న్యూఢిల్లీ : కూరగాయల ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎండకాలంలో ఠారెత్తించిన కూరగాయల ధరలు.. వర్షకాలం ప్రారంభమైన తగ్గడం లేదు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధరలు సాధరణం కంటే మూడింతలు పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులు టమాటా కొనాలంటే భయపడిపోతున్నారు. వారం క్రితం కిలో 20 నుంచి 30 రూపాయలు పలికింది. అయితే ఉన్నట్టుండి టమాటా ధర 60 నుంచి 80 రూపాయలకు చేరింది.
ఈ ధర రూ. 100కు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పహర్గంజ్ మండి వ్యాపారులు తెలిపారు. అలాగే బెండకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. వర్షకాలం తరువాతే కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టు వారు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment