సీతమ్మధార (విశాఖ ఉత్తర): గత కొద్ది రోజులుగా రైతుబజారుల్లో టమాటా ఠారెత్తించింది. వినియోగదారులకు చుక్కలు చూపించిన టమాటా శనివారం దిగొచ్చింది. నెల రోజుల నుంచి రూ.72 పలికిన ధర శనివారం రూ.38కి లభ్యమైంది. దీంతో వినియోగదారులు అధిక సంఖ్యలో వచ్చి కోనుగోలు చేశారు. బీరకాయలు కిలో రూ.48 ఉండగా, రూ.44కు తగ్గింది. బంగాళా దుంపలు కిలో రూ.21 ఉండగా రూ.19కి దిగి వచ్చింది. క్యాబేజి మీద రెండు రూపాయలు తగ్గింది. ధరలు తగ్గడంతో శనివారం ఎక్కువ మంది వినియోగదారులు వచ్చారని రైతు బజార్ ఎస్టేట్ అధికారి వరహాలు తెలిపారు.
చదవండి: Visakhapatnam: పాడి గేదె పంచాయితీ.. ప్రాణం తీసిన క్షణికావేశం!
Comments
Please login to add a commentAdd a comment