
సాక్షి, హైదరాబాద్: టమాట ధర రోజురోజుకు పెరిగిపోతోంది. పేద, మధ్యతరగతి వర్గాలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కిలో టమాటా ధర మార్కెట్లలో రూ.130కు చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎర్రగడ్డ ప్రధాన రహదారిలో ఓ వ్యాపారి ఆటోలో టమాటలు నింపుకొని వచ్చి కిలో రూ.50 కే విక్రయించాడు. దీంతో జనం ఇలా ఎగబడ్డారు.
– సాక్షి, స్టాఫ్ ఫోటోగ్రాఫర్
మరోవైపు టమాట ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టమాటా అధిక ధరల ప్రభావం డిసెంబర్ నుంచి తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి టమాటా తాజా పంట మార్కెట్‌లోకి రావడం మొదలైతే ధరలు దిగివస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా అకాల వర్షాలు, అధిక వర్షాలతో కూరగాయల ధరలకు ముఖ్యంగా టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో రూ.100 వరకు ఉన్న టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని క్రిసిల్ అంచనా వేస్తోంది. మరో రెండు నెలల వరకు టమాటా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదని క్రిసిల్ అధ్యయనం చెబుతోంది.
చదవండి: ఏకే రావు ఉదంతంలో అనేక అనుమానాలు.. ఆత్మ‘హత్యా’?
దేశంలో టమాటా అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో సాధారణ వర్షపాతానికి మించి 105%, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణానికి మించి 40%, మహారాష్ట్రలో 22% అధికంగా వానలు నమోదయ్యాయి. దీంతో, అక్టోబర్–డిసెంబర్ కాలంలో కీలక సరఫరాదారులైన ఈ మూడు రాష్ట్రాల్లో చేతికొచ్చిన టమాటా పంట నేలపాలైందని క్రిసిల్ అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment