరు కట్టలు ఇచ్చేవారు. ప్రస్తుతం రెండు కట్టలకు మించి ఇవ్వడం లేదు. అలాగే మెంతి, చుక్కకూర, కొత్తిమీర, పుదీనాలది సైతం ఇదే పరిస్థితి. కరోనా కాలంలో ఆకుకూరల వినియోగం పెరిగినా అనుకున్న స్థాయిలో దిగుబడి లేదని వ్యాపారులు అంటున్నారు. ► మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ఈ సీజన్లో కూరగాయలు, ఆకు కూరల దిగుబడి పడిపోయింది. ► సాధారణ రోజుల్లో ఒక మార్కెట్‌కు వంద మందికి పైగా వచ్చే ఆకుకూరల రైతుల సంఖ్య..ప్రస్తుతం 30కి మించడం లేదు. దీంతో ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ► ఇక అన్ని కూరల్లో వినియోగించే కొత్తిమీర ధర మరీ మండిపోతోంది. కొన్నిచోట్ల రూ.10కి ఒక్క కట్ట కూడా ఇవ్వడం లేదు. చదవండి: ఆర్ఎంపీ డాక్టర్.. విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి.. -
బాబోయ్ ధరలు... ఫిర్యాదుల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసరాల ధరల పెరుగుదలపై పౌర సరఫరాల శాఖకు ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా కూరగాయలు, పప్పుల ధరలు పెంచేస్తున్నారంటూ వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. గురువారం ఒక్కరోజే ఇలాంటివి నాలుగు వందల వరకు వచ్చాయి. వీటితో పాటే రేషన్ బియ్యం సరఫరా, ప్రభుత్వం ప్రకటించిన రూ.1,500 సాయం ఎప్పటిలోగా వేస్తారన్న అంశాలపైనా అధికంగా ఫోన్లు చేశారు. రేషన్ వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు పౌర సరఫరాలశాఖ 1967, 180042500333 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు 7330774444 వాట్సాప్ నంబర్, 040–23447770 ల్యాండ్‌లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. అధిక ధరలకు నిత్యావసరాలు విక్రయించారన్న ఫిర్యాదులను వాటికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ఈ నంబర్లకు ఉదయం 10 గంటల నుంచే ఫోన్లు మొదలయ్యాయని వినియోగదారుల ఫోరం డైరెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఇక ఫిర్యాదులను క్రోడీకరించి జిల్లాల వారీగా విభజించి ఆయా జిల్లా అధికారుల పరిశీలనకు పంపారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. -
కరోనా: కిలో టమాటా రూ.100
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్ -19 ( కరోనా వైరస్ ) వ్యాప్తి నివారణ కోసం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. ఇదే అదనుగా సామాన్యులను కూరగాయల వ్యాపారులు నిలుపు దోపిడి చేస్తున్నారు. జనతా కర్ఫ్యూతో నిన్నంతా ఇళ్లలో ఉన్న జనాలు... సోమవారం నిత్యావసరాలు, కూరగాయలు కొనేందుకు పెద్ద ఎత్తున సూపర్ మార్కెట్లు, రైతు బజార్లుకు చేరుకున్నారు. దీంతో నగరంలోని పలు రైతు బజార్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. సందట్లో సడేమియా అన్నట్లు వ్యాపారస్తులు ....కూరగాయల్ని అధిక ధరలకు అమ్ముతున్నారు. దీంతో వ్యాపారులపై కొనుగోలుదారులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కొనుగోలుదారులు వాపోతున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలకు నిత్యావసర సరుకులన్నీ, కూరగాయలు అందుబాటులోనే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇచ్చినా.. అధిక ధరల వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని ప్రజలు మండిపడుతున్నారు. సాధారణ రోజుల కంటే రెండింతల ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. మార్కెట్ అధికారులు చేతులెత్తేయడంతో వ్యాపారులకు, ప్రజలకు మధ్య వాగ్వాదం నెలకొంది. దాదాపు అన్ని కూరగాయల రేట్లు ఇలానే ఉన్నాయి. నగరంలోని గుడిమల్కాపూర్ , మోహదీపట్నం వ్యవసాయ మార్కెట్లో కూడా కూరగాయల ధరలు ఆకాశనంటుతున్నాయి. కూరగాయలు పాత ధర ప్రస్తుతం ధర టమాట(కిలో) రూ. 8 రూ. 100 వంకాయ( కిలో) రూ. 15 రూ. 80 మిర్చి రూ. 25 రూ. 90 క్యారెట్( కిలో) రూ.25 రూ. 80 క్యాప్సికం (కిలో) రూ. 30 రూ. 80 కాకరకాయ (కిలో) రూ. 25 రూ. 80 అదేవిధంగా నల్లగొండలోని కూరగాయల మార్కెట్ కూడా జనంతో కిక్కిరిసిపోయింది. లాక్డౌన్ రూల్స్‌ను పాటించకుండా ప్రజలు పెద్దఎత్తున మార్కెట్‌కి తరలివచ్చారు. ఇలా అయితే కోరోనా నివారణ ఎలా సాధ్యమవుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కూరగాయల ధరలు కూడా అధికంగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. నిజామాబాద్: జనాలతో నిజామాబాద్ కూరగాయల మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. కూరగాయ ధరలు ఆకాశాన్నంటాయి. వినియోగదారుల అవసరాలను వ్యాపారలు సొమ్ము చేసుకుంటున్నారు. రెండింతలు, మూడింతలు అధిక ధరలతో కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులుపై వినియోగదారుల మండిపడుతున్నారు. ప్రభుత్వం ధరలను అదుపు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు
-
ఉల్లి, ఆలూ ధరలు ప్రియం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జనవరి గణాంకాలు ఒకవైపు ఆహార ధరల తీవ్రతను, మరోవైపు కీలక తయారీ రంగంలో మందగమనాన్ని సూచించాయి. 2020 జనవరిలో సూచీ రేటు మొత్తంగా 3.1 శాతంగా నమోదయితే, ఒక్క తయారీ రంగంలో ధరల పెరుగుదల రేటు 0.34 శాతంగా ఉంది. కాగా 2019 జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.76 శాతం. ఇక 2019 ఏప్రిల్‌లో 3.18 శాతం టోకు ద్రవ్యోల్బణం నమోదయిన తర్వాత, మళ్లీ ఆ స్థాయి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. శుక్రవారం విడుదలైన ఈ గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 10.01 శాతంగా ఉంది. అంటే 2019 జనవరితో (అప్పట్లో 3 శాతం) పోల్చితే ఈ బాస్కెట్ మొత్తం ధర 10.01 శాతం పెరిగిందన్నమాట. ఇక ఇందులో ఒకటైన ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ధర 2.41 శాతం (2019 జనవరిలో) నుంచి 11.51 శాతానికి పెరిగింది. సామాన్యునిపై నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని ఈ రేటు సూచిస్తోంది. నాన్ ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం రేటు 2.32% నుంచి 7.05 శాతానికి ఎగసింది. ♦ ఫ్యూయల్ అండ్ పవర్: మొత్తం సూచీలో దాదాపు 13 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 1.85 శాతం నుంచి 3.42 శాతానికి పెరిగింది. ♦ తయారీ ఉత్పత్తులు: ఐఐపీలో దాదాపు 64 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగ ఉత్పత్తుల్లో ద్రవ్యోల్బణం రేటు 2.79 శాతం నుంచి 0.34 శాతానికి దిగింది. ఆర్థిక వ్యవస్థలో మందగమన ధోరణిని సూచిస్తున్న అంశమిది. కూరగాయల ధరలు 53 శాతం అప్... కూరగాయల ధరలు భారీగా 52.72 శాతం పెరిగాయి. ఉల్లిపాయల ధరలు 293 శాతం ఎగశాయి. ఆలూ ధరలు 87.84 శాతం ఎగశాయి. ఈ వారం మొదట్లో వెలువడిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణ 6 సంవత్సరాల గరిష్టస్థాయిలో 7.59 శాతంగా నమోదవడం తెలిసిందే. -
ట‘మోత’ కేజీ రూ. 80
న్యూఢిల్లీ : కూరగాయల ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎండకాలంలో ఠారెత్తించిన కూరగాయల ధరలు.. వర్షకాలం ప్రారంభమైన తగ్గడం లేదు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధరలు సాధరణం కంటే మూడింతలు పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులు టమాటా కొనాలంటే భయపడిపోతున్నారు. వారం క్రితం కిలో 20 నుంచి 30 రూపాయలు పలికింది. అయితే ఉన్నట్టుండి టమాటా ధర 60 నుంచి 80 రూపాయలకు చేరింది. ఈ ధర రూ. 100కు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పహర్‌గంజ్ మండి వ్యాపారులు తెలిపారు. అలాగే బెండకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. వర్షకాలం తరువాతే కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టు వారు అంచనా వేస్తున్నారు. -
మండుతున్న కూరగాయల ధరలు
-
కూర భారమే..!
సాక్షి, సిటీబ్యూరో: మార్కెట్లో కూరగాయల ధరలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మే ప్రారంభంలో నిలకడగా ఉన్న కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరగడంతో పేద ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వేసవి ప్రారంభం నుంచి నిలకడగా ఉన్న కూరగాయల ధరలు మే నెల ప్రారంభంతోనే ఒకేసారి ధరలు భగ్గుమంటున్నాయి. మేలోనే ధరలు ఈ స్థాయిలో పెరిగితే ఇక వచ్చే జూన్ , జూలై నెలలో ధరలు ఆకాశాన్నంటనున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. టమాటా తప్ప అన్ని రకాల కూరగాయలు ధరలు రైతు బజార్లతో పాటు బహిరంగ మార్కెట్లలో కిలో రూ. 60 దాటాయి. మార్కెటింగ్ శాఖ అధికారులు ధరల నియత్రించడానికి ఎన్ని చర్యలు తీసుకున్నా ధరలు మాత్రం రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయని వినియోగదారలు చెబుతున్నారు. గ్రేటర్‌కు రోజు 3 వేల టన్నులకూరగాయలు గ్రేటర్ హైదరాబాద్ నగర జనాభా దాదాపు కోటి మంది. వీరికి ప్రతి రోజూ దాదాపు 3 వేల టన్నుల వివిధ రకాల కూరగాయలు అవసరం. ప్రతి ఒక్కరూ 300 గ్రాములు వినియోగిస్తున్నారు. వేసవి ఆఫ్ సీజన్లో నగర ప్రజల 70 శాతం కూరగాయల అవసరాలు ఇతర రాష్ట్రాలతో పూర్తి అవుతాయి. సీజన్లో స్థానికంగా కూరగాయల దిగుబడి ఎక్కువ ఉండడంతో ధరలు తక్కువగా ఉన్నాయి.ప్రస్తుతం ఆఫ్సీజన్ కావడంతో కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు అవడంతో ధరలు రోజు రోజుకూ విపరితంగా పెరుగుతున్నాయి, ఆఫ్ సీజన్ ఏజెంట్లకు పండగ ఆఫ్ సీజన్లో స్థానికంగా కూరగాయల దిగుమతులు ఎక్కువగా ఉండవు. దీంతో కమీషన్ ఏజెంట్లు ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్‌కు కూరగాయలు తెప్పిస్తారు. దీంతో వారు నిర్ణయించిన ధరలకు కొనాల్సి ఉంటుంది. దీంతో ధరలు విపరీతంగా పెరుగుతాయి. నిల్వకు ప్రత్యామ్నాయం లేదు.. సీజన్లో కూరగాయలు ఎక్కువ దిగుబడి అయితే వాటిని నిలువ చేసి అఫ్సీజన్లో ధరలు నిలకడగా ఉంచడానికి మర్కెటింగ్, హార్టికర్చర్ శాఖ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. మార్కెటింగ్ శాఖ ద్వారా కూరగాయల రేట్ల నిర్ధారణ లేదు. ఆఫ్ సీజన్లో మార్కెటింగ్ శాఖ ద్వారా కాకుండా ఏజెంట్లు రాష్ట్రంలో అందుబాటులో లేని కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేస్తారు. ఏజెంట్లు నిర్ధారించిన ధరల్లోనే ఆఫ్ సీజన్లో కూరగాయలు అందుబాటులో ఉంటాయి. నగర శివారు నుంచి తగ్గిన దిగుమతులు ఈ ఏడాది నగర శివారు జిల్లాలైన వికారబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ రైతులు కూరగాయలు పండించటంతో ఎక్కువ దిగుమతి అయ్యాయి. దీంతో కూరగాయల ధరలు మే వరకు ధరలు తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కూరగాయలు దిగుమతులు ఎక్కువగా ఉండడంతో ధరలు ఎక్కువగా పెరగలేదు. దీంతో మే నెల కంటే ముందు వరకు కూరగాయల ధరలు కిలో రూ. 30 నుంచి రూ. 40 వరకు రైతుబజార్లలో ధరలు ఉన్నాయి. మార్కెట్లో ధరలిలా.. టమోటా కిలో రూ. 40 వంకాయ రూ. 30, బెండ రూ.50, పచ్చిమిర్చి రూ.60, కాకరకాయ రూ.50, బీర రూ.60, క్యాలిఫ్లవర్ రూ.50, క్యాబేజీ రూ.30, క్యారెట్ రూ.40, దొండ రూ.40, ఆలుగడ్డ రూ.35, గోకర రూ.50, దోస రూ.40, సొరకాయ రూ.40, పొట్లకాయ రూ. 40, చిక్కుడు రూ.80, అర్వి రూ.50, చిలుకడ దుంప రూ.50, బీట్రూట్ రూ.30, కీర రూ.50, బీన్స్ రూ.80, క్యాప్సికమ్ రూ.40 డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేదు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు ఆలస్యంగా పెరిగాయి. ఏటా మే నుంచి జూలై వరకు «కూరగాయల ధరలు పెరుగురుతాయి. స్థానికంగా దిగుమతులు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి కావడంతో ధరల ప్రభావం ఉంటుంది.డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. – కే.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గుడిమల్కాపూర్ మార్కెట్ -
ఠారెత్తిస్తున్న టమాటా
సాక్షి, సిటీబ్యూరో: ట‘మోత’ మోగుతోంది. రెండు వారాల క్రితం కిలో రూ.15 పలికిన టమాటా... ప్రస్తుతం రూ.40కి చేరింది. ఇదే వరుసలో మిగతా కూరగాయల ధరలు సైతం భారీగా ఉన్నాయి. ఎండలు మండిపోతుండడం, నీటి కొరతతో ఉత్పత్తి పడిపోవడంతో నగరానికి దిగుమతులు తగ్గాయి. గుడిమల్కాపూర్, ఎల్బీనగర్, బోయిన్పల్లి, మోండా తదితర ప్రధాన మార్కెట్లతో పాటు రైతుబజార్లకు కూరగాయల సరఫరా తగ్గింది. వేసవి దృష్ట్యా నగర సమీప జిల్లా్లల్లో నీటి కొరతతో పంట దిగుబడి పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈసారి దిగుమతులు బాగా తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ఇష్టానుసారంగా టమాటా ధరలు పెంచేశారు. దుకాణాదారులు కిలో రూ.30 నుంచి రూ.40కి విక్రయిస్తున్నారు. రైతుబజార్లలోనూ కిలో రూ.38 చొప్పున అమ్ముతున్నారు. ఇక కాలనీల్లోని చిరు వ్యాపారుల సంగతి చెప్పనక్కర్లేదు. హైబ్రిడ్ టమాటా కిలో రూ.45–48, దేశీ టమాటా రూ.35–40 చొప్పున విక్రయిస్తున్నారు. మార్చి చివరి వారంలో కిలో రూ.10–15, ఏప్రిల్ తొలి వారంలో రూ.15–18 మధ్య ఉన్న ధరలు ఒక్కసారిగా ఇంత మొత్తంలో పెరగడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50–60 లారీలే... నగరానికి ప్రధానంగా మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేటతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచే అధికంగా కూరగాయలు దిగుమతి అవుతాయి. ఈ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా, క్యాప్సికం, ఆలు, పచ్చి మిర్చి, బీర్నీస్ తదితర ఉత్పత్తుల దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఆయా ప్రాంతాల్లోనూ ఉత్పత్తి తగ్గిపోయిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. రెండు వారాల క్రితం నగరానికి 100–150 లారీల టమాటా దిగుమతి అయితే... ప్రస్తుతం 50–60 లారీలే వస్తోందని తెలిపారు. ఇక బీర్నీస్, గోకరకాయ, పచ్చిమిర్చి, వంకాయ, క్యారెట్, చిక్కుడు తదితర కూరగాయల ధరలు కూడా రెట్టింపయ్యాయి. జూన్ వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరికొన్ని రోజులైతే కూరగాయలకు పక్క రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కూరగాయల ధరలు ఇలా.. (కిలోకు రూ.ల్లో) -
కూర భారం !
సాక్షి సిటీబ్యూరో: మార్కెట్లో కూరగాయల ధరలు నానాటికి పెరుగుతుండడంతో సామన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల ప్రారంభంలో నిలకడగా ఉన్న కూరగాయల ధరలు ఒక్కసారి పెరగడంతో పేదలు బెంబేలెత్తిపోతున్నారు. వేసవి ప్రారంభం నుంచి నిలకడగా ఉన్న కూరగాయల ధరలు ఏప్రెల్ ప్రారంభంలోనే అమాంతంగా పెరిగాయి. దీంతో వచ్చే మే, జూన్ , జూలై నెలల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. టమాటా మినహా మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు ధరలు పెరిగాయి. రైతుబజార్లతో పాటు బహిరంగ మార్కెట్లలో కిలో రూ. 60 దాటాయి. ధరల నియంత్రణకు మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నా సరఫరా తక్కువగా ఉండటంతో సత్ఫలితాలివ్వడం లేదు. శివార్ల నుంచి తగ్గిన దిగుమతులు ఈ ఏడాది నగర శివారు జిల్లాలైన వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూరగాయాల సాగు చేపట్టడంతో నగరానికి పెద్దమొత్తంలో రవాణా జరిగింది. దీంతో గత మార్చి వరకు కూరగాయాల ధరలు నిలకడగా ఉన్నాయి. దీనికితోడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కూరగాయలు దిగుమతి కావడంతో ధరల్లో పెరుగుదల కనిపించలేదు. దీంతో గత నెల వరకు నగరంలోని రైతుబజార్లలో కూరగాయల ధరలు కిలో రూ. 30 నుంచి రూ. 40 వరుకు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యామ్నాయ చర్యలు కరువు సీజన్లో కూరగాయలు ఎక్కువ దిగుబడి అయితే వాటిని నిలువ చేసి అఫ్‌సీజ్‌లో ధరలు నిలకడగా ఉంచడానికి మర్కెటింగ్, హార్టికర్చర్ శాఖ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. మార్కెటింగ్ శాఖ ద్వారా కూరగాయల ధరల నిర్ధారణ లేదు. ఆఫ్ సీజన్లో మార్కెటింగ్ శాఖ ద్వారా కాకుండా ఏజెంట్లు రాష్ట్రంలో నుంచి అందుబాటులో లేని కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేస్తారు. దీంతో వారు నిర్ణయించిన ధరల ప్రకారమే ఆఫ్ సీజన్లో కూరగాయలను విక్రయించాల్సి వస్తోంది. కూరగాయల ధరలు బహిరంగ మార్కెట్లో... టమోటా కిలో రూ. 30 వంకాయ రూ. 30, బెండ రూ.50, పచ్చిమిర్చి రూ.60, కాకరకాయ రూ.50, బీరకాయ రూ.60, కాలిఫ్లవర్ రూ.50, క్యాబేజీ రూ.30, కారెట్ రూ.40, దొండ రూ.50, ఆలుగడ్డ రూ.35, గోకర రూ.60, దోస రూ.40, సొరకాయ రూ.40, పొట్లకాయ రూ. 40, చిక్కుడు రూ.60, అర్వి రూ.50,, చిలుకడ దుంప రూ.50, బీట్రూట్ రూ.30, కీర రూ.50, బీన్స్ రూ.100 క్యాప్సికమ్ రూ.40 దిగుమతి తగ్గినందునే నగర ప్రజల డిమాండ్‌కు సరిపడ కూరగాయల దిగుమతి లేనందున ధరలు పెరిగాయి. శివారు జిల్లాల నుంచి కూడా గత వారం రోజులుగా కూరగాయల దిగుమతి గణనీయంగా తగ్గింది. దీంతో ఇతర రాష్ట్రా నుంచి మార్కెట్‌కు కూరగాయల దిగుమతి చేస్తుండటంతో ధరలు పెరిగాయి. ఏటా ఫిబ్రవరి నుంచి జూలై వరకు «కూరగాయల ధరలు ఎక్కువగానే ఉంటాయి .–కే. శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి,గుడిమల్కాపూర్ మార్కెట్ -
కూరగాయలు చౌకే!
సాక్షి, సిటీబ్యూరో: ప్రతి ఏటా లోకల్ సీజన్లో కూరగాయల ధరలు తగ్గుతాయి. దీంతో నగర ప్రజలకు దాదాపు అన్ని రకాల కూరగాయలు అందుబాటు ధరల్లో లభిస్తాయి. ప్రత్యేకంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, మెదక్, నిజామాబాద్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి నగర మార్కెట్‌కు కూరగాయల దిగుమతులు పెరుగుతాయి. దీంతో దాదాపు అన్ని రకాల కూరగాయలు కిలో రూ.20 నుంచి రూ.35 మధ్యలోనే ఉన్నాయి. ప్రత్యేకంగా టమాటా, బెండకాయ, వంకాయ, చిక్కుడు, బీన్స్‌తో పాటు ఇతర కూరగాయలు కిలో ధర రూ.20–30 వరకు పలుకుతున్నాయి. గత వారం పది రోజుల నుంచి స్థానికంగా కూరగాయల దిగుమతి పెరగడంతో గతంలో ఉన్న కూరగాయల ధరలు సగానికి పడిపోయాయి. గతేడాది కంటే తక్కువ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ మొదటి వారం నుంచే కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది అన్ సీజన్ (ఫిబ్రవరి నుంచి అక్టోబర్) నెలలో కూరగాయల ధరలు ఎక్కువగా ఉండేవి. ఈ ఏడాది అక్టోబర్ చివరి వారం నుంచే నగరానికి శివారు జిల్లాల నుంచి కూరగాయల దిగుమతులు పెరిగాయి. దీంతో రేట్లు దిగొచ్చాయి. శివారు జిల్లాల నుంచి సాధారణంగా అన్ సీజన్లో నగర ప్రజల కూరగాయల అవసరాలు తీర్చడానికి కమీషన్ ఏజెంట్లు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్ నుంచి నగరంలోని బోయిన్పల్లి, గడిమల్కాపూర్, ఎల్బీనగర్తో పాటు ఇతర మార్కెట్లకు రోజుకు 70 నుంచి 80 శాతం వివిధ రకాల కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచే కూరగాయల దిగుమతులు ఉండేవి. ప్రస్తుతం నగర శివారుతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా కూరగాయల దిగుమతులు పెరగడంతో ధరలు తగ్గాయి. అందుబాటు ధరల్లో కూరగాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో రైతులు ఎక్కువగా కూరగాయలు పండిస్తున్నారు. ప్రత్యేకంగా రంగారెడ్డి, వికరాబాద్, మెదక్ జిల్లాల రైతులు ఈ ఏడాది ఆగస్టు నెల నుంచే కూగాయల సాగు చేస్తున్నారు. దీంతో అక్టోబర్ మొదటి వారం నుంచే పంట చేతికి వచ్చింది. దీంతో ఏడాది కూరగాయల ధరలు తగ్గాయి. 80 శాతం కూరగాయల అవసరాలు శివారు జిల్లాల నుంచి వచ్చే దిగుమతులతోనే తీరుతున్నాయి. ప్రస్తుతానికి ఇతర రాష్ట్రాల నుంచి ఇక దిగుమతి అవసరం లేదు. – కె.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గుడిమల్కాపూర్ మార్కెట్ -
తారల్లో కూరలు
సిటీలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మరీ ముఖ్యంగా పచ్చిమిర్చి రేటు మూడు రోజుల్లోనే రెట్టింపైంది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.80కు విక్రయిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు రూ.10 కిలో ఉన్న టమాటా రూ.30కి చేరింది. బెండ, దొండ, బీన్స్, బీరకాయ ధరలు కిలో రూ.40 దాటాయి. దీంతో మధ్య తరగతి జనం బెంబేలెత్తుతున్నారు. గ్రేటర్ ప్రజల అవసరాలకు తగినట్లుగా శివార్లలో కూరగాయల సాగు ఉండడం లేదు. దీంతో అన్నీ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగానే రేట్లు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది పచ్చిమిర్చి సాగు బాగా తగ్గిందని అందుకే ధర రెట్టింపైందని పేర్కొంటున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో బాబోయ్ ఇవేం ధరలు. వేసవిలో ఎండలతో పాటు కూరగాయలూ మండుతున్నాయి. ధరలు కుతకుత ఉడుకుతూ సామాన్యుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. పచ్చిమిర్చి మిరామిరామంటోంది. బీన్స్ బెంబేలెత్తిస్తోంది. చిక్కుడు చికాకెత్తిస్తోంది. ఇలా ఒక కూరగాయని ఏమిటి అన్నీ తామేం తక్కువ తినలేదని తార పథానికి దూసుకుపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే కాయగూరల ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోందంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతోంది. గడచిన వారం రోజుల్లో కూరగాయల ధరలు రెట్టింపు కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మే నెలలోనే ఇలా ఉంటే ఇక జూన్, జూలై నెలల్లో ధరలు ఇంకెలా ఉంటాయోనన్న ఆందోళన సగటు జీవుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో ఈ నెల మొదటి వారంలో టమాటా కిలో 15 రూపాయలు ఉంటే ప్రస్తుతం రూ.30కి ఎగబాకింది. వంకాయ రూ.15 నుంచి రూ.50 చేరింది. బెండకాయ రూ.30 ఉంటే ప్రస్తుతం రూ.60 అయింది. దొండకాయ పరిస్థితి ఇలాగే ఉంది. బీరకాయ రూ.40 నుంచి రూ.80కి చేరింది. బీన్స్, చిక్కుడు ధరలు శతకానికి చేరువలో ఉన్నాయి. రెండు మూడు రోజుల క్రితం కిలో రూ.30– 40 ఉన్న కిలో పచ్చిమిర్చి సోమవారం రూ. 80కి ఆకాశాన్నంటింది. ఇలా కూరగాయల ధరల పరిస్థితి నెలకు అవతల, నెలకు ఇవతల డబులై కూర్చున్నాయి. దీంతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండిపోతున్న ధరలు కేవలం కొనుగోలుదారులనే కాదు అమ్మకపుదారులను కూడా కష్టాల్లోకి నెట్టేస్తోంది. పావుకిలో కూడా కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అంటూ సాధారణ కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తంచేస్తుంటే.. ఏం అమ్మేటట్టు లేదు ఏం మిగిలేటట్టు లేదు అని కూరగాయల అమ్మకందారుల చెబుతున్నారు. పచ్చిమిర్చి ఘాటుకు కారణమిదే.. నగర ప్రజల పచ్చిమిర్చి అవసరాలు తీర్చడానికి శివారు ప్రాంతాల నుంచి మిర్చి దిగుమతి అవుతోంది. ఇటీవల అకాల వర్షాలతో మిర్చి పంటకు తీవ్ర ఇష్టం జరిగింది. దీంతో మిర్చి సరఫరా తగ్గిందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో నగరానికి మిర్చి సరఫరాల తగ్గింది. నగరానికి రోజు దాదాపు 12 వందల నుంచి 15 వందల క్వింటాళ్ల మిర్చి అవసరం. సోమవారం నగరానికి కేవలం సుమారు 850 క్వింటాళ్ల మిర్చి మాత్రమే వివిధ హోల్‌సేల్ మార్కెట్లకు దిగుమతి అయింది. మిర్చి తక్కువగా దిగుమతి అవడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో మిర్చి క్వింటాల్ ధర రూ.5 వేల నుంచి రూ.6వేలు పలుకుతోంది. తగ్గిన స్థానిక దిగుమతులు.. మార్కెట్‌కు ప్రస్తుతం పెద్ద మొత్తంలో టమాటా మాత్రమే దిగుమతి అవుతోంది. ఈ ఏడాది నగర శివారు జిల్లాలైన వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ రైతలు టమాటా పండించటంతో ఎక్కువగా దిగుమతి అయ్యేవి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా టమాటా దిగుమతులు ఎక్కువగా ఉండడంతో వీటి ధర కిలో రూ30 దాటలేదు. కాగా.. టమాటాతో పాటు మిగతా కూరగాయలు ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్ర్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతోనే ధరలు పెరుగుతున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేదు గ్రేటర్ హైదరాబాద్ నగర జనాభా దాదాపు కోటిమంది. వీరికి ప్రతి రోజు దాదాపు 3 వేల టన్నుల వివిధ రకాల కూరగాయలు వినియోగమవుతున్నాయి. ప్రతి ఒక్కరికి 300 గ్రాముల కూరగాయలు అవసరం. వేసవి ఆఫ్ సీజన్లో నగర ప్రజల 70 శాతం కూరగాయల అవసరాలు ఇతర రాష్ట్రాల దిగుమతులతో పూర్తవుతాయి. దీంతో డిమాండ్‌కు సరిపడా కూరగాయలు మార్కెట్‌కు రాకపోవడంతో ధరలు మండుతున్నాయి. దిగుబడులు తగ్గడంతో ధరలు పెరిగాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు ఆలస్యంగా పెరిగాయి. ఇందుకు కారణం వర్షాలు డిసెంబర్ వరకు కురిశాయి. స్థానికంగా కూరగాయల దిగుమతులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల నుంచి మిర్చి, కూరగాయల దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. – కె. శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గుడిమల్కాపూర్ మార్కెట్ -
ధరల దడ
సామాన్యుడిని నిత్యావసర వస్తువుల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఏటా వచ్చే ఆదాయం పెరగకపోయినా ధరలు మాత్రం పెరుగుతున్నాయి. పండుగల సమయాల్లో ఈ ధరలు రెండింతలు అవుతుండడంతో అప్పుచేసి పండుగలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడాన్ని పేదలు తప్పుపడుతున్నారు. తిరుపతికి చెందిన సుబ్బమ్మ నాలుగో తరగతి ఉద్యోగిని భార్య. భర్త పారిశుద్ధ్య కార్మికుడు. ఇతని నెల వేతనం రూ.10వేలు. కటింగ్‌లు పోను నెలకు రూ.9,500 చేతికి వస్తుంది. గత ఏడాది కూడా ఇదే వేతనం. సుబ్బమ్మ కుటుంబం అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలు మున్సిపల్ స్కూల్లో ఒకరు 10వ తరగతి, ఇంకొకరు 9వ తరగతి చదువుతున్నారు. భర్త సంపాదనపైనే కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. కరెంటు బిల్లుతో కలుపుకుని ఇంటి అద్దె రూ.5వేలు. బియ్యం, గ్యాస్, నిత్యావసర వస్తువులకు నెలకు మరో రూ.5వేలు ఖర్చు అవుతోంది. ఇతరత్రా ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండానే సుబ్బ మ్మ భర్త సంపాదన పోను ప్రతినెలా రూ.500 అప్పు వస్తోంది. ఇది గత ఏడాది ఖర్చు వివరాలు. అదే ప్రస్తుత ఏడాది ఇంటి అద్దె రూ.500 పెరిగింది. నిత్యావసర వస్తువుల కోనుగోళ్లకు నెలకు అదనంగా రూ.వెయ్యి ఖర్చు అవుతుంది. ప్రస్తుత ఏడాదిలో ప్రతినెలా అదనంగా రూ.1,500 అప్పు వస్తోంది. ఏటా ఖర్చులు పెరుగుతున్నా సుబ్బమ్మ భర్త వేతనం పెరగలేదు. ఎటువంటి ఆదాయమూ లేదు. సుబ్బ మ్మ ఆ ఇల్లు, ఈ ఇల్లు అని పాచిపనికి వెళితే రూ.వెయ్యి వరకు వస్తుంది. ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే ఆస్పత్రి ఖర్చు అదనం. ఇలా సుబ్బమ్మ కుటుంబానికి ఏటా ఖర్చులు పెరుగుతున్నాయి. ఆదాయం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ఇది ఒక్క సుబ్బమ్మ కుటుంబానికే కాదు జిల్లా వ్యాప్తంగా వేలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న పరిస్థితి.. ఏటా పెరుగుతున్న ధరలు ఏటా పండుగలు వచ్చాయంటే సామాన్యుడి గుండెల్లో గుబులు రేగుతోంది. ఆదాయం పెరగకపోయినా నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. కూరగాయల ధరలు ఒక్కటే కాదు ప్రతి వస్తువు ధర ఆకాశాన్నంటుతోంది. జీఎస్టీ అమలైన రోజు నుంచి వ్యాపారులు అనేక మంది ధరలు పెంచేశారు. బిల్లు వేయకపోయినా జీఎస్టీ అంటూ వినియోగదారుల నుంచి భారీ ఎత్తున వసూలు చేస్తున్నారు. బియ్యం, పప్పులు, నూనె ఇతర వస్తువుల ధరలను ç2005 నుంచి పరిశీలిస్తే రెండో రకం బియ్యం రూ.8 నుంచి రూ.45 చేరుకుంది. పప్పులు విషయానికి వస్తే రూ.30 నుంచి రూ.80 చేరాయి. గోధుమ పిండి కిలో రూ.20 నుంచి 50కి చేరింది. ఇలా ప్రతి వస్తువు ధర నాలుగు రెట్లు పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు ఇలా ఉంటే పండ్లు, పూల ధరలు కూడా పండుగ రోజు ఆకాశాన్నంటుతున్నాయి. మామూలు రోజుల్లో అయితే మూర పూలు రూ.10 ఉంటే, పండుగ రోజుల్లో రూ.25 అమ్ముతున్నారు. పండ్లు విషయానికి వస్తే సామాన్యుడు పండు కొని తినే పరిస్థితి లేదు. ఆపిల్ పండ్లు కిలో రూ.100, అరటిపండ్లు డజను రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. మధ్య తరగతి వారు కొందరు, ధనవంతులు మాత్రమే పం డ్లు కొనుగోలు చేస్తున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మండుతున్న ‘కూరగాయా’లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రాకెట్ వేగంతో పెరిగిన కూరల ధరలు ప్రజలకు గుండె దడ తెప్పిస్తున్నాయి. రాజధాని నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూరగాయలు, ఆకుకూరల ధరలు చుక్కలనంటుతున్నాయి. సరిగ్గా వారం రోజుల కిందట హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.23 ఉన్న టమాటా శుక్రవారం నాటికి రూ.50కి ఎగబాకింది. నెల రోజుల క్రితం కిలో రూ.20 ఉన్న కిలో గోరుచిక్కుడు ఇప్పుడు రూ.60కి చేరింది. మొన్నటి వరకూ రూ.3 ఉన్న ములక్కాడ నేడు రూ. 12కి పెరిగింది. కిలో రూ. 40 లేనిదే హైదరాబాద్ మార్కెట్లలో ఏ కూరగాయలూ దొరకడంలేదు. కిలో దొండ ధర అనూహ్యంగా రూ. 55కి పెరిగింది. చాలా కాలనీల్లో దుకాణాలవారు దొండ, బీన్స్ కిలో రూ.60కి కూడా అమ్ముతున్నారు. రైతు బజార్లలో కూడా బీన్స్ కిలో రూ.50కి విక్రయిస్తున్నారు. నెల రోజుల కిందటితో పోల్చితే వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరల ధరలు రెట్టింపయ్యాయి. నెల కిందట తోటకూర పెద్ద కట్ట రూ.5కు ఇచ్చేవారు. ఇప్పుడు అదే కట్ట రూ.12 నుంచి 15కు పెంచేశారు. వర్షాల వల్ల కూరగాయలు, ఆకుకూరల తోటలు దెబ్బతిన్నాయని, సరఫరా తగ్గిపోయి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాల వల్ల కూరగాయలు, ఆకుకూరల తోటలు కొంతమేరకు దెబ్బతిన్న విషయం వాస్తవమైనా.. దీని వల్లే ధరలు పెరిగాయనే వాదనలో వాస్తవం లేదు. ధరల పెరుగుదలకు వర్షాలే కారణమైతే కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చే బీన్స్, క్యారట్, క్యాప్సికం ధరలు ఎందుకు పెరిగినట్లు? బీన్స్, క్యాప్సికం కిలో రూ. 60, క్యారట్ కిలో రూ.50 పలుకుతున్నాయి. దీన్నిబట్టి మధ్య దళారులు, వ్యాపారులు వర్షాలను సాకుగా చూపి ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారని స్పష్టమవుతోంది. సామాన్యుల బాధలు పట్టని ప్రభుత్వం గతంలో కూరగాయల ధరలు పెరిగిన సమయాల్లో ప్రభుత్వం కలుగజేసుకుని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి కొంతవరకూ సరసమైన ధరలకు కూరగాయలు విక్రయించేది. ధరల నియంత్రణకు రూ.500 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన నీటిమూటలా మారింది. ‘గతంలో రూ.200 తీసుకెళితే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.500 తీసుకెళ్లినా సంచి నిండా రావడం లేదు. కూరగాయలు కొనాలంటే చికెన్ కొన్నట్లుంది. కిలో రూ.60 రూపాయలు పెట్టి బీన్స్, గోరుచిక్కుడు, దొండ ఏమి తింటాం. అందుకే వీటిని కొనడమే మానేశాం. గతంలో వారానికి రెండు కిలోల టమాటాలు కొనే మేం ఇప్పుడు కిలోతోనే సరిపెట్టుకుంటున్నాం..’ అని హైదరాబాద్‌లోని ఆదర్శనగర్‌కు చెందిన ఇందుమతి అనే గృహిణి ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతంలో కిలో చొప్పున కూరగాయలు తీసుకునే వాళ్లం. ఇప్పుడు అన్నీ అరకిలో చొప్పునే తీసుకుని సరిపెట్టుకుంటున్నాం. నేడు కూరగాయలు కొనడమంటే కందిపప్పు, మినప్పప్పు కొన్నట్లుంది..’ రాజధాని నగరంలోని శాంతినగర్‌కు చెందిన ప్రయివేటు బ్యాంకు ఉద్యోగిని నాగమణి అన్నారు. బోర్డులకే పరిమితమైన రైతు బజారు ధరలు కొద్దిగానైనా తక్కువ ధరతో లభిస్తాయని కూరగాయల కోసం రైతు బజారుకు వెళ్లిన వారికి నిరాశ తప్పడంలేదు. అక్కడ బోర్డులపై రాసిన ధరలకూ అమ్ముతున్న ధరలకూ పొంతనేలేదు. బోర్డుపై రాసిన ధరల కంటే కిలో రూ. 10 నుంచి 16 రూపాయలు అధిక ధరకు రైతు బజారులోని వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తున్నారు. బోర్డులో కిలో బీన్స్ ధర రూ.32 ఉండగా వ్యాపారులు రూ.50కి తక్కువ అమ్మడం లేదు. క్యారట్ ధర రూ.22 కాగా వ్యాపారులు రూ.40కి విక్రయించారు. క్యాబేజి ధర రూ.12 కాగా వ్యాపారులు మాత్రం రూ.30కి అమ్ముతున్నారు. బోర్డులోని ధర ప్రకారం ఎందుకు అమ్మరని ఎవరైనా ప్రశ్నిస్తే ‘మేం అమ్మేది ఇంతే నచ్చితే కొనండి.. లేదంటే వెళ్లండి’ అని వ్యాపారులు అంటుండడంతో ప్రజలకు దిక్కు తోచడం లేదు. ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేని పరిస్థితిలో రైతు బజారు అధికారులు ఉన్నారు. కిలో కూరగాయలు.. అర కిలో చికెన్! అసలే చలికాలం.. ఆపై కార్తీకమాసం.. చికెన్ ధరలు తగ్గాయి.. స్కిన్లెస్ చికెన్ కిలో రూ.90కే లభిస్తోంది. ప్రస్తుత కూరగాయల ధరలను పరిశీలిస్తే కిలో కూరగాయలు కొని వండుకుని తినడం కన్నా.. ఇద్దరు, ముగ్గురు సభ్యులున్న ఓ కుటుంబం హాయిగా అర్ధకిలో చికెన్ తెచ్చుకుని మసాలా దట్టించి లాగిస్తే బాగుండనే భావన వ్యక్తమవుతోంది. -
దిగుమతుల యోచన మానుకోరా?
సాక్షి, హైదరాబాద్: ఉల్లిపాయలు, పామాయిల్ తదితర వ్యవసాయోత్పత్తుల దిగుమతులను వచ్చే ఏడాది 50 శాతం తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని శాసనసభ అంచనాల కమిటీ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ఉత్పత్తి పెంచడంపై దృష్టిపెట్టకపోవడాన్ని కమిటీ తప్పుపట్టింది. ‘ఉల్లిగడ్డను మహారాష్ట్ర, పూలను కర్ణాటక, బియ్యాన్ని పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి, పండ్లను ఇతర రాష్ట్రాల నుంచి, పామాయిల్‌ను విదేశాల నుంచి.. దిగుమతి చేసుకోవడమేనా పని?... రైతులకు సబ్సిడీలిచ్చి ఆయా పంటలను బాగా పండించి.. ఎగుమతి చేసి ఆదాయం సమకూర్చుకోవాలనే ధ్యాసే మీకు పట్టదా? దిగుమతి ఆలోచనను అసలు మానుకోరా?’ అని శాసనసభ అంచనాల కమిటీ సభ్యులు ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో ఉద్యాన శాఖ అధికారులతో సమావేశమైన కమిటీ సభ్యులు ఉల్లిపాయలు, కూరగాయల కొరత, పామాయిల్ దిగుమతి వంటి అంశాలపై సమీక్షించారు. చెరుకు ముత్యంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కె.ఆర్.ఆమోస్, మల్లాది విష్ణు, పి.నాగేశ్వరరావు, మహేందర్‌రెడ్డి, పంతం గాంధీ తదితరులు పాల్గొన్నారు. పామాయిల్ ఉత్పత్తిలో మన రాష్ర్టం అగ్రస్థానంలో ఉన్నా... విదేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఎందుకని ప్రశ్నించారు. పామాయిల్ పంటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పామాయిల్‌ను ఎగుమతి చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఆలోచన రాకపోగా... రూ.వేల కోట్లు వెచ్చించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం శోచనీయమన్నారు. ఉల్లిపాయల తీవ్రకొరతకు దారితీసిన కారణాలను కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది ఉల్లి ధర పడిపోవడంతో గిట్టుబాటు లేదనే భావనతో రైతులు ఈ ఏడాది ఆ పంటవైపు చూడలేదని అధికారులు చెప్పారు. దీనికితోడు మహారాష్ర్టలోనే ఉల్లికి కొరత రావడంతో మన రాష్ట్రంలో ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. దీనిపై స్పందించిన సభ్యులు ఉల్లికి కొరత వస్తుందని తెలిసీ ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. -
నిత్యావసరాల ధరలు నియంత్రించండి: కిరణ్‌కుమార్‌రెడ్డి
ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉల్లిపాయలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆయన శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీకే మహంతి, ఇతర ఉన్నతాధికారులతో నిత్యావసర సరుకుల ధరలు, భారీ వర్షాలు, సీమాంధ్రలో సమ్మె తదితర అంశాలపై సమీక్షించారు. ఉల్లిపాయలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించేందుకు తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. సీమాంధ్రలో ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ సిబ్బంది సమ్మె నేపథ్యంలో రవాణాపరంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన వాకబు చేశారు. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అత్యవసర రవాణాకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వల వివరాలపై ఆరా తీశారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని సూచించారు. ఈనెల 14వ తేదీన రాష్ట్ర సగటు వర్షపాతం మూడు మిల్లీమీటర్లు కాగా శుక్రవారం 20.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం రికార్డయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఈనెల 16వ తేదీ వరకూ 398.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా ఈ ఏడాది ఇదే కాలంలో 443.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం (11 శాతం అధికంగా) నమోదైందని వారు వివరించారు. నల్లగొండ జిల్లాలో ఈనెల 13 - 15 తేదీల్లో కురిసిన వర్షాలవల్ల 6,375 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. -
కూరగాయలకూ.. ఉద్యమ సెగ
సాక్షి, హైదరాబాద్: సమైక్య ఉద్యమ సెగతో రాజధాని నగరంలో కూరగాయల ధరలు వేడెక్కాయి. సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఉధృతంగా సాగుతుండటంతో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పచ్చిమిర్చి, ఉల్లి దిగుమతి నిలిచిపోయింది. బెంగళూరు నుంచి బీన్స్, క్యారెట్, క్యాబేజి సరఫరా ఆగిపోయింది. దీంతో నగరంలో కూరగాయలకు కొరత రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు అన్ని రకాల కూరగాయల ధరలు అమాంతం పెంచేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఏ రకం కూరగాయలు కొందామన్నా కేజీ రూ.40-80ల వరకు ధర పలుకుతున్నాయి. అన్ని వర్గాల వారు నిత్యం వినియోగించే పచ్చిమిర్చి, ఉల్లి ధరలు రికార్డు స్థాయిలో ఆకాశానికి ఎగబాకాయి. బుధవారం ఉదయం గుడిమల్కాపూర్‌లోని రిటైల్ మార్కెట్లో కేజీ రూ.100లు వసూలు చేశారు. కర్నూలు ప్రాంతం నుంచి ఉల్లి దిగుమతులు నిలిచిపోవడంతో ఉల్లి ధరల్లో కూడా అనూహ్యంగా మార్పు కన్పిస్తోంది. సాధారణంగా ఇళ్లలో వినియోగించే గ్రేడ్-2 రకం ఉల్లిని సైతం కేజీ రూ.40-50ల ప్రకారం విక్రయిస్తున్నారు. మార్కెట్లో రూ.500లు వెచ్చిస్తే కూడా కనీసం చేసంచి నిండని పరిస్థితి ఏర్పడింది. రైతుబజార్లలో సైతం కూరగాయల ధరలు మండిపోతుండటంతో సామాన్య, పేద వర్గాల వారు విలవిల్లాడిపోతున్నారు. నగరంలోని 10 రైతుబజార్లకు నిత్యం 8వేల క్వింటాళ్లకు పైగా వచ్చే కూరగాయలు బుధవారం కేవలం 4వేల క్వింటాళ్లే వచ్చాయి. బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీనగర్ హోల్‌సేల్ మార్కెట్లకు అన్నిరకాల కూరగాయల దిగుమతి తగ్గిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం హోల్‌సేల్ మార్కెట్లకు 20వేల క్వింటాళ్లకు మించి సరుకు రాలేదని తెలిపారు. ఈ కొరత ప్రభావం క్రమేపీ ధరలపైపడుతూ ఐదు రోజులుగా కూరగాయల రేట్లు పెరగడం ప్రారంభమైంది. సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం ఇలాగే కొనసాగితే... రానున్న రోజుల్లో కొన్ని రకాల కూరగాయలు కేజీ రూ.100లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెటింగ్ శాఖ ధరలు బోర్డులకే పరిమితం.. మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ధరలు రైతు బజార్లలో బోర్డులకే పరిమితమవుతున్నాయి. సమీప హోల్‌సేల్ మార్కెట్లో ఉన్న ధరలను బట్టి వ్యాపారులకు కొంత లాభం వచ్చేలా మార్కెటింగ్ శాఖ రైతు బజార్లలో ధరలను నిర్ణయిస్తుంది. రైతు బజారులో అదే ధరకు కూరగాయలను రైతులు (వ్యాపారులు) విక్రయించాలి. అయితే ఇక్కడ బోర్డుల్లో ఉన్న ధర కంటే కిలోకు అయిదు నుంచి పది రూపాయల ఎక్కువ ధరలకు రైతు బజార్లలో వ్యాపారులు కూరగాయలను అమ్ముతున్నారు. ఎస్టేట్ ఆఫీసరుకు ఫిర్యాదు చేస్తామని వినియోగదారులు చెప్పినా వ్యాపారులు ఖాతరు చేయడం లేదు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు... ఇతర ప్రాంతాల నుంచి సరుకు రాకపోవడంవల్ల కొరత ఏర్పడితే నగరమంతా అదే పరిస్థితి ఉండాలి. కానీ నగరంలో ఒక ప్రాంతానికీ, మరో ప్రాంతానికి మధ్య కూరగాయల ధరల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది. ‘‘నిజంగా బయట నుంచి సరుకులు రాకపోవడంవల్ల కొరత ఏర్పడితే రైతు బజార్లలోనూ భారీగా ధరలు పెరగాలి. అయితే రైతు బజార్లలో కొంత మేరకే ధరలు పెరిగి బయట మార్కెట్లో ఎక్కువ పెరిగింది. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడమే కారణం. ఈ వ్యవహారాన్ని నియంత్రించే దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దారుణం’’ అని అధికారులే అంటున్నారు. గతంలో కూరగాయల ధరలు పెరిగిన సమయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని రైతు బజార్లలో సరసమైన ధరలకు కూరగాయలను సరఫరా చేసేది. మార్కెటింగ్ శాఖకు ఇందుకోసం నిధులు కేటాయించేది. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా మంత్రులు సచివాలయానికే రావడంలేదని, అధికార యంత్రాంగం నిద్రపోతోందని, దీంతో కూరగాయల వ్యాపారులకు కళ్లెం వేసేవారే లేరన్న విమర్శలు ఉన్నాయి. ‘‘అన్ని ధరలూ ఇలా పెరిగిపోతే జనం ఏమి తిని బతకాలి. రూ. 300 తీసుకొస్తే వారానికి సరిపడా కూరగాయలు రావడంలేదు. ఇలాగైతే జనం బతికేదెలా? ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోవడంలేదు. మంత్రులు వారి సంపాదన గురించి తప్ప జనం ఇబ్బందులను పరిష్కరిద్దామని ఆలోచించడంలేదు’’ అని విజయనగర్ కాలనీకి చెందిన విమల ఆగ్రహం వ్యక్తం చేశారు.