కరోనా సంక్షోభం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. మెరుగవుతున్న జీఎస్‌టీ వసూళ్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వరుసగా రెండో నెల కూడా దేశీయంగా జీఎస్‌టీ వసూళ్లు లక్ష కోట్లను దాటాయి.
ఆగస్టు వసూళ్లు 1.12 లక్షల కోట్లు
ఆగస్టు నెలకు సంబంధించి 1.12 లక్షల కోట్లు జీఎస్‌టీగా వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటిచింది. గతేడాదితో పోల్చితే 30 శాతం అధికంగా జీఎస్‌టీ వచ్చినట్టు తెలిపింది. ఆగస్ట్‌కి సంబంధించిన జీఎస్‌టీలో సెంట్రల్ జీఎస్‌టీ రూ. 20,522 కోట్లు, స్టేట్ జీఎస్‌టీ రూ. 26,605 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ. 56,247 కోట్లు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. వీటితో పాటు రూ.8,646 కోట్లు సెస్సుగా వసులైంది.
వరుసగా రెండో నెల
కరోనా సెకండ్ వేవ్ తర్వాత క్రమంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. ఆగస్టులో రూ. 1.12 కోట్ల జీఎస్‌టీ రాగా అంతకు ముందు జులైలో రూ. 1.16 లక్షల కోట్లు వచ్చింది. కరోనా సంక్షోభం మొదలైన తర్వాత 2020 అక్టోబరు తొలిసారిగా జీఎస్‌టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయి. ఆ తర్వాత 2021 మే వరకు ప్రతీ నెల లక్ష కోట్లకు పైగానే వస్తు సేవల పన్నుల మొత్తం దాటింది. సెకండ వేవ్ ఎఫెక్ట్‌తో 2021 జూన్‌లో మాత్రం జీఎస్‌టీ లక్షకు దిగువన రూ 92.84 వేల కోట్లకు పరిమితమైంది.
చదవండి: GST On Papad: అప్పడాలపై జీఎస్టీ !.. ట్విట్టర్‌లో రచ్చ రచ్చ
Comments
Please login to add a commentAdd a comment