సాక్షి, హైదరాబాద్: అనుకున్న స్థాయిలో కంటే ఎక్కువగా వర్షాలు కురవడం..కరోనా నేపథ్యంలో డిమాండ్ పెరగడం..డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేకపోవడంతో నగరంలో ఆకు కూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వర్షాల కారణంగా శివారు జిల్లాల్లో సాగుచేసిన ఆకుకూరల పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడి పడిపోయింది. సాధారణంగా వేసవిలో మాత్రమే ఆకు కూరల ధరలు పెరుగుతుంటాయి.
కానీ ఈసారి వర్షాకాలంలోనూ ఆకుకూరలు పిరమయ్యాయి. పాలకూర గతంలో రూ.10కి ఐదు నుంచి ఆరు కట్టలు ఇచ్చేవారు. ప్రస్తుతం రెండు కట్టలకు మించి ఇవ్వడం లేదు. అలాగే మెంతి, చుక్కకూర, కొత్తిమీర, పుదీనాలది సైతం ఇదే పరిస్థితి. కరోనా కాలంలో ఆకుకూరల వినియోగం పెరిగినా అనుకున్న స్థాయిలో దిగుబడి లేదని వ్యాపారులు అంటున్నారు.
► మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ఈ సీజన్‌లో కూరగాయలు, ఆకు కూరల దిగుబడి పడిపోయింది.
► సాధారణ రోజుల్లో ఒక మార్కెట్‌కు వంద మందికి పైగా వచ్చే ఆకుకూరల రైతుల సంఖ్య..ప్రస్తుతం 30కి మించడం లేదు. దీంతో ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగాయి.
► ఇక అన్ని కూరల్లో వినియోగించే కొత్తిమీర ధర మరీ మండిపోతోంది. కొన్నిచోట్ల రూ.10కి ఒక్క కట్ట కూడా ఇవ్వడం లేదు.
చదవండి: ఆర్‌ఎంపీ డాక్టర్.. విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి..
Comments
Please login to add a commentAdd a comment